జ్ఞానం లేకపోతే బతకవచ్చు ఏమో కానీ, లోక జ్ఞానం లేకపోతే బతకడం కష్టం అంటారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,281; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనుషులు ను చదివి తే, లోక జ్ఞానం వస్తుంది.

జ్ఞానం లేకపోతే బతకవచ్చు ఏమో కానీ, లోక జ్ఞానం లేకపోతే బతకడం కష్టం అంటారు పెద్దలు. కరెక్టు కదూ?

మనము చదివే పుస్తకాలు, రెండు రకాలు - ఒకటి చదువు పుస్తకాలు అంటే ఉద్యోగ ధన సంపాదన కోసం, రెండోది మంచి పురాణ పుస్తకాలు, వ్యక్తిత్వ మానసిక వికాసం మరియు తెలివి తేటలు కోసం.

మన ఛీఅచైతన్య లేదా ఓనావాయనో లేదా ఇంకో కాలేజీ హాస్టళ్లలో, ఖైదీలు గా మర బొమ్మలు గా చదివి, తోటి మనషులతో బంధం సంబంధం లేకుండా ఎదిగి, స్టేట్ రాంక్ వచ్చి, ఐఐటీలో చదివి, పేద్ద కంపెనీలో పేద్ద జీతం తో పనిచేసే అబ్బాయి కి, పెళ్ళి అయితే ఇంట్లో భార్య పిల్లలు తో, ఎలా మసలాలో తెలీదు. బయట ఇళ్ళ వారితో ఎలా మాట్లాడాలో తెలీదు. విసుగు తలనొప్పి ఇబ్బంది. అమ్మా నాన్న లేదా అత్త మామలతో అయినా మాటలంటే తలనొప్పి. ఎక్కువ గొడవలు, విడాకులు ఇలాంటి వారివే.

ఎందుకంటే ప్రేమ, కరుణ, ముద్దు ముచ్చట, సర్దుబాటు, మురిపెం, లాలింపు, పాలింపు తెలీదు. అంతా డబ్బు విసిరిన యాంత్రికముగా జరిగిపోతుంది అని అనుకుంటారు. కానీ లోకం తీరు వేరు, అందరూ దానికి సిద్దముగా ఉండరు. అర్థం చేసుకోరు.

అలాగే ఉత్త పురాణములను ముక్కు న పెట్టుకున్నా, ఉపయోగం లేదు. వాటి పరమార్ధము తెలియాలి. అందులో చెప్పిన, శకుని పాత్ర, ఎత్తులు పై ఎత్తులూ, ఆ కపట నటన, మన మీద ఎవరైనా ప్రయోగిస్తున్నారా, అని తెలుసుకోలేనప్పుడు, ఇంక పురాణములను చదివి ఉపయోగమేముంది.

మా ఊళ్ళో, డిగ్రీ చదవని వారు కూడా, జనాన్ని చదివి, కోట్లు సంపాదించారు, సొంత జనం తో కలసి మెలసి ఉండి. మరి ఎవరు గొప్ప?

అంటే, జ్ఞానం మంచిదే, ఉండాలి. కానీ లోక జ్ఞానం కూడా రావాలి. అందుకే చదువు తో పాటుగా, లోకం తీరు, లోక జ్ఞానం నేర్పాలి. అంత నేర్చుకుని నేర్పే తీరిక, తల్లి దండ్రులు కు ఉందా? పిల్లల కు సమస్యలు వస్తే ఎదుర్కొనే ధైర్యం, చాకచక్యం లేదా ఓదార్పు ఉందా?

ఉంటే, ఇన్ని ఆత్మహత్యలు, గొడవలు, విడాకులు, వృద్ధ ఆశ్రమాలు రావు కదా? తల్లి దండ్రులు కన్నీళ్ళు, కాలువలు అవవు కదా? దేవుడా, లోక జ్ఞానం, లోకం తీరు నేర్పు, నేర్చుకోవాలి అన్న పట్టుదల, ఓర్పు, సహనం, సమయం ఇవ్వు తండ్రి. తీరిక కల్పించుకునే బుద్ధి ఇవ్వు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,281; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575
Dt : 11-Mar-2020, Upd Dt : 11-Mar-2020, Category : General
Views : 3005 ( + More Social Media views ), Id : 398 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : knowledge , Worldly knowledge , coman sense
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content