ఇది మొదలూ కాదు, చివరా కాదు, నిత్యం జాగ్రత్తలు, స్నానం కు పోయినా తాళం వేసే? లాప్టాప్ మాయం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,325; 104 తత్వాలు (Tatvaalu) and views 226,425.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

It is not the beginning, nor the end, you should always be careful, even if you go to bath, first lock it. Laptop gone.

ఇది మొదలూ కాదు, అలాగే చివరా కాదు, నిత్యం జాగ్రత్తలు తో ఉండాలి, స్నానం కు పోయినా తాళం వేసే వెళ్ళాలి? లాప్టాప్ మాయం.

it-is-not-beginning-nor-end-always-careful-even-if-you-go-to-bath-first-lock-it-laptop-gone

మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు మిత్రమా. లాప్ టాప్ పోయినందుకు చింతిస్తున్నాము. దేవుడు అలాగే మన చుట్టూ ఉండే మన మంచి స్నేహ బంధ గుణవంతులు, మనకు సహాయం చేసి, వెనక్కు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆశిద్దాం.

ఇది ఈరోజు మీకు, రేపు ఇంకొకరు కు, తర్వాత మాకు అయినా జరగవచ్చు. ఇది మొదలూ కాదు, అలాగే చివరా కాదు, నిత్యం జాగ్రత్తలు తో ఉండాలి, స్నానం కు పోయినా తాళం వేసే వెళ్ళాలి.

ఇంట్లో సొంత వారినే నమ్మలేం, అంతా చాటు మాటు దాపరికం నటన కపటం, తాకట్టు పెడుతున్నారు లేదా అమ్మేస్తున్నారు లేదా పతనము చేస్తున్నారు.

అందుకే ధర్మం ను పాటిస్తూ, ధర్మం ను కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. కష్టపడి, నీతి నియమాలు తో సంపాదించిన ధనం, ఊరక పోతే ఎంత బాధో మనకు తెలుసు.

అందుకే అద్దె కు ఇచ్చే/ తీసుకునే ముందు, వ్యక్తుల మంచి చెడులు తెలుసుకుని ఇవ్వాలి/ తీసుకోవాలి. మనకు ఇల్లు ఖాళీగా ఉన్న పర్లేదు కానీ, బాక్ గ్రౌండ్ గుణ గణాలు తెలుసుకోకుండా, ధనం కు కక్కుర్తి పడి ఇవ్వము/ తీసుకోము. అది మనకే, మన కుటుంబం కే భవిష్యత్తు లో కీడు చేస్తాయి.

ఎందుకంటే రోజులు ఎప్పుడో మారాయి. వెన్నుపోటు నే సమర్థన చేస్తూ, నక్క పులి పాము కు అండగా ఉంటున్నాము. అందులోనూ బాధ్యత తెలియని, ముందు చూపు లేని, కుర్ర వయసు అంటే ఇంకా ఎన్నో జాగ్రత్తలు ఉండాలి.

వారి అమ్మా నాన్న లతో మాట్లాడుతూ, విషయం తెలుసుకోవాలి, తెలియజేయాలి వారం వారం నెల నెలా అయినా. పోనీ తల్లిదండ్రులు సరిగ్గా ఉన్నారా అదీ లేదు, పబ్బుల్లో రాత్రి జాగారం మన సొంత బండి పెట్రోల్ తో, ఇదే తగిన వయసు అని ప్రోత్సాహం. సహజీవనం, ప్రేమాయణం అయినా పర్లేదు అద్దె తగ్గితే, ఆస్తులు పెరిగితే అని పిల్లలను ప్రొత్సాహం.

ముందుగా వెంటనే పోలీసు రిపోర్టు ఇస్తే, కనీసం రికార్డు లో ఉంటుంది, ఇతరుల కు ఇటువంటి పరిస్థితుల్లో ఆశాజనకంగా ఉంటుంది. చుట్టుపక్కల అందరికీ తప్పక చెప్పి అడగండి. మేము తెలియజేస్తాం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు, కంచె చేను మేస్తే సామెతలు తెలుసు కదా.

మనకు వస్తువు వెనక్కు వచ్చినా రాకపోయినా, కనీసం దొంగలు కు భయం ఉంటుంది. మనకు తెలిసిన వారే మరియు వారి కోసం వచ్చే వారే, ఇలా చేయగలరు. వారి మాటలు చేష్టలు, ఇన్నాళ్ళు గా మీరు పసిగట్టి ఉంటే, కనుక్కోవడం పట్టుకోవడం, కనీసం భవిష్యత్తు జాగ్రత్తలు పడటం చాలా తేలిక.

అందుకే గుణం బట్టి మాత్రమే స్నేహం చేయాలి, వారి ఇంట్లో ఉండాలి, మన జాగ్రత్తలు తీసుకుంటూ, గుడ్డిగా పై మెరుగులు చూసి, అవసరం అవకాశం తో, భ్రమలు పడకుండా ఉండాలి, అది అద్దె అయినా, స్నేహం అయినా, బంధం అయినా, ఒకటే.

దొంగలు లేదా దొంగ బుద్ధి తో, ముసుగు వేసుకుని, లేదా కరెంట్ పోయినప్పుడు లేదా కటిక చీకటిలో, ఇతర జాగ్రత్తలు తోనే మన కన్నా ఎక్కువ తెలివితో వ్యవహరిస్తారు. కాబట్టి ముందు జాగ్రత్తలు ముఖ్యం. సీసీటీవీ కెమెరాల్లో అన్ని పడకపోవచ్చు, 50 శాతం నే వాటిపై ఆధారపడాలి.

అదే మన దౌర్భాగ్యం, మనిషి పై నమ్మకం పూర్తిగా పోయింది, ఎందుకంటే సొంత ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు నే ఇంట్లో పెట్టుకుంటాం చూస్తాం, వారి గురించి మంచి చెడు సమాజం తో పంచుకుంటాం, అనే మంచి మనిషి మన చుట్టూ లేరు. అలాంటి కృతజ్ఞతలు విశ్వసనీయత లేని వారికే, మన సమాజంలో గౌరవం.

పోనీ ఒకవేళ ముదుసలి వారిని చూసే వారు ఉంటే, వారిని గేళి చేస్తూ, సహాయ నిరాకరణ చేస్తున్నారు, రేపు మన బతుకు అంతే అని తెలిసీ కూడా. మన పెంపకం సంస్కారం అలా తగలబడ్డాయి మన చుట్టూ పక్కల అంటారే గానీ, మన ఇంట్లో కూడా అలాగే ఉంది అని ఎవరూ ఒప్పుకోరు, మారరు, తమ కుటుంబం ను మార్చరు.

సీసీటీవీ చూడటానికి మన వాళ్లు ఊళ్ళో లేరు. వారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. వచ్చినప్పుడు తెలియజేయగలం. వారికి చూడటం కూడా రాకపోవచ్చు. మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో కూడా లేదు, కాబట్టి మీరు చెప్పింది నిజం అని కూడా, నమ్మకం చాలా మంది కి ఉండదు.

మీ ప్రయత్నాలు మీరు చేయగలరు. ఏమి జరుగుతుందో తెలియచేయగలరు. అలాగే మేము మీకు తెలియపరచ గలము. ధన్యవాదములు, మీ వస్తువు మీకు దొరికి, మనశ్శాంతి త్వరలో కలగాలని దైవం ను ప్రార్ధిస్తూ.

* * *

పోలీసు వారు ముద్ర లు వేస్తారు కదా, కేసు ఫైల్ చేసినట్లు గా నంబరు ఇస్తారు, మన కాగితం పై, లేదా కనీసం ముట్టినవి అని రాస్తారు డేట్ ముద్ర తో.

ఎవరి ఇంట్లో ఉన్నారు అనేది స్పష్టం గా మీరు రాసిన దాంట్లో లేదు. అది కూడా కలపండి. ఫ్రెండ్ లాప్ టాప్ లేదా డీటీపీ లో టైపు చేసి ప్రింట్ తీయండి, మన రాత అందరికీ అర్థం కాకపోవచ్చు.

మీ పెద్దలు ను తీసుకుని వెళ్లి, అక్కడ నే దగ్గర లో ఉన్న డీఎస్పీ గారిని కూడా కలసి కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది ఏమో ఆలోచన చేయగలరు. అలాగే స్పందన అని జిల్లా ఎస్పీ తో ఫోన్ లేదా వెబ్సైట్ లో కూడా పెట్టగలరు.

రూం తాళం పగలకొట్టి తీసుకుని వెళ్ళారు లేదా రూం మేట్ ఉంటే పోయిందో కూడా మీరు రాయలేదు.

అన్ని వివరంగా రాయాలి. ఇక్కడ నేను ఒకడినే ఉంటున్నాను లేదా పదిమంది మి కలసి ఉంటున్నాము.

ఎవరి మీదైనా అనుమానం ఉందా ఎప్పుడూ మీ రూంకి వచ్చే వారు లేదా అక్కడ తిరిగే వారు పై.

మీరు ఊరు వెళ్లిన మూడు రోజులు, ఎవరు మిగతా గదుల్లో ఉన్నారు, ఎవరు ఇటువైపు ఎక్కువ వస్తారు. ఇవన్నీ ఆలోచన చేయగలరు.

ఈ సమాచారం కూడా కంప్లైంట్ లో ఉండాలి కదా. వారికి క్లూస్ ఇవ్వాలి లేకపోతే వారు కనిపెట్టలేరు కదా మిత్రమా. అన్ని ప్రయత్నాలు చేయండి

* * *

మీరు డ్రాఫ్ట్ రాసి పంపితే, తప్పులు సరిచేద్దాం. ఎస్పీ, డీఎస్పీ కి చేరితే, పోలీసులు వచ్చి ఇంట్లో అందరినీ అడగాలి, వెతకాలి.

లేదంటే మన కంప్లైంట్ వారు పట్టించుకోలేదు అని అర్థం☺️ అప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, రాజకీయ నాయకుల అండతో వెళ్ళాలి.

ఎలక్షన్ టైం గాబట్టి, వారూ మీకు సహాయం చేయగలరు. ముందు సీఐ, డీఎస్పీ, ఎస్పీ స్పందన వెబ్సైట్ రసీదులు మీ దగ్గర ఉండాలి.

ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ చేయవచ్చు. పెద్దలు ను అడగండి. తర్వాత నే రాజకీయ నాయకులు.


* * *

సీసీటీవీ 50 శాతం నే నమ్మకం, మన వారు ఊళ్ళో కి వస్తే, అది అడిగి తెలుసుకుందాం.

ప్రస్తుతం అది పని చేయడం లేదు అనుకో. దాని మీద ఆశ పెట్టుకుంటే, పోలీసులు సహాయం చేయరు, గమ్ముగా ఉంటారు.

కాబట్టి అందరికి వాళ్ళు అందుబాటులో లేరు, వాటి పని తనం తెలీదు అని చెప్పండి.

ఎదురు ఇంకేదైనా ఇంట్లో ఉందేమో సీసీటీవీ చూడగలరు. మనం అక్కడ ఉంటే, వెంటనే మీకు అది ఇచ్చే వాళ్ళం కదా, మన్నించాలి.

* * *
మా లాప్టాప్ పోయింది గదిలో, ఉత్తమ తల్లి దండ్రుల
కుటుంబ సంస్కార పెంపకములో, పెరిగిన వారు ఉంటే,
దయ చేసి తెచ్చి ఇవ్వగలరు, లేదా ఆచూకి చెప్పగలరు
లేదా ఇతరులను జాగ్రత్త గా ఉండమని చెప్పగలరు..

ఈ రోజు మాది పోయింది, రేపు మీది. మానవత్వం మరచిన,
కర్మ విడువదు. మనవి పోక మానవు.
కంచే చేను మేస్తే, కపటం నటనం ద్రోహం వెన్నుపోటుతో.

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. రేపు మీకైనా ఇంతే కదా.

ధర్మాన్ని కాపాడుదాం, అది మనల్ని కాపాడుతుంది.

* * *

ప్రింట్ లేదా జిరాక్స్ ఏది తక్కువ వస్తే, అది తీసుకుని, గది మరియు చుట్టుపక్కల ఉన్న అందరికీ పంచండి. తలుపు మీద, ఇంటి ఎదురు, గది గోడ కు ఇలా అందరికీ కనిపించే విధంగా, ప్లాస్టిక్ తో తేలికగా పెడితే, ఆ దొంగ బయటకు రావచ్చు, నేడో రేపో.

లేదా చిత్రం లో మాటలు మార్చి మీకు తగినట్లుగా, ఫోన్ నంబరు, పేరు పెట్టి, అందరికీ పంచండి వీలైతే.

వారి లో కొంత మార్పులు రావచ్చు, అందరికీ తెలిసింది అని. వారు వారు తర్వాత గొడవపడి నా బయట పడుతుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,325; 104 తత్వాలు (Tatvaalu) and views 226,425
Dt : 21-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 197 ( + More Social Media views ), Id : 1951 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : beginning , end , careful , bath , lock , room , laptop , gone , police
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content