పాటతో పరమార్ధం - జననీ శివకామిని - నర్తనశాల - ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, రేలంగి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,101; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Janani Siva Kaamini - Nartanasala 1963 - NTR, Savitri, SVR, Relangi

ఏమండీ మీరు ఆదిశక్తి కి పూజ చేస్తారా, ప్రతి శుక్రవారం?

మేము మంగళవారం గౌరి తల్లి కి, శుక్రవారము ఆదిశక్తి కి పూజ చేస్తాము, కొబ్బరికాయ కొడతాము, అందరికీ ప్రసాదాలు డబ్బులు పంచుతాము. గుడి కి వెళ్ళి ఒత్తులు, కొబ్బరికాయలు, నూనె కు డబ్బులు ఇచ్చి కూడా వస్తాము.

మరి మీ ముదుసలి అమ్మా నాన్న, అత్తా మామ ను మీతో ఉంచుకుని, మీకున్న ఈ భాగ్యనగర/ బెంగుళూర్/ ముంబయి/ లండన్/ న్యూయార్క్ సౌకర్యాలు వైద్యం ఇస్తున్నారు కదూ? ఆదిశక్తి ని వారానికి 2 సార్లు పూజ చేస్తున్నారు అంటే, సొంత అమ్మ అత్త లో కూడా, దేవతలును మీరు చూడగలరు. లేదంటే అమ్మ ఇచ్చిన జీవితాన్ని కొనసాగిస్తూ, అత్త ఇచ్చిన భాగస్వామి తో అన్ని సంస్కారముగా పంచుకుంటూ, సంసారిలా ఉండరు కదా? మీ పిల్లల దగ్గర దేవతలుగా మీ ముదుసలి తనములో పూజింపబడతారు, అవునా?

లేదూ వారు మీ కన్నా, దుర్మార్గులు ద్రోహులు అని, ఏళ్ళు గా వారికి మరియు అందరికీ చెప్పారా, దూరముగా ఉన్నారా?

అయ్యో ఏదో పూజలు వ్రతాలు మొక్కుబడిగా చేస్తామే గానీ, చిత్తశుద్ది వాక్సుద్ది ఈ రోజుల్లో ఎవరికి ఉందండి. అందరితో పాటూ, మేము 2 నాల్కల కపటం నటనమే. ముదుసలి అమ్మ తో మనకు పురుళ్ళు లాంటి అన్ని అవసరాలు అయాయి, ఇంక పనిలేదు. వాళ్ళు అంతే, వారి అమ్మ నాన్న ను పట్టించుకోలేదు.

అత్త తో లేని పొత్తు అవసర అవకాశ భాగస్వామితో అంటారా, ఆ భాగ్యం కాస్త వారికి, సంపాదన ఉన్నంత వరకూ, రోగం రానంత వరకు మాత్రమే. ఆ తర్వాత వీరికీ, విశ్వరూపం చూపుతాము. ఇక పిల్లల పరిస్తితి అంటారా, మన సంపాదనప్పుడే వారు మన మాట వినడం లేదు, ఇంక వారి సంపాదనలో మనల్ని చూడరు. అంతా పైన పటారం, లోన లొటారం. ఎవరినీ దేవతలుగా చూసే పరిస్తితి లేదు అండి. ఇది నేటి పరిస్తితి.

ఆదిశక్తి/ శివయ్య/ అర్ధనారీశ్వర ని పూజిస్తున్నాము, నమ్ముతున్నాము అంటే, మన అమ్మలో అత్తలో కూడా దైవాన్ని చూడాలి. ఆఖరకు గుణ సంస్కార భాగస్వామి లో కూడా, దైవాన్ని చూడాలి. ఇతర గుణ సంస్కార బంధువులు స్నేహితులు ల లో కూడా. ఆఖరకు జంతువుల లో కూడా దైవాన్ని చూడాలి. వాటిని చంపి తినకూడదు. స్తిర నిర్ణయం, ధర్మం వైపు ఉండాలి, ఓడి పోయినా, అన్ని పోయినా. అలాంటి వారే, రేపు ముదుసలి తనములో, తమ బిడ్డల దగ్గర దేవతలుగా పూజింపబడతారు.

అమ్మా, నీదరినున్న తొలగు భయాలు, నీ దయలున్న కలుగు జయాలు. నీ చరణములే నమ్మితినమ్మా, అని కన్న అమ్మకు తలవంచి, శరణము కోరితి అమ్మ, భవాని అంటూ కన్న అమ్మ పాదాలు పట్టుకుని 10 ఏళ్ళుగా, ప్రాపంచిక మోహాలకు సాక్షీభూతునిగా ఉన్నాము అని మీకు తెలిసిందే, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి. ఆదిశక్తి పూజకు అంత కన్నా అర్హత ఏముంది, పెద్ద పూజ యాగము ఏమున్నది? మాత్రు దేవోభవ అని చెప్పింది వారే కదా?

చూడండి అమ్మ పక్కన ఉంటే, ఏలినాటి శని భయం కేవలము ఆదాయం నష్టం తోనే ఆగిపోయింది, ప్రాణ హాని రోగబారి పడకుండా. ఇప్పుడు అర్ధాష్టమ శని భయం కూడా అమ్మ అండతో సగం సమయం జరిగిపోయింది. మీరు కూడా పరిపూర్ణ మైన చిత్తశుద్దితో, ముదుసలి వారి సజీవ గురువు సేవలో ఉండి, నిజమైన దైవ సేవ పూజ చేసి, మీ ముదుసలి వయసులో, అలాంటి మంచి సంస్కార వంతుల చేతిలో, దైవ స్మరణలో గడపాలని ఆశిస్తూ . . .

అమ్మా . . . అమ్మా . . .
జననీ. శివకా.మిని., జయ శుభకా.రిణి, విజయరూ.పిణి. 2 ||జననీ శివకామిని||

అమ్మవు నీ.వే. అఖిల జగా.లకు, అమ్మల గ.న్నా. అమ్మవు నీ.వే. 2
నీ చరణములే. నమ్మితినమ్మా.. 2 శరణము కో.రితి అమ్మ, భవా.ని. ||జననీ శివకామిని||

నీదరిను.న్న. తొలగు భయా.లు, నీ దయలు.న్న. కలుగు జయా.లు 2
నిరతము మా.కు. నీడగ నిలచీ. 2 జయము నీయవే అమ్మా..2 భవా.ని. ||జననీ శివకామిని||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,101; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388
Dt : 29-Feb-2024, Upd Dt : 29-Feb-2024, Category : Songs
Views : 129 ( + More Social Media views ), Id : 2042 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : janani , siva , kaamini , Nartanasala , NTR , Savitri , SVR , Relangi , Ghantasala , Narthanasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content