పాటతో పరమార్ధం - కారులో షికారు కెళ్లే (పేరడీ) - తోడి కోడళ్లు - ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, జగ్గయ్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,940,833; 104 తత్వాలు (Tatvaalu) and views 230,661.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kaarulo Shikarukelle (Parody) - Thodi Kodallu - ANR, Savitri, SVR, Jaggayya

మన శనివారం సాధనల ఫోటోలు కూడా, ఈ పాటల వీడియోలో కలిపాము ఈ నెల నుంచి, గమనించారా, వీడియో చూస్తూ? సాధనల ఫోటోలు కూడా, ఇంకా ఎక్కువ మంది జనాలకు వీటి ద్వారా వెళతాయి.

ఇంకోటి గమనించారా, మన నాన్న అమ్మ తాత నానమ్మ అమ్మమ్మలు, పాడిన పాత పాటలు ఇంకోసారి తలచుకునే భాగ్యాన్ని, మనకు దేవుడు అందించారు. నేటి తరానికి కూడా, నాటి తరం మంచి మాటలే శ్రీరామరక్ష కదూ, ఈ పేరడీ ద్వారా?

కారులో షికారు కెళ్ళే, పాలబుగ్గల, పసిడివారా, మన చేతిలోన ధనాల పొంగు, ఎలా వచ్చెనో చెప్పగలరా? దాని వెనుక ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు, ఎన్ని కబ్జాలు, ఎన్ని బెదిరింపులు, ఎంత భాగస్వామి పిల్లల మరియు ఇతరుల ఆర్తనాదాలు కన్నీరు, ఎన్ని అబద్దాలు ఉన్నాయో, కాలమే నిర్ణయం చేస్తుంది.

మిమ్ము మించిన, ప్రాణులెందరో, మండుటెండలో, మాడిపోతే, వారి చెమటల నిగ్గు మీకు, వచ్చి చేరెను తెలుసుకో అంటే, వారికి అర్ధం అవుతుందా?

ఒక సారి ధనము, ఆస్తులు, పదవి, అధికారం వచ్చింది అంటే, కాళ్ళు నేల మీద నిలబడవు, కళ్ళు ఆకాశం వైపు మాత్రమే చూస్తుంటాయి, ఇక గతము గుర్తుకు రాదు. మేము, మా పిల్లలు, మా ధనము, మా సౌకర్యాలు, మా వర్గం, అని ఒక గిరి గీసుకుని కూర్చుంటారు, నిన్నటి బీదవారు కూడా, అదొక విచిత్రం.

ఉన్నది చాలక, ఇంకా బయట అప్పు తీసుకుని, ఇంకా పెద్ద వ్యాపారం చేసి, అందరి నెత్తిన టోపీ పెడతానికి ప్రయత్నం. ప్రభుత్వ పలుకుబడి ఉంటే, ఇంక భూముల దోపిడీ, తక్కువ రేటుకో, తాకట్టుకో, సామాన్య అద్దెకో.

మరి ఇంక వారి పిల్లల మానసిక స్థితి, బుద్ది మాంద్యం ఎలా ఉంటుంది? చదువు సంస్కారం ఎక్కదు. చదువు ఎక్కినా, భాగస్వామి తో కలసి నడవ లేరు, మానసిక బలం, సమాజ శ్రేయస్సు ఉండదు. నేను నాది అంతే. డబ్బుతో దేన్నైనా కొనేయచ్చు, అని మిడిసి పడుతూ ఉంటారు. అలాంటి పెద్దలు, వారి సంతానం కోసం ఈ పాట. లక్షణాలు ఉన్న లేకపోయినా, నాయకుని/ అధికారి కొడుకు నాయకుడే/ అధికారి కావాలి అంటారు. ప్రభుత్వ ఉద్యోగం, లక్షల ఆదాయం ఉన్నా, మా పిల్లలకు రిజర్వేషన్ కావాలి అని, వారి సొంత మనుషులకే వెన్నుపోటు పొడుస్తున్నారు.

ఓ కిరాణా షాపు ఆయన, అందరి దగ్గర ధనము వడ్డీకి పెట్టించుకుని, ఆ ధనముతో భూ వ్యాపారం చేసి, కోట్లు వచ్చాక, నష్టం వచ్చింది అని, నిస్సిగ్గు గా, పెట్టుబడి పెట్టిన వారికి ఎగకొట్టారు. మరి వీరు, వారి సంతానం, మనుమలు, రేపు ఇంకోకరి చేతి లో మోసపోతారు. కర్మ విడువదు, కలకాలం.

మొన్న ఒక కోటీశ్వరుడు వైద్యుడు, తన కూతురికి (పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు) కిడ్నీ కావాలంటే, అదే ధనం పెట్టి కొనలేక పోయాడు. కొంత కాలము ప్రయత్నించి, చివరకు ఆ కూతురు ని కన్నందుకు, తనే కడుపు తీపితో, చేసుకున్న ఖర్మకు, తన కిడ్నీ ఇచ్చి బతుకు ను ఇచ్చారు. పాపపు ధనం బంధాలు స్నేహితులు, తమ బతుకును ఆదుకోలేకపోయింది. తల్లి దండ్రులకు రుణం తీర్చుకోవాల్సిన పెళ్ళైన పిల్లలు, ముదుసలి తనములో ఒంటరిగా వదలడమే కాకుండా, ఆఖరికి పెద్దల అవయవాలనే తమ బతుకు సాగుకు వాడుకుంటున్నారు.

ఒక సారి పదవి, ఆస్తి, ధనము, ఏదైనా ప్రాపంచిక అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము వస్తే, వారికి మానసిక నియంత్రణ ఉండదు. చిత్రము ఏమిటి అంటే, అవి తమను విడిచిపోయినా కూడా, మరలా తంటే, తట్టుకోలేరు, కుమిలి పోతారు.

చలువరాతి మేడలోన, కులుకుతారే, మరి మేడగట్టిన చలువరాయి, ఎలా వచ్చెనో చెప్పగలరా? అంటే చాలా మందికి తెలీదు, షాపులో కొన్నాము డబ్బు పారేసి అంటారు, అహంకారముతో. కడుపుకాలే కష్టజీవులు, ఒడలు విరిచి, గనులు తొలిచి, చమట చలువను, చేర్చి రాళ్ళను, తీర్చినారు తెలుసుకో అని మీరైనా పిల్లలకు చెపుతారా? కష్టం నేర్పిస్తారా?

గాలిలోన తేలిపోయే, నేత గట్టిన చిన్నవారా, ఆ జిలుగు వెలుగుల నేత శిల్పం, ఎలా వచ్చెనో చెప్పగలరా? అంటే, దానికీ జవాబు తెలీదు. బట్టల షాపులో కొన్నము జీన్స్, పైజమా, ఇంకేదో సూటు, చీర, సారె, రక రకాల బట్టలు అంటారు. చిరుగు పాతల, బరువు బ్రతుకుల, నేత అన్నలె నేసినారు. చాకిరొకరిది, సౌఖ్యమొకరిది, సాగదింక తెలుసుకో అంటే, వారి కళ్ళు తెరచుకుంటాయా?

అసలు పాటలో నేత గాళ్ళే అని ఉంది, మనము మర్యాద ఇస్తూ నేత అన్నలే అని మార్చి రాసి పాడాము, అందుకే పేరడీ అనాలి.

కారులో.., షికారు కెళ్ళే, పాలబుగ్గల, పసిడివారా
చేతిలోన ధనాలపొంగు, ఎలా వచ్చెనో చెప్పగలరా ||కారులో||

మిమ్ముమించిన, ప్రాణులెందరో, మండుటెండలో, మాడిపోతే...2
వారి చెమటల నిగ్గు, మీకు వచ్చి, చేరెను తెలుసుకో ..
కారులో షికారు కెళ్ళే, పాలబుగ్గల పసిడివారా
నిలిచి విను మీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

చలువరాతి, మేడలోన, కులుకుతారే, కుర్రకారా 2
మేడగట్టిన చలువరాయి, ఎలా వచ్చెనో చెప్పగలరా
కడుపుకాలే కష్టజీవులు, ఒడలు విరిచి, గనులు తొలిచి..2
చమట చలువను, చేర్చి రాళ్ళను, తీర్చినారు తెలుసుకో.
కారులో షికారు కెళ్ళే, పాలబుగ్గల పసిడివారా
నిలిచి విను మీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోన తేలిపోయే, నేతగట్టిన చిన్నవారా 2
జిలుగు వెలుగుల, నేత శిల్పం, ఎలా వచ్చెనో చెప్పగలరా
చిరుగు పాతల, బరువు బ్రతుకుల, నేత అన్నలె నేసినారు 2
చాకిరొకరిది, సౌఖ్యమొకరిది, సాగదింక తెలుసుకో
కారులో షికారు కెళ్ళే, పాలబుగ్గల పసిడివారా
నిలిచి విను మీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,940,833; 104 తత్వాలు (Tatvaalu) and views 230,661
Dt : 28-Jul-2023, Upd Dt : 28-Jul-2023, Category : Songs
Views : 249 ( + More Social Media views ), Id : 1858 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kaarulo , Shikarukelle , Parody , Thodi , Kodallu , ANR , Savitri , SVR , Jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content