Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Kallu Terachi Kanara Satyam - Raju Pedha - NTR, Lakshmirajyam, SVR
మనకు పెద్దలు ఎప్పుడూ చెపుతుంటారు ఈ మాటలు - ఒరేయ్ చిన్నోడా, కళ్ళు తెరచి కనరా ప్రాపంచిక బ్రమలు, అరిషడ్వర్గ అష్టవ్యసనములో బానిసలుగా చావవద్దు, పంచభూతాల శిక్షణ వద్దు, అసలు సత్యం ఏమిటో నిజమైన సాధన ఏమిటో, ఒళ్ళు మరచి వినరా, సర్వం నీకె బోధ పడురా అని. ఇవి నేటికీ జీవిత సత్యాలు.
ఈ పెద్దల మాటలు విన్నవారు, సంపదలు అధికారం లేకపోయినా మనశ్శాంతి గా ఉన్నారు, ముక్తి దోవలో పయనిస్తూ.
అవి వినని వారు, అంటే మనలో 80 శాతం మంది, కాల చక్రములో అశాంతితో కన్నీళ్ళు కారుస్తూ, మరలా వచ్చే జన్మలో ఇవే బాధలతో పుడుతూ, పయనిస్తున్నారు.
మేడల మిద్దెల మెలిగే వారిలో, పూరి గుడిసెలో తిరిగే వారిలో, రక్తమాంసములు ఒకటే గదరా అంటే చాలా మందికి మదికి ఎక్కదు, అంటే హెచ్చుతగ్గువలూ అన్ని హుళక్కి గదరా అంటే జీర్ణించుకోలేరు, మా తప్పుడు బుద్దుల బ్రీడ్ వేరు, మేము రాక్షసుల కన్నా నీచులము కపట నాటకాలతో అంటారు.
పరమాన్నం తిని మురిసే వారికి, పట్టె మంచముల పండే వారికి, తిన్నది అరగదు, అసలు తినలేరు రోగాలతో, అంటే బీపీ షుగర్ తో. అంబలి త్రాగీ ఆనందించే, పేదలకున్న కరుణ జాలి హాయి లేదురా వీరికి అంటే, వారు పంచభూతాల శిక్షణ వచ్చిన దాకా ఆ మాట ఒప్పుకోరు.
పదవులకోసం జుట్లు ముడేసీ, ప్రజల నెత్తిపై చేతులు పెట్టి, కన్నూమిన్నూ కానని వారికి, ఎన్నటికైనా ఓటమి తప్పదు అని మనందరికీ తెలుసు. మరి పాము నక్క పులి కి ఓటేసే, దరిద్రపు ఓటర్ల నెత్తిన చెయ్యి పెడితే తప్పు ఏమిటి, అని నాయకులు అంటే? పిండి కొద్ది రొట్టే, అలాగే ఓటర్ల బుద్ది సంస్కారం నిజాయితీ బట్టి వారి నాయకులు. విత్తు మంచిదైతే, చెట్టు మంచిదే కదా?
కాల చక్రము మారిందంటే, కధ అడ్డంగా తిరిగిందంటే, రాజే పేదై బాధలు పడును, పేదే రాజై, సుఖము జెందునూ అని కూడా మనకు పెద్దలు చూపారు. రామన్న రాజన్న శ్రీదేవమ్మ సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య కాఫీడేఅయ్య లాంటి మహానుభావులు ఆచరణలో చూపారు. అయినా మనకు బుద్ది రాదు మిత్రమా, మేలుకో.
కళ్ళు తెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 2
మేడల మిద్దెల మెలిగే వారిలో, పూరి గుడిసెలో తిరిగే వారిలో
రక్తమాంసములు ఒకటే గదరా...2 హెచ్చుతగ్గువలూ, హుళక్కి గదరా ||కళ్ళు తెరచి కనరా||
పరమాన్నం తిని మురిసే వారికి, పట్టె మంచముల పండే వారికి
అంబలి త్రాగీ ఆనందించే...2 పేదలకున్న, హాయి లేదురా ||కళ్ళు తెరచి కనరా||
పదవులకోసం జుట్లు ముడేసీ, ప్రజలనెత్తిపై చేతులు పెట్టి
కన్నూమిన్నూ కానని వారికి...2 ఎన్నటికైనా, ఓటమి తప్పదు||కళ్ళు తెరచి కనరా||
కాల చక్రము మారిందంటే, కధ అడ్డంగా తిరిగిందంటే
రాజే పేదై బాధలు పడును...2 పేదే రాజై, సుఖము జెందునూ ||కళ్ళు తెరచి కనరా||
చిత్రం : రాజు-పేద (1954); సంగీతం : ఎస్.రాజేశ్వరరావు; గీతరచయిత : కొసరాజు; నేపథ్య గానం : జిక్కి Jikki
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,425,877; 104 తత్వాలు (Tatvaalu) and views 261,706
Dt : 10-Oct-2023, Upd Dt : 10-Oct-2023, Category : Songs
Views : 470
( + More Social Media views ), Id : 1937
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Kallu ,
Terachi ,
Kanara ,
Satyam ,
Raju ,
Pedha ,
NTR ,
Lakshmirajyam ,
SVR ,
Jikki
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments