పాటతో పరమార్ధం -తెలుసుకొనవె చెల్లి(పేరడీ) -మిస్సమ్మ -ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,125,786; 104 తత్వాలు (Tatvaalu) and views 239,316.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Telusukonave Chelli/ Yuvati (Parody) - Missamma - NTR, ANR, SVR, Savitri, Jamuna

*పాటతో పరమార్ధం - తెలుసుకొనవె చెల్లి/యువతి (పేరడీ) - మిస్సమ్మ - ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున*

ఆనాటి పాటలు, ఆనాటి పరిస్తితిని బట్టి - తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ, మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని అని మహిళలకు చెప్పారు. మరి ఇప్పటి పరిస్తితి, రాత్రి పూట పబ్బులో, అవసరమైతే సహజీవనము లేదా సహసమాజము లో, కలసి మెలసి, ఎవరి అవసరాలు వారు, సమానముగా అవకాశాలను బట్టి తీర్చుకుంటున్నారు.

గుణం తో పని లేని పెళ్ళిళ్ళు, ధనం ఆస్తి పదవి అధికారం వీసా ల తాత్కాలిక బంధముతో, ఎంత ఆర్భాటముగా జరుగుతున్నాయో ఎంత అప్పు చేసి అయినా, విడాకులు అంతే ఖర్చుతో వైభవముగా జరుగుతున్నాయి. లేదు కలసి ఉంటే, రోజు ఆనందముగా అరుచుకుంటూ, సాగినంత కాలం సాగిస్తున్నారు, 20 ఏళ్ళు అయినాక అయినా విడాకులు అంటున్నారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో.

మరి ఇప్పుడు మగవారికి అవే జాగ్రత్తలు చెపుతున్నారు - తెలుసుకొనవే తమ్మి అలా నడుచుకొనవే తమ్మి, ఆడువారికి దూరముగా మగవారెపుడూ మెలగాలని అని చెప్పారు. పెళ్ళి అన్నా భయపడి ఛస్తున్నారు, సగం ఆస్తి ఇవ్వడం, పరువు టీవీలలో పేపర్లు సోషల్ మీడియాలలో పోవడం, మరియు కుటుంబం జైలు లో వారి బలా బలాలను బట్టి, పెళ్ళి పెటాకుల విడాకులతో ఎందుకని.

మరి ఆనాడు యువకులకు అండగా, ఇలా చెప్పారు - తెలుసుకొనవె యువతి, అలా నడుచుకొనవె యువతీ, యువకుల శాసించుటకే, యువతు లవతరించిరని. మరి ఈనాడు, అదే కొనసాగుతున్నది అని పై మాటలలోనే మనకు అర్ధం అవుతున్నది, మరలా వారి బలా బలాలను బట్టి సుమా, అందరికీ వర్తించదు.

మనకు ఆ గొడవలు వద్దు, అరిషడ్వర్గ అష్టవ్యసనము వద్దు అని ఇరువురికి చెప్పడమే, మన ఉద్దేశ్యము. కాబట్టి మనము ఇలా అందాము - తెలుసుకొనరె యువత అంటే ఆడా మగా ఇద్దూరు, అలా నడుచుకొనరె యువతా, చెడుతలపుకు దూరముగా, మంచివారెపుడూ మెలగాలని.

మన చుట్టూ ఎంతో మంది, వల పన్ని బ్రమల తో తెచ్చే, పది మాయలకైనా, మన మనసు, బలహీన పడకూడదని, ఆ తర్వాత ఫలితాలుగా, లేని పోని కష్టాలు, మన వెనుకనే వచ్చెదవని, తెలుసుకొనరె యువత అలా నడుచుకొనరె యువతా.

అలలు అలలుగా వచ్చే, చెడు తలంపులు కోరికలు, పాతపడిన చెల్లని విద్యలని, కేవలము త్యాగాలతో మంచివారిని, మన సాధనలతో గెలవాలని, తెలుసుకొనరె యువత అలా నడుచుకొనరె యువతా.

Parody

తెలుసుకొనరె యువత, అలా నడుచుకొనరె యువతా..., తెలుసుకొనరె యువత
చెడుతలపుకు దూరముగా, మంచివారెపుడూ మెలగాలని 2 ||తెలుసుకొనరె ||

మనకు మనమే, చెడు కడకు, పని ఉన్నా పోరాదని ఆ 2
పతనము అయి నలుగురిలో, చులకనగా అయ్యెదమని 2 ||తెలుసుకొనరె ||

పదిమాయలకైనా మనసు, బలహీన పడకూడదని ఆ 2
లేని పోని కష్టాలు, మన వెనుకనే వచ్చెదవని 2 ||తెలుసుకొనరె ||

చాలా బాగుంది, మరి మేము కొంత మంచి చెప్పవచ్చునా

తెలుసుకొనరె యువత, అలా నడుచుకొనరె యువతా..., తెలుసుకొనరె యువత
మోహబ్రమలను శాసించుటకే...ఏ ఏ ,
మోహబ్రమలను శాసించుటకే, యువత లవతరించిరని ||తెలుసుకొనరె ||

సాధింపులు బెదిరింపులు, అరిషడ్వర్గం కూడవని .. ఆ ఆ 2
హృదయమిచ్చి పుచ్చుకొనె, 2 చదువేదో నేర్పాలని, ||తెలుసుకొనరె ||

చెడు తలంపులు కోరికలు, పాతపడిన విద్యలని .. ఆ ఆ 2
త్యాగాలతో మంచివారిని 2 సాధనలతో గెలవాలని ||తెలుసుకొనరె ||

Original

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ, తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని 2 ||తెలుసుకొనవె||

మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ 2
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని 2 ||తెలుసుకొనవె||

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ 2
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని 2 ||తెలుసుకొనవె||

తెలుసుకొనవె యువతి, అలా నడుచుకొనవె యువతీ..., తెలుసుకొనవె యువతి
యువకుల శాసించుటకే...ఏ ఏ ,
యువకుల శాసించుటకే యువతు లవతరించిరని ||తెలుసుకొనవె||

సాధింపులు బెదిరింపులు, ముదితలకిక కూడవని .. ఆ ఆ 2
హృదయమిచ్చి పుచ్చుకొనె, 2 చదువేదో నేర్పాలని, ||తెలుసుకొనవె||

మూతి బిగింపులు అలకలు, పాతపడిన విద్యలని .. ఆ ఆ 2
మగువలెపుడు మొగవారిని 2 చిరునవ్వుల గెలవాలని ||తెలుసుకొనవె||



Telusukonave Chelli, Telusukonave Yuvati, Parody, Missamma, NTR, ANR, SVR, Savitri, Jamuna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,125,786; 104 తత్వాలు (Tatvaalu) and views 239,316
Dt : 29-Sep-2023, Upd Dt : 29-Sep-2023, Category : Songs
Views : 338 ( + More Social Media views ), Id : 1932 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Telusukonave , Chelli , Yuvati , Parody , Missamma , NTR , ANR , SVR , Savitri , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content