పాటతో పరమార్ధం- కళ్యాణ వైభోగమే (పేరడీ) - సీతారామ కళ్యాణం - బాలకృష్ణ, రజని - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,892,254; 104 తత్వాలు (Tatvaalu) and views 227,111.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kalyana Vaibhogame (Parody) - Seetharama Kalyanam - Balakrishna, Rajani - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

జీవితములో ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు వస్తాయి. కానీ అందులో మన తప్పు ఉండకూడదు, మన మానసిక బలహీంత ఉండకూడదు. అప్పుడు ఏ బాధలకు కుంగము, వంగము, ఓడిపోము మనము. ఈ కడగళ్ళు క్షణము మాత్రమే, ఎండాకాలం తర్వాత తప్పకుండా చలి కాలం, ఆ తర్వాత వానాకాలం, మనము వద్దు అన్నా, మనకు ఇష్టం లేకపోయినా వస్తాయి. కాబట్టి, అరిషడ్వర్గం అష్టవ్యసనం కు లొంగక, మానసిక బలముతో ఉంటే, ఆ పైన సీతా రామ కళ్యాణము ఆనందముగా కనులారా గాంచవచ్చును కదా.

భువిలో ఆ దేవతల కళ్యాణవైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే, దైవ మాంగల్యధారణ శుభలగ్నమే అంటే అర్ధం - మన ఆత్మ పరమాత్మ తో, కలవడానికి తగిన విధముగా, సాధనాలతో, మనసును అదుపులో ఉంచుకుని, అర్హత సంపాదించే, ప్రయత్నము చెయ్యాలి.

అంతే గానీ, చందాలతో వేసిన పందిట్లో పానకము వడపప్పు తెచ్చుకున్నాము, ఊరేగింపు లో పాల్గొన్నాము, రాత్రికి పొట్ట బిగిసింది వేడి చేసి. ఏమిటో, ఎన్ని కళ్యాణాలు చూసినా చేసినా, మనశ్శాంతి లేదు అంటారు చాలా మంది, అసలు కళ్యాణం అర్ధం తెలీక. రామ, సీత, హనుమాన్, లక్ష్మణ, గుణాలను మనము నిత్య జీవితములో ఆచరించాలి.

ఇందాకే అనుకున్నాము, కడగళ్ళు కొన్నాళ్ళే, అలాగే అనుకోవాలి - అనుకున్న కొన్నాళ్ళ వనవాసము, మునుముందు కావాలి శాంతి నివాసము. కానీ, మన సజీవ గురువు మరియు ప్రపంచ మానవ/ మాధవ సేవ, తుదిలేని ఆకాశము కావాలి. అప్పుడు ప్రతిరోజు నిండు పూర్ణిమా శ్రావణము, అంతా కళ్యాణవైభోగమే.

మరులెల్ల మరుమల్లె విరిమాలగా, త్యాగ మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా, మానవత్వ హృదయాల నాదాలె వేదాలుగా, మన గుణవంత అంతరంగాలే వేదికగా చేసిన, ప్రతి రోజూ కళ్యాణవైభోగమే.

తలచాము ఆ దేవ దేవుని, నిత్యము నిలిచాము ఒక దీక్షగా, మనసైన పరమాత్మే మన అంతరంగ సాక్షిగా, గెలిచాము మానసిక సాధనలు దివి మెచ్చగా, అందరికీ ఆదర్శముగా, కలకాలముందాము భువిమెచ్చగా.

Parody

ఓడిపోము మనము.. ఈ కడగళ్ళు క్షణము.. ఆ.పై.న రామకళ్యా.ణము..

కళ్యాణవైభోగమే ..2 , శ్రీ సీతారాముల కళ్యాణమే
దైవ మాంగల్యధారణ శుభలగ్నమే .. - మొత్తము 2 సార్లు

అనుకున్న కొన్నా.ళ్ళ వనవా.సము , మునుముందు కావా.లి శాంతినివా.సము . 2
మన సేవ తుదిలేని ఆకాశము .....2
ప్రతిరో.జు పూర్ణిమా శ్రా.వణము. కళ్యాణవైభోగమే ..

మరులెల్ల మరుమల్లె విరిమాలగా .., మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా .. 2
హృదయాల నాదాలె వేదాలుగా .. 2
మన అంతరంగాలే వే.దికగా. కళ్యాణవైభోగమే .....

తలచాము నిలిచాము ఒక దీక్షగా .., మనసైన పరమాత్మే సా.క్షిగా ..2
గెలిచాము సాధనలు దివి మెచ్చగా ...2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలకాలముందాము భువిమెచ్చగా

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
దైవ మాంగల్యధారణ శుభలగ్నమే .....కళ్యాణవైభోగమే .....

Original

విడిపోము మనము.. ఈ ఎడబాటు క్షణము.. ఆ.పై.న కళ్యా.ణము..

కళ్యాణవైభోగమే ..2 కళ్యాణవైభోగమే . , శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .. - మొత్తము 2 సార్లు

అనుకున్న కొన్నా.ళ్ళ వనవా.సము , మునుముందు కావా.లి మధుమా.సము . 2
మన ప్రేమ తుదిలేని ఆకాశము .....2
ప్రతిరో.జు పూర్ణిమా శ్రా.వణము.
కళ్యాణవైభోగమే ..

మరులెల్ల మరుమల్లె విరిమాలగా .., మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా .. 2
హృదయాల నాదాలె వేదాలుగా .. 2
మన అంతరంగాలే వే.దికగా.
కళ్యాణవైభోగమే .....

వలచాము నిలిచాము ఒక దీక్షగా .., మనసైన మనసొకటే సా.క్షిగా ..2
గెలిచాము కలిశాము దివి మెచ్చగా ...2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే .....కళ్యాణవైభోగమే .....  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,892,254; 104 తత్వాలు (Tatvaalu) and views 227,111
Dt : 19-Apr-2024, Upd Dt : 19-Apr-2024, Category : Songs
Views : 64 ( + More Social Media views ), Id : 2085 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kalyana Vaibhogame , Parody , Seetharama Kalyanam , Sitarama Kalyanam , Sita rama , Seetha rama , Seeta rama , Kalyanam , Balakrishna , Rajani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content