ఇంట్లో కాలు జారిన కేసీఆర్ - తుంటి మార్పిడి శస్త్రచికిత్స - రేపు మన పరిస్తితి ఏమిటి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,196; 104 తత్వాలు (Tatvaalu) and views 226,464.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*KCR slips at home - Hip replacement surgery - What is our situation tomorrow?*

మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ (షుమారు 69 ఏళ్ళు) యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది.

ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు. కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పలకరించారు.

కేసీఆర్ కు నిన్న నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. దీంతో డాక్టర్లు ఆయన్ను సాధారణ రూమ్ కు మార్చి, పోస్ట్ ఆపరేషన్ కేర్ అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వీఐపీలు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించింది. సర్జరీ తర్వాత తుంటి నొప్పి కూడా క్రమంగా తగ్గుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆయన్ను ప్రత్యేక వైద్యుల బృందం పరిశీలనలో ఉంచినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ కు సర్జరీ తర్వాత 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం అవుతుందని డాక్టర్లు ప్రకటించారు.

ఆయన త్వరగా కోలు కోవాలని దేవుని ప్రార్ధన చేద్దాము. ఆయన భవిష్యత్ కూడా, మనము గత కధనాల్లో రాసాము, ముందు జాగ్రత్తలు అవసరమని రాజకీయ భవిషత్తు గురించి. ఇది వార్త, మరి మన కధకు వద్దామా? ప్రతి వార్త నుంచి, మనకు పనికి వచ్చేది నేర్చుకోవాలి, మన జీవితం సరి చేసుకోవాలి.

రేపు మన పరిస్తితి ఏమిటి, 60 తర్వాత? 2 పిల్లలు మరియు మనుమలు, ఎంతో మంది సేవకులు అభిమానులు, ధనం ఆస్తులు పలుకుబడి బలగం ఉండి కూడా, పెద్దాయనకు ఈ అనారోగ్య పరిస్తితి తప్పలేదు. అన్ని ఉన్నా ఎందుకు ఇలా జరిగింది? ఎస్పీ బాలు కు ఎందుకు అలా జరిగింది?

మన ఆరాధ్య దైవాలు రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల, చివరి పేజీలు చదివాము. వారి కుటుంబ సభ్యులు పిల్లలు స్నేహితులు బంధువులు ఎందుకు ముందు జాగ్రత్తలు చెప్పలేదు, తీసుకోలేదు?

మనిషికి మనిషి మీద, గౌరవ దేవతా భావం, క్రుతజ్ఞత విశ్వసనీయత ఎందుకు అందరికీ ఉండటము లేదు? ఇంట్లో మనుషులను, కేవలం ఎందుకు అవసర అవకాశ ఏటీయెం లేదా ధన ఆనంద సంబంధ వస్తువులు గా చూస్తున్నారు? సంస్కారం పెద్దలు నేర్ప లేదా? లేక దైవ భక్తులు గా మనము నేర్చుకోలేమా? మాత్రు పిత్రు దేవోభవా అని నోటితో అంటూ, చేతలతో ఏమి చేస్తున్నాము? ఇదే ఉదాహరణ.

నాన్నారు మీరు పెద్ద అయ్యారు, విశ్రాంతి తీసుకోండి, ఇక చాలు అని, మధ్యతరగతి బాధ్యత కలిగిన వ్యక్తులు గా, నాన్నను ఇంట్లో కూర్చోపెట్టాము, వ్యాపారాలు వ్యవహారాలు అన్ని ఆపేసి, ధనం ఆస్తి నష్టపోయినా పర్లేదు, మనిషి ప్రాణముతో మనతో పది కాలాలు ఉంటే చాలు అని.

మరి ధనం వచ్చాక, ఈ జనం ఎందుకు అలా అనుకోరు, తమ ముదుసలి అమ్మా నాన్న అత్త మామ గురించి? ధనం ఇచ్చాము, మనుషులను ఇచ్చాం అంటారే గాని, మేము దగ్గర ఉండి ప్రేమ గౌరవము తో, దేవతలు గా పూజిస్తాము అని ఎందుకు అనరు?

మీరు ఊర్లు తిరగండి, మాకు పదవులు ఆస్తులు బలగం ఇవ్వండి అని ఎందుకు స్వార్ధం తో ఉంటారు? అలా ముదుసలి తల్లి దండ్రుల సేవ చేయని వారు, భాగస్వామి కి సంతానానికి సంస్కార సేవ చేస్తారా? పైన, ఉదాహరణలలో చేసారా? చేస్తే, వారు ఇంకా మనతో ఉండేవారేకదా? చంద్రన్న ను ఈ వయసులో ప్రయాణాలు వద్దు అని చెప్పలేమా?

ముందు సొంత ఇంటి ముదుసలి పెద్దల సేవ, ఆ తర్వాత సమాజ సేవ కాదా? మరి మనము సమాజ సేవ నిస్వార్ధం గా చేస్తుంటే, సొంత ఇంటి వారు, అలాగే ఓడించి ప్రజలు ఎందుకు పదవి తీసేసారు? ఏదో లోపం ఉంది కదా?

10+ ఏళ్ళుగా, 78+ ఏళ్ళ అమ్మను రోజు చేయి పట్టి ఎందుకు నడిపిస్తున్నాము? ఇప్పటికి 4 సార్లు పడి నా, ఆ దేవుడు ఎందుకు కాపాడారు? ఒక్క రోజు కూడా ఆసుపత్రిలో ఉంచకుండా? గట్టి నేల మీద, బాత్ రూం లో, అన్ని ప్రమాదకరమైన చోటులే కదా పడింది. ఇంట్లో మరియు బయట, ఎంత జాగ్రత్త గా, చేయి పట్టుకుని తిప్పుతున్నాము? బాత్ రూం లో కాస్త సౌండ్ రాకపోయినా, అనుమానముతో వెంటనే చెక్ చేయడము ఎందుకు?

అమ్మకోసం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం వదిలాము? వీరు ఇన్ని కోట్లు ఉన్నా కూడా, త్రుప్తి చెంది, విశ్రాంతి గా ఇంట్లో తమతో ఉంచి, సేవ చేయలేరా?

ఏమిటీ మనకి, వారికి తేడా? మనకు జీవితం ఇచ్చిన వారి మీద క్రుతజ్ఞతలు విశ్వసనీయత. వారిని దైవాలుగా పూజించాలి, అన్న తపన ఆచరణలో కనపడటమే, తపస్సు, నియమాలు, జపాలు. ఇంత కన్నా, కపట నటన దైవ పూజలు ఎందుకు?

రాముడు క్రిష్ణుడే, మానవ సేవ మాధవ సేవ అని నిరూపిస్తే, మనము సొంత ముదుసలి తల్లి దండ్రులకు అత్త మామలకు ఇరుగుపొరుగుకు, ఏమి సేవ చేస్తున్నాము? ఇప్పుడు ధనము ఆస్తులు అధికారము బలగం, కింద పడకుండా, ఆసుపత్రికి వెళ్ళ కుండా, ఆపరేషన్ అవసరము లేకుండా, ఆ అలివికాని బాధను కలగకుండా, ఆపాయా?

మరి మనము ఎందుకు ఈ పరుగులు, అప్పులు చేసి, మోసం చేసి, మేము మా కుటుంబం అన్న బ్రమలతో ఉండి, చివరలో ఎందుకు పంచభూతాల శిక్షణకు గురి అయ్యి, మానసికముగా కుంగి క్రుశించి, కన్నీ మున్నీరు గా విలపించినా, ఎవరు ఆదుకుంటారు? ఎవరు మనశ్శాంతి ని ఇస్తారు? కేవలం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడిన వారే కదా?

మరి మీరు, మీకు దగ్గర లో అలాంటి వారి సేవలో ఉంటూ, వారి తో మీరు సేవ చేయించుకుంటారు కదూ? ఇప్పటి నుంచే వెతకండి, అదే దైవ పూజ కూడా. వ్రుధాగా ప్రాపంచిక బ్రమలతో మనము పరుగులు తీస్తే, మన పిల్లలు అలాగే పరుగులు తీసి, ఇలా మనల్ని ఆసుపత్రి లో లేదా ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమములో వదులుతారు. చేసుకున్న వారికి చేసుకున్నంత.

* * *

ముదుసలి పెద్ద వారిని, ఎంత జాగ్రత్త గా పువ్వుల్లో పెట్టుకుని చూస్తే 10 ఏళ్ళు గా, ఆరోగ్యముగా నడుస్తున్నారు, పడకుండా, ఎముకలు విరగకుండా, వారాల రెస్ట్ ఆపరేషన్ లేకుండా? రేపు మన చేతిలో లేదు, కానీ నేటి ద్రుఢ సంకల్పం మనతో ఉంది కదా?

కేసీయార్ (69), నిన్న ఒడిపోక ముందు, ఆరోగ్యముగా, దిట్టముగా, అరుస్తూ, ఒంటరిగా నడుస్తున్నారు.

కానీ అమ్మ (78+) 10 ఏళ్ళుగా, చెయ్యి పట్టుకోకుండా నడవలేరు, బలహీన మనిషి. ఎవరి ఇంట్లో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఉంది? ఎవరికి మాత్రు పిత్రు దేవోభవ అన్న క్రుతజ్ఞత విశ్వసనీయత ఉంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,196; 104 తత్వాలు (Tatvaalu) and views 226,464
Dt : 11-Dec-2023, Upd Dt : 11-Dec-2023, Category : General
Views : 190 ( + More Social Media views ), Id : 1964 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : KCR , slips , Hip , replacement , surgery , situation , ktr , revant , telangana , cm
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content