పాటతో పరమార్ధం - నా పాట నీ నోట పలకాల సిలక(పేరడీ) - మూగ మనసులు - ఏఎన్ఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,744; 104 తత్వాలు (Tatvaalu) and views 226,320.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Naa Paata Nee Nota Palakala Chilaka(Parody) - Mooga Manasulu - ANR, Savitri, Jamuna

దేవుని నిత్యము ఏదో ఒకరకముగా తలచుకోవడము, ఆ దైవ సంతానన్ని ఏదో ఒక సందేశము పాట మాట పద్యము తో, అరిషడ్వర్గ అష్టవ్యసనాలకు బానిసలై, కుటుంబ పతనము చెయ్యవద్దని, తర్వాత జీవితం నరకము చేసుకుంటూ, మరో జన్మలో కూడా ఇవే బాధలతో పతనము అవ్వద్దని, రోజూ వేడుకోవటమే, మానవ సేవ మాధవ సేవ గా, నరుల సేవ నారాయణుని సేవగా, పంచభూతాల సాక్షిగా జరయటం ఏళ్ళుగా మీరు చూస్తున్నారు. కుటుంబ సంస్కార పెంపకం గల వారు, మనచి మనసుతో స్పందిస్తున్నారు.

ఓ దేవా, మీ పాట పలుకు పద్యం, నిత్యం మా నోట పలకాల దేవా, మీ బిడ్డలమైన మా అందరకూ అది అందించాలి దేవా. మీ ఆధ్యాత్మిక సాధనలో, మేము ముక్తి పొందాల దేవ అని సాధనము చేసిన, ఏ బాధలు మన జోలికి వస్తాయి? బాధలు వచ్చినా, ఎదుర్కుని ప్రశాంతముగా ఉండే అండను ఆ దేవుడే అందిస్తారు.

3 ఏళ్ళు పైన ఆదాయం లేకుండా, వేల ఖర్చుతో ఉంటూ, ముదుసలి తల్లి సేవ సజీవ గురువు సేవ గా కొనసాగించడం, అన్ని ఉత్తమ సౌకర్యాలతో, మానవ మాత్రులము మనకు సాధ్యమా? అంతా ఆ దేవుని చల్లని చూపు, ఆదర్శమూర్తులు గా మిమ్మల్ని చూపాలి. కిందద పడినా సరే, అంతా పోయినా సరే, ధర్మం నీతి న్యాయం క్రుతజ్ఞత విశ్వసనీయత స్తితప్రజ్ఞత స్తిరత్వం రుజు మార్గాలకు, ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం గా మీరు ఉండాలి, ఆయుర్వేదాన్ని ప్రపంచానికి గుర్తూ చేస్తూ అని, ఆ చల్లని తండ్రి దీవెన కాదు అంటారా?

9 ఏళ్ళుగా, మీరూ ప్రత్యక్ష సాక్షులే కదా? రేపు నవంబర్ కు 10 ఏళ్ళు వస్తాయి మిత్రమా. కపటం నటనం 2 నాల్కల ధోరణి లేని, మనసున్న మనుసులే, మనకు దేవుళ్ళు, వారితో మనసు కలిసిననాడె, మనకు వారికి తిరణాళ్ళు.

ఆ దేవుని పాట మేం పాడాల, మన జీవిత మే ఆనందముతో నడపాల. ఈ ప్రాపంచికములో, ఎన్ని మోహాలు బ్రమలు అడ్డువచ్చినా, మేము మీ, జాడనే సూడాల. మీ జాడ సూసి మేము, నిత్యము హర హరా అనాల. గోదావరి క్రిష్ణమ్మ పరవళ్ళ నురుగుల్ల, మన నిత్య సాధనలు ఉరకాల అన్న సంకల్పము తో మనము పయనించాలి మిత్రమా.

Parody

మీ పాట, మా నోట పలకాల దేవా 2
మీ సాధనలో, ముక్తిపొందాల దేవ
మీ పాట, మా నోట పలకాల దేవా
పలకాల దేవా, పలకాల దేవా
మీ సాధనలో, ముక్తిపొందాల దేవ 2

పాట మేం పాడాల, జీవిత మే నడపాల 2
లోకంలో, మేము మీ, జాడనే సూడాల 2
మీ జాడ సూసి మేము, హర హరా అనాల 2
పరవళ్ళ నురుగుల్ల, సాధనలు ఉరకాల 2 ||మీ పాట||

కన్నుల్లు మూయాల, ధ్యానాలు చెయ్యా.ల 2
దేవుడే మనమంటే., సొంతబిడ్డ అనాల 2
మీ నీడ మా జీవిత, తెరసాప కావాల.... ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓ 2
మీ సూపే సుక్కానిగ, దారి సూపాల 2 ||మీ పాట||

మనసున్న మనుసులే, మనకు దే.వుళ్ళు
మనసు కలిసిననాడె, మనకు తిరణా.ళ్ళు - మొత్తము 2 సార్లు
సూరే చంద్రుల తో.టి, సుక్కల్ల తో.టి 2
ఆటాడుకుందాము, ఆడనే ఉందాము 2||మీ పాట||

Original

నా పాట, నీ నోట పలకాల సిలక 2
నీ బుగ్గలో, సిగ్గులొలకాల సిలక
నా పాట నీ నోట పలకాల చిలక
పలకాల సిలక, పలకాల చిలక
యహా... చి కాదు. సి. సి. సిలక
పలకాల సిలక
ఆ... నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

పాట నువ్వు పాడాల, పడవ నే నడపాల 2
నీటిలో, నేను నీ, నీడనే సూడాల 2
నా నీడ సూసి నువ్వు, కిల కిలా నవ్వాల 2
పరవళ్ళ నురుగుల్ల, గోదారి ఉరకాల 2 ||నా పాట||

కన్నుల్లు కలవాల, ఎన్నెల్లు కాయాల 2
ఎన్నెలకే మనమంటే, కన్నుకుట్టాల 2
నీ పైట నా పడవ, తెరసాప కావాల ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓ 2
నీ సూపే సుక్కానిగ దారి సూపాల 2 ||నా పాట||

మనసున్న మనుసులే, మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె, మనకు తిరణాళ్ళు - మొత్తము 2 సార్లు
సూరేచంద్రుల తో.టి, సుక్కల్ల తో.టి 2
ఆటాడుకుందాము, ఆడనే ఉందాము 2||నా పాట||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,744; 104 తత్వాలు (Tatvaalu) and views 226,320
Dt : 03-Oct-2023, Upd Dt : 03-Oct-2023, Category : Songs
Views : 305 ( + More Social Media views ), Id : 1935 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Naa , Paata , Nee , Nota , Palakala , silaka , Chilaka , Parody , Mooga , Manasulu , ANR , Savitri , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content