Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Ooru marina uniki maruna - Mooga Nomu - ANR, Jamuna, SV Ranga Rao, Master Brahmaji
ఊరు మారితే, ఉనికి మారుతుందా? ధనం/ ఆస్తి/ పదవి వస్తే, పెళ్ళి అయితే, మన వారిని మరుస్తామా? మరిస్తే, మన చుట్టూ వారు అదే చేస్తారు, అప్పుడైనా నష్టం మనకేగా? అది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసల తత్వం, ఎందుకంటే వారు గోపీలు, అంటే ఊసర వెల్లులు, నెత్తిన కొమ్ములు వస్తే గతం/ మూలాలు మరుస్తారు. ఊళ్ళో ఉండీ, ముదుసలి అమ్మ అయ్యను, స్నేహితులను బంధువులను వదిలిని ఘాతకులు ఎటూ ఉన్నారు.
మీకు తెలుసు ఏళ్ళుగా, ఈ రోజుకు కూడా, 1 వ తరగతి నుంచి నేటి తెలిసిన/ తెలియని వారి దాకా, బడ్డీ కొట్టు నుంచి నాయకులు/అధికారులు దాకా, అందరినీ సందేశాలతో పలకరిస్తూ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసల తత్వం వీడమని, అలాగే మనం చెప్పిన ఆయుర్వేద పద్దతి వాడి రోగాలను నియంత్రణ చేసుకోమని, భవిష్యత్ కష్టాలు తప్పించుకోమని, పిల్లల దగ్గర దేవతలుగా పూజింపబడమని, ప్రాధేయ పడుతున్నది మీరు చూస్తున్నదే, వారు స్పందించినా స్పందించకపోయినా.
మరి ఎంత మందికి ఆ క్రుతజ్ఞత, విశ్వసనీయత ఉన్నది? ఇంకొకరిని పలకరిస్తారు, స్పందిస్తారు? ఇవే చేయని వారు, ముదుసలి తనములో సొంత అమ్మ నాన్న ను దగ్గర ఉంచుకుని, గతములో తమకు ఏ సేవలు చేసారో, అవే సేవలు అంత కన్నా ఎక్కువ చేపించ గలరా? చేయడం లేదు కదా, ఈ దుర్యోధన రావణ శూర్పణఖ లంకిణి లాంటి రాక్షస గుణ వారసులు.
అందుకే ప్రతి ఒక్కరి జీవితములో, మరలిరాని పయనంలో, విశ్రాంతి అనే మజిలీ లేదు, అందరికీ కన్నీటికి, అంతే లేదు.
బర్రెకు కొబ్బరి చెట్టుకు ఇంజెక్షన్ లు వేసి, నూనెలో తాగు నీటిలో తిండిలో కల్తీ చేసి, డాక్టర్ గా డొనేషన్ కట్టి జనాన్ని కుట్టి, అధికారిగా లంచం ఇచ్చి జనన్ని దోచి, ఓటరుగా ఆత్మను అమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేసి, ఇలా వీలైనంత, ఇతరులకు ద్రోహం చెయ్యడానికి, ప్రతి ఇంట్లో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు ఉన్నారు.
చిత్రం ఏమిటి అంటే, మరలా వారే, మేమా, మా ఇంట్లోనా, రాక్షసులా? అంటూ అబద్దాలతో జీవితం గడపి, చివరకు సొంత పిల్లలే చీత్కరిస్తే, ఒంటరిగా అనాధలుగా దూరముగా బతుకుతున్నారు. కాబట్టి మిత్రమా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసల తత్వం, వదులు నేడే.
ఎన్ని రోజులు గడచినా, తలపులే వీడవు మనల్ని, వీడేది కేవలం మనిషే, తన అవసరం, అవకాశం, ఆయువు తీరితే.
ఎంత దూరములో ఉన్నా, మమతలు ప్రేమలు బంధాలు వదులుతామా, అందరూ మనవారే అని నమ్మి, అక్కా, అన్నా, తమ్ముడూ, పిన్ని, బాబాయి బాగున్నారా అని రోజు, ఈ సందేశాలు తో పలకరింపు లేదా?
వారు ఫోన్ చేసిన వెంటనే ఫోన్ లో గొంతు మాటలు. అందుకే మనకు కపటం నటన ఉంటే, ఎవరు ఎల్లకాలం మనతో ఉండరు సుమా. ఏది మనము తలస్తే, దేవుడు అదే మనకు ఇస్తాడు, మంచా చెడా, మన బుద్దిని బట్టి.
ఆనాటి మహిళల బాధల గురించి ఈ పాట. నేడు ఇదే పాట, మగవారి దుస్తితి గురించి తిప్పి మనము పేరడీ గా పాడాలి. ఎందుకంటే అబ్బాయిలు పెళ్ళి అంటే భయపడుతున్నారు, సహ జీవనమే మేలు అని, ఆడా మగా దిగజారిపోయారు, తమ కుటుంబ పెంపక సంస్కారముతో, ఒక నాటి ఉత్తమ ఉమ్మడి కుటుంబం అండ నుంచి.
ఊరుమారినా.., ఉనికి మారునా..
మనిషి దాగినా.., మమత దాగునా..2 సార్లు మొత్తము
మరలిరాని పయనంలో.., మజిలీ లేదు..
ఆడదాని కన్నీటికి, అంతేలేదు ||ఊరుమారినా||
అనురా.గ దీ.పం, అసమా.న త్యా.గం
స్త్రీజాతి కొరకే., సృజియించె దైవం
చిరు నవ్వులన్నీ, పెరవారి కొసగి
చీకటుల లోనే, జీవించు యువతి
తలపులే వీడవు, వీడేది మనిషే
వలపులే వాడవు, వాడేది తనువే ||ఊరుమారినా||
మగవాని కే.మో., ఒకనాటి సుఖమూ
కులకాంత కదియే, కలకాల ధనమూ
తనవాడు వీడా, అపవాదు తోడా
పదినెలలమోతా, చురకత్తి కోతా
సతులకే ఎందుకు, ఈ ఘో.రశిక్ష
సహనమే స్త్రీలకూ, శ్రీ రామ రక్ష||ఊరుమారినా||
--ఆరుద్ర, ఘంటసాల, గోవర్ధన్, మూగనోము 1969
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,765,836; 104 తత్వాలు (Tatvaalu) and views 290,639
Dt : 10-Jul-2023, Upd Dt : 10-Jul-2023, Category : Songs
Views : 669
( + More Social Media views ), Id : 1828
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
ooru ,
uru ,
marina ,
uniki ,
maruna ,
mooga ,
nomu ,
anr ,
jamuna ,
sv ,
ranga ,
rao ,
master ,
brahmaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments