పవన్ను సీఎం గా చూడాలి, సూర్య - మన పాము నక్క పులి లక్షణాలు లేకుండా కష్టం అంటున్న ఓటర్లు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,972; 104 తత్వాలు (Tatvaalu) and views 243,451.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Pawan should be seen as CM, Surya - without the characteristics of our snake, fox and tiger it is difficult, the voters thoughts*

ఇక పవన్ కళ్యాణ్ 27 ఏళ్ళ సినిమా కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. అంతే కాదు 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కూడా పూర్తి చేసుకున్నారు పవర్ స్టార్. ఈ సందర్భముగా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ క్రమంలోనే దర్శకుడు సూర్య, పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సూర్య ఏమన్నారంటే, పవన్ తెరపైనే కాదు, పొలిటికల్ గాను ఒక గ్రేట్ లీడర్. ప్రజలు కోసం చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.

*రాము* - సోము విన్నావా, సూర్య ఏమన్నారో? ఏమిటి అంత మాట అనేసారు, దక్షిణాది మనిషి అయి ఉండి, మన వారసత్వ కుటుంబ బానిస పాలన తెలిసి, ప్రజాస్వామ్యం బతకదని తెలిసి, ఎలా అన్నారు? కనీసం మీటింగ్ పెడితే, 500 బిర్యాని మందు కూడా ఇవ్వరే? అలాంటి అక్రమ సంపాదన ధన బలం లేని, బినామీల నల్ల డబ్బు తో, ఓటును నోటుతో కొనని వ్యక్తిని, అంత మంచి వ్యక్తి ని మన జనం ఒప్పుకుంటారా? అసలు మన లక్షణాలు ఏవీలేవు.

*సోము* - నిజమే, భారత దేశాన్ని అలాగే ఇతర దేశాల్ని 200 సం. పైగా దోచుకుతిని ఇన్నేళ్లు బ్రతికేసిన బ్రిటన్ లో, ఇప్పుడు తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకడం లేదు, మనశ్శాంతి లేదు, అంతా అస్తవ్యస్తమే, బంద్ లు నిరసన ప్రదర్శనలు.

కానీ మన దేశంలో ప్రజలకు ఎటువంటి కష్టం రానివ్వకుండా పరిపాలిస్తున్న మోదీ, అని అంటున్నారు. ప్రపంచ దేశాలు మోడీని పొగుడుతున్నాయి. మరి మోదీని/ బీజేపీని మంచి ఓటుతో గెలిపించింది, ఉత్తరాది వారు, కాస్త కర్ణాటక వారు. మరి తెలుగు వారికి ఆ క్రెడిట్, క్రెడిబిలిటి ఉందా?

మరి తెలుగు నాట ముఖ్యముగా ఆంధ్రాలో, ఎన్ని సీట్ల లో గెలిపించారు, తెలుగు వారు? మంచి వారు మనకు నచ్చరు. మనకు రాజరిక వారసత్వ కుటుంబ వ్యవస్థ ఉండాలి, మనకు ఎన్నికలెందుకు, రాష్ట్రం కు ఇంక అప్పు దొరకని పరిస్తితి వచ్చిన దాకా, నాయకుల పిల్లలకే పదవులు ఇచ్చేస్తే, సరిపోతుంది, ధనం మిగులుతుంది, తగవులు కొట్లాటలు తగలబెట్టడాలు అరెస్ట్ లు ఉండవు.

2 వర్గాలు 2 భాగాలు పంచుకుంటే, ఏమంటావు? ఎంపీ ఎమ్మెల్యే పిల్లలే తర్వాత నాయకులు. 20 ఏళ్ళుగా మనకు ఈ బానిసత్వమే మంచిది అని, మన అగ్రవర్ణ బడుగు బలహీన వర్గాల అందరి ఓటర్ల ఏకాభిప్రాయం - 40 శాతం ఈ వర్గం, 40 శాతం ఆ వర్గం కు అనుకూలం.

అందుకే మొన్న, పవన్ కు ఒక్క సీటు ఇచ్చారు, అది కూడా, మన జగనన్న లాగేసుకుంటే, ఆనందముగా ఈలలు వేసారు, ఇదే మన ప్రజాస్వామ్య నీతి అని. పక్క పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా గోడ దూకితే, జగనన్న కౌగలించుకుంటే, ప్రజలు సంతోషముగా గంతులు వేసారు, అన్ని మనలక్షణాలే మాట తప్పడం మడమ తిప్పడం లో అని.

ఎంటీయార్, చంద్రన్న, లోకన్న, రాజన్న, జగనన్న, వారి బంధువులు, కేసీయార్, కేటీయార్, కరుణానిధి, స్టాలిన్,. . . ఈ వరుస వారసత్వం కొనసాగాలి కదా?

*రాము* - అవును నిజం మాట్లాడుతున్నావు. పవన్ గెలుపు సాధ్యం ఎలా? మన బుద్దులు నక్క, పాము, పులి లాంటివి, దోచుకో దాచుకో. మనకు నచ్చేవి కపటం, నటన, వెన్నుపోటు, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం, ద్రోహం, రౌడీ, ఫాక్షన్, అబద్దాలు, బెదిరింపులు, కేసులు, స్టేలు, దోచిన కోట్ల ఆస్తి, కుటుంబ బానిసత్వం, జన పధకాలకు కుటుంబ పేర్లు, మన కుటుంబ ఆదాయం మన కంపెనీల లాభాలు పెరగాలి రాష్ట్రం అప్పులతో తాకట్టులతో లీజులతో బినామీలతో సలహాదారులతో పతనం అవ్వాలి. ప్రజలు చేతులు చాస్తూ, దయతో వీరు మిగిలింది విసిరేసింది అందుకుని, మత్తులో ఆత్మాభిమానం చంపుకుని బతకాలి.

ఈ పై లక్షణాలు లేకపోతే మన ద్రుష్టిలో, చవట లాంటి చేత గాని నేత, మంచి ఆవు లాంటి వారిని, కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలిపించం, అపవిత్ర హ్రుదయముతో, త్రికరణ శుద్ది లేని కపట పూజలతో, కొత్త నీరు కు చోటు ఇవ్వని, బానిసత్వ రాజు వంశ పరిపాలన పాద సేవతో, ప్రజాస్వామ్యం ను పాతర వేస్తాం, అంటున్న తమ మరియు తమ పిల్లల బంగారు భవిష్యత్ గాలికి వదిలేసిన కలియుగ పాపం పెంపకం చివరి దశ చేయడం లో బిజీ బిజీ గా ఉన్న ఓటర్లు. మమ్మల్ని మార్చేది పంచభూతాలే, ప్రక్రుతి ప్రళయాలే సుమా అంటున్నారు, దైవాన్ని గేళి చేస్తూ.

*సోము* - నిజమే, కానీ జనం కు బుద్ది వచ్చి, మొన్న జగనన్నకు ఒక్క అవకాశం లాగా, పవనన్నకు అవకాశం ఇస్తే? పోనీ చంద్రన్న తో కలసి పోరాడితే?

*రాము* - ఒక మంచి చేయడానికి, ఇంకో తప్పు చేయక్కర లేదు. కేవలం ధనుర్భాణాలు లక్ష్మణుడు ఉన్న రాముడు, బలవంతుడైన, తప్పుడు బుద్ది, వాలితో, వాలి సైన్యం తో కలిస్తే, ఇంక రామాయణమే లేదు. దానికి అర్ధం లేదు.

ప్రజలు కావాలని ఓడ గొడితే, మాకు మంచి ఆవు వద్దు, కొత్త వారు వద్దు అని, గమ్ముగా ఉండటం మంచిది. ఓడటం వలన పవన్ కు నష్టం లేదు, సినిమాలు చేసుకోవచ్చు. కానీ ప్రజలకే వారి పిల్లలకే నష్టం, మరలా తమ పులి పాము నక్క బుద్ది నిరూపణ అయ్యింది. మనకు సునామీలు, కరోనాలే మిత్రులు.

అంతే గానీ, ప్రజలు చీత్కరించిన పార్టీతో గెలుపు కోసం కలిస్తే, తర్వాత ఎటూ వెన్నుపోటుకు బలి అవుతుంది. మనమూ చెడ్డవారం అవుతాము. తప్పటడుగు, గెలుపు వద్దు. ప్రజలకు ఆవు ఇష్టం లేకపోతే, పులి నక్క పాముతో నే వెళ్ళనీయి, ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? ఎవరి రాత వారే రాసుకోవడం అంటే ఇదే కదా?

ఒకవేళ గెలిపించారా, ఒక సారి పవన్ మంచి చూస్తారు, నచ్చకపోతే, వారే మరలా ఓడిస్తారు.

కొత్త చైతన్యం, కొత్త ఉగాదిలా అందరికీ రావాలి. పవన్ లాగా, ఇంకా కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచనలు రావాలి. మోదీ లాగా యోగీ లాగా, మన రాష్ట్రానికి, సొంత ధనం ఆస్తులు పెంచుకోని, ఒక ఆవు లాంటి మనిషి రావాలి.

మరి అది ప్రజల కర్మ ఖర్మ ను బట్టి ఉంటుంది సుమా అని నవ్వుకున్నారు ఇద్దరు మిత్రులు.

*Pawan should be seen as CM, Surya without our snake, fox tiger characters it is difficult voters*  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,972; 104 తత్వాలు (Tatvaalu) and views 243,451
Dt : 17-Mar-2023, Upd Dt : 17-Mar-2023, Category : Politics
Views : 506 ( + More Social Media views ), Id : 1728 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pawan , kalyan , cm , surya , snake , fox , tiger , nature , characters , difficult , voters
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content