Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. సాత్విక్ 5000 ఖర్చు పెట్టి కుటుంబం, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు, తెల్లవారు జామున 2 am దాకా , మహానందముతో, గాలి లో తేలుతూ.
ఇంట్లో అటుపక్క నుంచి అరుపులు, దరిద్రం మొదటి రోజు పెందలాడే లెగిచి స్నానం పూజ కానివ్వండి అని. పొద్దున్నే తెల్లవారుజామున 10am కి నిద్ర లేచాడు , కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒళ్ళు బద్దకం, నెప్పులు. చుట్టూ చూసుకున్నాడు , మంచం మీదే ఉన్నాడు గాలి లో లేడు. కాళ్ళు కింద పెట్టాడు , భూమే తగిలింది ఎప్పటి లాగా. కాఫీ అన్నాడు , ఎప్పటి లాగే బయట తిని, తాగి, నాకూ తీసుకు రాండి వినయంగా జవాబు. పిల్లల అరుపులు ఏడుపులు కొట్లాటలు మామూలే . రాత్రి ఎగిరిన ఆత్మీయ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు , దింపుతావా హోటల్ దగ్గర అని , చాలా బిజీ, కుదరదు అని జవాబు ఎప్పటిలాగే. ఆఫీసు లో తిట్లు మామూలే. మరి ఏమి మారింది, నిన్నటికి ఈరోజుకు , జేబుకు చిల్లి , ఒళ్ళు హూనం , వ్రృధా శ్రమ ప్రయాస.
పిల్లాడు ఊరు ఫస్ట్ అనో , ముఖ్యమంత్రి పదవి వచ్చింది అనో ఎగిరినా అర్థం ఉంది. కొత్త కాలెండర్ పుస్తకం 50 రూపాయల కో లేక ఈనాడు లో ఫ్రీ గా వస్తుంది అని ఎగరడం ఏమిటి? తెలుగు వాడినై ఉండి , ఉగాదికి కనీసం పొద్దున్నే కూడా లేవనే, పూజ గుడి ఉండదే.
పరధర్మం భయంకరమైనది అని క్రృష్ణయ్య చెప్పిన మాటలు నాకు ఎక్కవు కదా , కలికాలం అని నవ్వుకున్నాడు. వాస్తవం లోకి వచ్చి, రోజూలాగా నే, తన పని మొదలు పెట్టారు రామా, క్రృష్ణా అనుకుంటూ. ఎప్పటిలాగే. ఇంకోసారి ఈ బుద్ది తక్కువ పని చేయను, అని అనుకున్నాడు.
అవే మాటలు, తామస్ కి చెప్పాడు. తామస్ నవ్వాడు, వీడు మారడు, మరలా నాతోనే వస్తాడు అనుకొని, మాయ వదలదు అని.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,179; 104 తత్వాలు (Tatvaalu) and views 259,056 Dt : 02-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 1465
( + More Social Media views ), Id : 25 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
new year Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments