పాటతో పరమార్ధం- సాగర సంగమమే (భక్తి పేరడీ) - సీతాకోక చిలక - కార్తీక్, అరుణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,534; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Saagara Sangamame (Bhakti Parody) - Seethakoka Chilaka - Karthik, Aruna

నదులు సాగరములో కలవాలి. ఆత్మలు పరమాత్మలో కలవాలి, అంటే అన్ని సంగమమే, ఆ ప్రణవ నాదముతో, అంటే ఆ పరమ శివునితో. అది ఎలా సాధ్యం, అది మన మదిలో తలపై అంటే ఓ మహాత్తర ఆలోచన లా, ఎగసిన కడలి మాదిరిగా, మనలో అలాగే ఇలలో, దొరికిన దైవ గుణ ఆచరణ సాధన ద్వారా, అది సాధ్యమే.

ఆ కన్యా కుమారి లో, ఆ దేవ దేవుని పాదములు మేమే, ఆ కడలి కెరటమై, కడిగిన వేళ, మీ చిరు నవ్వులకే, తడబడి మోహములో పడి ప్రాపంచిక వరములు అడగని వేళ, మాలో సత్తువ రేపి, మానసిక పువ్వులు విసిరిన, పున్నమి రేయి ధ్యానము వేళ, సాగర సంగమమే అన్ని సంగమమే, ఆ ప్రణవ నాదముతో, అంటే ఆ పరమ శివునితో.

మన భారత భారతి పద సన్నిధిలో, కులమత పట్టింపులేని సాగర సంగమ శ్రుతిలో,
దేవా మా గతి మీ రని, తలపుల హారతి, హృదయము ప్రమిదగ వెలిగిన వేళ, మానస ఉరవడి, కన్నుల నీరిడి, కలసిన మనసున, సందెలు కుంకుమ, చిందిన వేళ, సాగర సంగమమే అన్ని సంగమమే, ఆ ప్రణవ నాదముతో, అంటే ఆ పరమ శివునితో.

Parody

సాగర సంగమమే.., ప్రణవా... సాగర సంగమమే.. 2
మదిలో తలపై.., ఎగసిన కడలికి 2
మనలో... ఇలలో...
మనలో ఇలలో, దొరికిన సా.ధన ||సాగర సంగమమే||

కన్యాకుమారి మీ, పదములు మే..మే.. 2
కడలి కెరటమై., కడిగిన వే.ళ.
సుమ సుకుమార, మీ నవ్వులకే..
తడబడి వరములు, అడగని వే.ళ..
అలిగిన, మా పొల, అలకలు
మాలో పులకలు రేపి, పువ్వులు విసిరిన,
పున్నమి రేయి ధ్యానము వేళ.. ||సాగర సంగమమే||

భారత భారతి, పద సన్నిధిలో
కులమత సా.గర, సంగమ శ్రుతిలో.
మా.గతి మీ.రని, తలపుల హారతి
హృదయము ప్రమిదగ, వెలిగిన వే.ళ.
మానస ఉరవడి, పరువిడి మీపద
కన్నుల నీరిడి, కలసిన మనసున,
సందెలు కుంకుమ, చిందిన వేళ ||సాగర సంగమమే||

Original

సాగర సంగమమే, ప్రణయ... సాగర సంగమమే 2
కలలే అలలై ఎగసిన కడలికి 2
కలలో... ఇలలో
కలలో ఇలలో, దొరకని కలయిక ||సాగర సంగమమే||

కన్యాకుమరి నీ పదములు నేనే 2
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ
అలిగిన నా పొల అలకలు నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ ||సాగర సంగమమే||

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళ
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ ||సాగర సంగమమే||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,534; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608
Dt : 05-Feb-2024, Upd Dt : 05-Feb-2024, Category : Songs
Views : 130 ( + More Social Media views ), Id : 2005 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Saagara , Sangamame , Bhakti , Parody , Seethakoka , Chilaka , Karthik , Aruna , Sitakoka Chiluka
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content