పాటతో పరమార్ధం - సడిసేయకో గాలి - రాజా మకుటం - ఎన్టీఆర్, కన్నాంబ, రాజసులోచన, గుమ్మడి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,284; 104 తత్వాలు (Tatvaalu) and views 226,421.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sadiseyako Gali - Raja Makutam - NTR, Kannamba, Rajasulochana, Gummadi

ఇది మనకు బాగా సరి పోయే పాట, దేవుని కైనా, తల్లి దండ్రులకైనా, పసి పిల్ల కైనా, మనకు ఇష్టమైన వారికైనా, ఇది మనము పాడుకోవచ్చు.

మొన్న అమ్మకు జలుబు జ్వరము వస్తే, టాబ్లెట్ అలాగే మన ఆయుర్వేదం మందు, కషాయం తాగించి నిద్రపుచ్చితే, చేయి వేసి బుజ్జగిస్తూ, హయి గా గుర్రు పెట్టి నిద్రపోతున్నది. ప్రపంచం తో నాకేమి పనిలేదు, అబ్బాయి ఉన్నాడు అన్న ధైర్యం.

మరి మనము జీరో కదా మొన్న, నేడు, రేపు? మరి మన ధైర్యం ఎవరు, ఆ భగవంతుడు మాత్రమే. నువ్వు తప్ప నాకేమి వద్దు అని, ప్రభుత్వ ఉద్యోగమే వదిలేసాము కదా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలాము అన్న రుజువు ఉన్నా కూడా, ఆ దయామయుడు కరుణించరా? తగిన సమయములో తగిన దోవ, ఇన్నాళ్ళు చూపించారు. మరి రజో తమో గుణ దాసులకు ఇది ఎన్ని జన్మలకు అర్ధం కావాలి, ఆచరణలోకి తేవాలి?

మరి అమ్మ నిద్ర పోతుంటే, జోరున వర్షం, ఈదురు గాలి, మెరుపులు ఉరుములు, తుఫాన్. ఆ శబ్దాలు భయంకరముగా వినపడుతున్నాయి. అప్పుడు, పంచభూతాలకు దండం పెట్టి, ఓ దేవతలారా, మా అమ్మ కాదు మా బంగారు కూతురు నిద్రపోతుంది, అమ్మకు ఇంత శబ్దము వినపడితే, భయముతో ఉలిక్కిపడి లేస్తుంది, మరలా రాత్రి అంతా నిద్రపోకపోవచ్చు జ్వరము గుర్తు వచ్చి, దయచేసి నా మాట మన్నించి కాస్త అరుపులు మెరుపులు లేకుండా, మీ పని మీరు కొనసాగించండి అని వేడుకుంటే, కాసేపటికి శబ్దాలు తగ్గాయి దేవుని దయ వలన.

సడిసేయకో గాలి, సడిసేయబోకే, బడలి, అనారోగ్యముతో నా ఒడిలో, మా ఇంటి మహా రాణి/ రాజు, పవ్వళించేనే. సడిసేయకే.

రత్నపీఠిక లేని, రారాజు నా స్వామి (రాణి మా దేవత), మణి కిరీటము లేని, మహ రాజు/రాణి గాకేమి. చిలిపి పరుగుల మాని, కొలిచిపోరాదే. సడిసేయకే. అని ఆ వాయుదేవుని వేడుకుందామా. మనలోని సాత్విక గుణాలే, మన ఇంట్లో, అమ్మలో, మన మిత్రులు బంధువులలో, ఆరోగ్య రక్షణను, మానసిక శాంతిని పెంచుతాయి సుమా.

సడిసేయకో గా.లి, సడిసేయబో.కే (2)
బడలి, ఒడిలో.. రాజు, పవ్వళించే.నే.
సడిసేయకే...

రత్నపీ.ఠిక లే.ని, రారాజు నా స్వా.మి
మణికిరీ.టము లే.ని, మహరాజు గాకే.మి
చిలిపి పరుగుల మా.ని, కొలిచిపో.రా.దే..
సడిసేయకే...

ఏటి గల గలలకే, ఎగసి లేచేనే..
ఆకు కదలికలకే, అదరి చూచే.నే.
నిదుర చెదరిం.దంటే, నేనూరుకో.నే..
సడిసేయకే...

పండు వెన్నెలనడిగి, పానుపు తేరా.దే.
నీడ మబ్బులదా.గు, నిదుర తే.రా.దే.
విరుల వీవన బూ.ని, విసిరి పో.రా.దే.

సడిసేయకో గా.లి, సడిసేయబో.కే
బడలి, ఒడిలో.. రాజు, పవ్వళించే.నే., సడిసేయకే...  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,284; 104 తత్వాలు (Tatvaalu) and views 226,421
Dt : 19-Feb-2024, Upd Dt : 19-Feb-2024, Category : Songs
Views : 114 ( + More Social Media views ), Id : 2030 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sadiseyako Gali , Raja Makutam , NTR , Kannamba , Rajasulochana , Gummadi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content