చిల్లర దేవుళ్ళు-శ్రీ లక్ష్మి నీ మహిమలో, కలువకు చంద్రుడు, పాడాలనే ఉన్నది, ఏటికేతం పట్టి ఎయిపుట్లు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1490 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1525 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను సవివరంగా దాశరథి రంగాచార్యులు రచించిన నవలల్లో చిల్లర దేవుళ్లు మొదటి నవల. మనిషి వెట్టిచాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతాడో కూడా తెలిపారు.

చిల్లర దేవుళ్ళు... ఈ సినిమా పేరు వినగానే మనకు చాలా బాగా తెలిసిన పాటలు బాలుగారి, దూరముగా ఉంటే ఎంతో అనురాగం ఉంటుంది అని సాగే కలువకు చంద్రుడు, అలాగే భక్తి రస గౌరమ్మ బతుకమ్మ పాట, ఎంత కష్టం చేసినా మెతుకు దొరకక పడే బాధలను చెప్పే ఏటికేతం పట్టి ఎయిపుట్లు పండించి మరియు పాట పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసున్న మనిషుంటే, లాంటివి ఒకప్పుడు రేడియో లో ఎప్పుడు వినిపించే పాటలు.

1960 నాటికి దాశరథి గారు అన్నట్లు, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండినా ఎన్నడూ మెతుకెరుగరన్నా.. అన్న పాటను ఉటంకిస్తూ.. అందులో వచ్చే కాకి.. దోపిడీదారులకు సూచిక.

1) శ్రీ లక్ష్మి నీ మహిమలో గౌరమ్మ, చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ॥2॥

భారతీ సతివైయూ బ్రహ్మకిల్లాలివై, పార్వతీ దేవివై పరమేశురాణివై 2
పరగశ్రీ లక్ష్మీ వైయూ గౌరమ్మ, భార్యవైతివి హరికినీ. . ||శ్రీలక్ష్మి నీ మహిమలు||

ఎన్నెన్నో రూపముల ఏడేడు లోకముల, ఉన్న జనులకు కోర్కెలన్ని సమకూర్చుచు 2
కన్న తల్లి వైతివీ, గౌరమ్మ, కామధేను వైతివీ... ||శ్రీలక్ష్మి నీ మహిమలు||

బంగారు పువ్వులు బతుకమ్మలని పేర్చి, మంగళంబని నిన్ను మధ్యనా నిల్పియు 2
రంగు గుమ్మడి పువ్వులూ, గౌరమ్మ, రాశి గా నర్చింతురు ||శ్రీలక్ష్మి నీ మహిమలు||

నూటొక్క పువ్వుల కోటి నోముల నోమి, నీటుగా కాంతలు ఆటపాటలతో 2
మాటికి నిను మెప్పుగా, గౌరమ్మ, మంగళంబులు పాడగా ||శ్రీలక్ష్మి నీ మహిమలు||

Srilaxmi Nee Mahimalu Gowramma - Chillara Devullu - 1977


2) కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం...
దూరమైనా కొలదీ పెరుగును అనురాగం 2
విరహంలోనే ఉన్నది అనుబంధం ||కలువకు చంద్రుడు||

నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది, అది కలిమి లేములను మరిపిస్తుంది ||కలువకు చంద్రుడు||

వలపు కన్నా తలపే తీయన, కలయిక కన్నా కలలే తియ్యన
చూపుల కన్నా ఎదురు చూపులే తియ్యన, నేటికన్నా రేపే తీయన ||కలువకు చంద్రుడు||

మనసు మనిషిని మనిషిగా చేస్తుంది, వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండు లేక జీవితమేముంది, ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది ||కలువకు చంద్రుడు||


3)ఆఆఆఆఆఆఆఆఆఆ, ఆఆఆఆఆఆఆఆఆఆ
పాడాలనే ఉన్నది..వినిమెచ్చి..మనసిచ్చే(మనసున్న) మనిషుంటే
పాడాలనే ఉన్నది.., వినిమెచ్చి..మనసిచ్చే(మనసున్న) మనిషుంటే, పాడాలనే ఉన్నది..

పాడాలంటే, హృదయం ఉండాలి.. 2, హృదయానికి, ఏదో కదలిక రావాలి 2
భావం పొంగాలి…రాగం పలకాలి.., దానికి జీవం పోయాలి..ఈఈఈ 2
పాడాలనే ఉన్నది..

వినిమెచ్చి..మనసిచ్చే మనిషుంటే, పాడాలనే ఉన్నది..

పాడానంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి ఈఈఈ 2
ముసుగులు తొలగాలి.., మసకలు పోవాలి, గడిలో దేవత కనుతెరవాలి.. 2

పాడాలనే ఉన్నది..వినిమెచ్చి..మనసిచ్చే(మనసున్న) మనిషుంటే, పాడాలనే ఉన్నదీ..దీ.ఈఈఈ


4) ఏటికేతం పట్టి ఎయిపుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరగరన్నా
నేను గంజిలో మెతుకెరగరన్నా 2

కాల్జేయి కడుక్కొని కటమీద కూసుంటె 2
కాకి తన్నీ పోయెరన్నా - కాకిపిల్ల తన్నీ పోయెరన్నా

పోరుకూ జాల్లేక పొయికాడ కూసుంటె 2
పోరి దన్నీ పోయెరన్నా - పోరితల్లీ దన్నీ పోయెరన్నా ||ఏటికేతం||

చుక్కపొద్దున లేచి బొక్కె నెత్తా బోగ, బొక్క బోర్లా పడితిరన్నా 2
నాదేటి బ్రతుకాయెరన్నా, నేను నాడే చావకపోతిరన్నా


చిత్రం : చిల్లర దేవుళ్ళు (March 11 1977)
నటీ నటులు: కాంచన, సావిత్రి, రమాప్రభ, ఉమాభారతి, భానుప్రకాష్, వినయ్ కుమార్,త్యాగరాజు, ప్రభాకర్ రెడ్డి Kanchana, Savitri, Ramaprabha, Uma Bharti, Bhanuprakash, Vinay Kumar, Thyagaraju, Prabhakar Reddy
గీత రచయిత : ఆచార్య ఆత్రేయ
సంగీతం : K.V. మహదేవన్

Srilaxmi Nee Mahimalo Gowramma, kaluvaku chandrudu, padalani unnadi, etiketam patti - Chillara Devullu  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1525 General Articles, 51 Tatvaalu
Dt : 04-May-2022, Upd Dt : 04-May-2022, Category : Songs
Views : 150 ( + More Social Media views ), Id : 1379 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : srilakshmi , mahimalo , gowramma , kaluvaku , chandrudu , padalani , etiketam , chillara , devullu , Kanchana , Savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content