కుక్కల్ని జాలీగా తిప్పుతున్నారు, కారు విమానాలు ట్రిప్పుల్లో, మరి కన్న అమ్మ నాన్న ఏమి పాపం చేసారు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,855; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Taking dogs along with them happily, in car plane trips, what sin did the Parents/ in-laws?

Older parents service does not mean taking pinchan/ money/ property, putting in the room and tying up and kicking all the time. They should not think that why we are still alive along with them. Selflessly, serving as deities with us, holding hands with us, showing all - they have fun and happiness. Taking dogs along with people happily, in car plane trips, what sin did the parents?

*ముదుసలి అమ్మ నాన్న సేవ అంటే, పించన్/ ధనం/ ఆస్తి తీసుకుని, గదిలో పెట్టేసి కట్టేసి, వేళకు ఇంత ముద్ద, తిట్లు, తన్నులు, వెయ్యడం కాదు. ఎందుకు వీరి పంచన బతికి ఉన్నాము అని అనుకోకూడదు. నిస్వార్ధముతో, మనతో ఉంచి దేవతలుగా సేవ చేస్తూ, మనతో చేతులు పట్టుకుని, అన్ని తిప్పాలి - వారికి సరదాలు సంతోషాలు ఉంటాయి. కుక్కల్ని జాలీగా తిప్పుతున్నారు, కారు విమానాలు ట్రిప్పుల్లో, మరి కన్న అమ్మ నాన్న ఏమి పాపం చేసారు*

ఈ మధ్య కారులో, మన పాటలే, మనం వినడం. రోడ్డు న లేదా గుడి లో, మన పాట అలా వస్తుంటే, పక్క తెలుగు జనాలు, ఇదేం పాట అసలు అర్థం మారిపోయింది, ఈ రాగాలు రాని, అమాయక గాయక చక్రవర్తి ఎవరూ అని ఆశ్చర్యం.

ప్లేలిస్టు ఒకటి పెడితే, అలా సాగుతూ ఉంటుంది, గంట అయినా. లేటెస్ట్ ఈవారం పాటలు. పుణ్యం పురుషార్ధాలు ఉంటాయి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కూడా మనలో ఉండదు/ కొత్తగా రాదు, ఆ పాటలు నిరంతరం వింటుంటే.

***

యాత్రలు, మనశ్శాంతి కోసం ధనం ఖర్చుతో ఊళ్ళెమ్మట తిరగకుండా, మనకు ఉన్న చోటనే మనశ్శాంతి ఉంది కదా 9 ఏళ్ళుగా, ఎన్ని కష్టాలు కన్నీళ్లు వచ్చినా, 3+ ఏళ్ళు పైగా రూపాయి ఆదాయం లేకపోయినా, అమ్మ సజీవ గురువు సేవ ఆగకుండా, అప్పు అమ్మకం లేకుండా.

మానసిక బలం, స్తిరత్వం లేనప్పుడు, కష్టం సుఖం వింటూ, ధైర్యం చెప్పేవారు, తోడు లేకపోతే, ఎక్కడ కూడా మనశ్శాంతి ఉండదు మిత్రమా. మన మనసే మన శత్రువు, మిత్రులు.

నేను మానసిక నియంత్రణ, మనశ్శాంతి నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి అయినా, ఉన్న చోటనే ఉన్న స్ధితి లో, రూపాయి ఖర్చు లేకుండా, అనాలి మీరు.

మనం చెప్పేది అంతా, మనల్ని పొగడటం/తిట్టడం కు కాదు, మీ నుండి - మేము లేదా మా కుటుంబం బంధువులు స్నేహితులు లో ఒకరైనా ఇలా చేయగలం, చేస్తున్నాం అన్న హృదయం స్పందన ఉండాలి.

***

మన గోడు ఏదైనా అరగంట అయినా వినాలి, ఆడ మగ అయినా సమానం గౌరవం తిట్టు ఉండాలి, పక్షపాతం ఉండకూడదు, పాపభీతి ఉండాలి, కపటం నటన రెండు నాల్కల ధోరణి ఉండకూడదు, తన పనులు స్టేటస్ లో అందరికీ తెలియాలి నిజ నిర్ధారణకు,

మనల్ని ఓదార్చడం, ధైర్యం చెప్పడం, తల్లి తండ్రి గురువు శిష్యుడు అన్న అక్క లా అక్కున చేర్చుకోవాలి,

అన్ని గోప్యంగా ఉంచాలి, ఆఖరికి తల్లి బిడ్డ భార్య భర్త అయినా, రహస్య సమాచారం చెప్పకూడదు/ పంచకూడదు,

క్రిష్ణుడు లా మనల్ని తిట్టాలి కూడా తప్పు ఉంటే, ఏరోజు మనల్ని మన తప్పు దోవను, ఎటువంటి పరిస్తితిలో సమర్ధన చేయకూడదు.

కనీసం 5 ఏళ్ళు సజీవ గురువు సేవ చేసి ఉండాలి, కనీసం 100 వారాలు 108 ప్రదక్షిణలు చేసి ఉండాలి, కనీసం 5 ఏళ్ళు శాఖాహారం తో నేల నిద్ర, కనీసం 20 నెలలు శిరోముండనం తో ఉండాలి? ఉన్నారా, మీకు ఎవరైనా?

***

దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మా బంధువులు గుడిలో దేవతలే. కరోనా వచ్చి 4 ఏళ్ళ తర్వాత దూర ప్రయాణాలు మొదలు. మొన్న వారం, గంట దూరం, తూర్పు వైపు. ఇప్పుడు అర గంట దూరం, పశ్చిమం వైపు. 4 గుళ్ళు, 2 ఊర్లలో.

ముదుసలి అమ్మ నాన్న సేవ అంటే, పించన్/ ధనం/ ఆస్తి తీసుకుని, గదిలో పెట్టేసి కట్టేసి, వేళకు ఇంత ముద్ద, తిట్లు, తన్నులు, వెయ్యడం కాదు. ఎందుకు వీరి పంచన బతికి ఉన్నాము అని అనుకోకూడదు. నిస్వార్ధముతో, మనతో ఉంచి దేవతలుగా సేవ చేస్తూ, మనతో చేతులు పట్టుకుని, అన్ని తిప్పాలి - వారికి సరదాలు సంతోషాలు ఉంటాయి. కుక్కల్ని జాలీగా తిప్పుతున్నారు, కారు విమానాలు ట్రిప్పుల్లో, మరి కన్న అమ్మ నాన్న ఏమి పాపం చేసారు.

మానవ సేవ మాధవ సేవ, నరుని సేవ నారాయణ సేవ అని ముందు ఇంట్లో చూపు.

***

నిన్న పెద్ద చైన్ షాప్ దగ్గర, అమ్మ కన్నా పెద్ద వయసు ఆమె, వీల్ చైర్ లో కూతురుతో వచ్చి, షాపింగ్ అయినాక, మరలా వీల్ చైర్ కారులో పెట్టుకుని తీసుకుని వెళుతుంది. ఆమెను పలకరించాము. అమ్మను చూసి నవ్వింది. ఈ కుర్చీ చాలా బాగుంది అని ఆమె చెప్పింది. నవ్వుతూ, భవిష్యత్ లో వాడతాము అని చెప్పాము. ప్రస్తుతానికి, మనమే అమ్మ చేతి కర్ర.

***

ఈ రోజు సత్యన్నారాయణ స్వామి గుడిలో, ఇంకో పెద్దామె కలిసింది, 10 ఏళ్ళుగా కొడుకు కోడలు మనుమడు దగ్గర ఉంటూ, అవి ఇవి సాయం చేస్తున్నా అంది. ఇప్పుడు కాదమ్మా, 10 అడుగులు మనిషి లేకుండా వేయాల్సినప్పుడు, మిమ్మల్ని ఇక్కడ ఉంచుతారా అంటే, నవ్వింది.

అమ్మ విషయం చెప్పిన, 9 ఏళ్ళుగా 10 అడుగులు చేయి పట్టుకోకపోతే పడిపోతుంది, 4 సార్లు ఎమర్జెన్సి కి వెళ్ళి వచ్చింది, అంటే, వామ్మో ఇంకా నేను అంత దూరం ఇంకా రాలేదు అన్నది. కాబట్టి మీ 10 ఏళ్ళు లెక్కకు రావు కదా అన్నా, అంతేను అని నవ్వింది.

***

ఈ రోజు ఓ గుడిలో, 10 మంది మన పురాతన దేవతలను, ఒక పెద్ద గదిలో పెట్టారు. ఇంకో వైపు, మన పరాయి భాష మత బాబాయిని పెట్టారు. ఆ గుడి ఆయనను అడిగాము, ఏమండీ 10 మంది అమ్మ నాన్న లను ఒకవైపు, 1 బాబాయిని ఒకవైపు పెట్టాము అంటే, ఏది వ్యాపారం ఎక్కువ జరిగితే దానికి విలువ ఇస్తాము? కన్న తల్లి దండ్రులను ఒంటరిగా వదిలే, మూర్ఖ జనం బలహీనత, మనకు ఎదగడానికి దోవ? మన వేదం లో చెప్పిన పురాతన దైవాలకు ఇచ్చే విలువ ఇదేనా? నిన్న అక్కా చెల్లెల కుటుంబ పతన కధ కు మూలం, ఇలా మనం చేయబట్టే కదా, అంటే పాపం ఆయన తెల్ల మొఖం వేసుకుని చూసారు.

***

ఒక గుడిలో, ఒకావిడ నాగ దేవత దగ్గర పాలు పోస్తూ, అమ్మ ను చూడగానే, కాళ్ళ కు నమస్కారం చేసింది, మా ప్రసాదం తింటారమ్మా అని అడిగింది. ఇద్దరు ఆడపిల్లలు, 10 ఏళ్ళు లోపు వారు ఉంటే, వాళ్ళ చేతకూడా, పాదాలకు నమస్కారం చేయించింది, 9 ఏళ్ళుగా ఇక్కడ వైద్యం అని తెలియగానే.

పిల్లను పంపి, భర్త ను కూడా పిలిపించి, నమస్కారం చేయించింది. ఆ పిల్లలు, తల్లి తండ్రి వద్ద నుంచి, సంస్కారం నేర్చుకునే పద్దతి ఇది. ఆ తర్వాత ఓ అరగంట వారికి, జీవుడు దేవుడు గురువు సేవ గురించి పాఠం. దేవుడు కరుణామయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,855; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 04-Sep-2023, Upd Dt : 04-Sep-2023, Category : General
Views : 246 ( + More Social Media views ), Id : 1906 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Taking , dogs , happily , car , plane , trips , sin , parents , mother , father , parents , inlaws
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content