2023-2025 తానా ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఇద్దరు మనవారే, గుణవంతులు 2 వైపులా? - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,206; 104 తత్వాలు (Tatvaalu) and views 226,403.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

2023-2025 TANA election results came, both are our folks only, are Gunavanth on 2 sides?

మన ఇంటిలో పాప పుణ్యమే, మన బజారు/ మన సంఘము/ మన ఊరు/ రాష్ట్రం/ దేశం ను ప్రతిబింబిస్తుంది, అదే మన పిల్లలు/ మనుమలకు వరము లేదా శాపం అవుతుంది సుమా మరువకు. కలియుగములో పాపశాతం 75, పుణ్యశాతం 25. మరి ఎవరు గెలుస్తారు, ఎవరిని గెలిపిస్తాము ఎక్కువగా? బలవంతులు ధనవంతులు మాత్రమే, ఎందుకంటే మనము నక్క, పులి, పాముకు ఓటు వేయడం కు మరిగాము, మన సంస్కార పెంపక లోపంతో. మంచి చెడు చూడకుండా, ఆవును ఓడిస్తాము, గేళి చేస్తాము.

ఎక్కడో ఒక చోట మాత్రము, మోడీ యోగీ లాంటి వారు గెలుస్తారు, అదీ ఉత్తరాది వారి చలవతో. దక్షిణం నుంచి మనము మాత్రం, నక్క పులి పాముకే, అవసరం అవకాశం వర్గం కేసులు స్టేలు ధనం వెన్నుపోటు గుండెపోటు లకే మన ఆదరణ. కాబట్టి గుణవంతులే గెలుస్తారని లేదు, ఎందుకంటే ఓటర్లు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు. ఎందుకంటే, సొంత ముదుసలి తల్లి దండ్రి అత్త మామ సేవ, సంస్కార పిల్లల గుణం గట్టిగా 10 మంది లో చెప్పలేరు.

కొంత మందికి మన మాటలు పాటలు సేవలు సాధనలు సందేశాలు అంటే చాలా ఇష్టం, పెద్దల పెంపక సంస్కారం హ్రుదయముతో స్పందిస్తారు, 1 నుంచి 6 నెలలకు ఒక్కసారైనా గొంతు/ రాతతో పలకరిస్తారు.

కొంతమందికి మనమంటే చాలా కష్టం అయిష్టం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం తో అచేతనముగా ఉంటారు, స్వయం గోతి లోతులో, ప్రాపంచిక బురద మాయలో, యమా బిజీ బిజీ, ఊపిరి ఆగేంతవరకూ, రోగబారిన పడే వరకు, అన్ని ఊడే వరకు. తమ ఆత్మ ద్రోహముతో బతుకుతారు వాస్తవాలకు దూరముగా. ఆ తర్వాత వారి భాగస్వామి వారి పిల్లలే, వారిని పట్టించుకోరు అదే బిజీ బిజీ తో.

కానీ సజీవ గురువు సేవ చేసిన వారికి, అలాగే తమ ముదుసలి తల్లి దండ్రులు అత్తమామలను ఇంట్లో కంటికి రెప్పలా కాచుకునేవారికి, సొంత పిల్లలకు తెలుగు భాషపై పట్టు తో సంస్కారం నేర్పే వారికి, చిత్తశుద్ది వాక్సుద్ది స్తిరత్వం స్తితప్రజ్ఞత ఒకే మాట ఒకే బాట ఆచరణ దైవ గుణాలు ఉన్నవారికి, మనమంటే ఎప్పుడూ ఇష్టమే, గౌరవమే, ఎక్కడైనా, ఎప్పుడైనా స్పందన ఉంటుంది.

ఎందుకంటే, తర్వాత జీవిత లేదా ముదుసలి వయసు ఆనందాలు లేదా పాప/ పుణ్య ఫలితాలు, కాలుని చేతిలో అనుభవించడానికి, అందరమూ సిద్దముగా ఉన్నాము.

సరే 2023-2025 తానా ఎన్నికల ఫలితాలు చూద్దాము.

** Remote Electronic Voting Closed రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మూసివేయబడింది : 01.17.24 | సాయంత్రం 5:00pm ET
** Total Voting PINs Mailed to Members (USPS) సభ్యులకు మెయిల్ చేయబడిన మొత్తం ఓటింగ్ పిన్‌లు: 35,757
** Total Voter Mailed PIN Letters Returned ‘Undeliverable': మొత్తం ఓటరు మెయిల్ చేసిన పిన్ లెటర్‌లు 'బట్వాడా చేయబడలేదు' : 554
** Total Voting PINS e-Mailed to Members: సభ్యులకు ఇ-మెయిల్ చేసిన మొత్తం ఓటింగ్ పిన్‌లు: 30,782
** Total Ballots Cast: మొత్తం వేసిన బ్యాలెట్‌లు : 23,974
** Total Invalid* Ballots Cast: మొత్తం చెల్లని* బ్యాలెట్‌ల తారాగణం : 2 (Founder Undervotes స్థాపకుడు తక్కువ ఓట్లు)
** Total Valid Ballots Cast & Counted : మొత్తం చెల్లుబాటు అయ్యే బ్యాలెట్‌లు తారాగణం & లెక్కించబడినవి : 23,972

Executive Committee - 2 Year Term - 2023-2025 - Executive Vice President ఎగ్జిక్యూటివ్ కమిటీ - 2 సంవత్సరాల పదవీకాలం - 2023-2025 - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్

Kodali, Naren 13225 56.06% - Winner/ గెలిచినవారు
Vemuri, Sateesh 10362 43.92%

అంటే వేమూరి గట్టి పోటీనే ఇచ్చారు, కొడాలికి చివరి నిమిషము దాకా. కపట నాటక ఊసర వెల్లులు నీతి తప్పి స్వార్ధానికి పాద దాసులు అవడం వలన, గోడ దూకడం వలన, ఆ కొద్దీ తేడా వచ్చింది అని, బాలెట్ లో పేర్లు పక్కన, టీం కొడాలి లేదా వేమూరి అని రాయకపోవడం కూడా కొంత ఇబ్బంది కొత్త వారికి, అని గుస గుసలు. రేపు కొత్త ఓట్లు కూడా కలిస్తే, ఇంకా విచిత్రాలు వింటాము.

గెలిచిన వారికి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు జరిగిన తప్పులు, ఇక మీదట జరగకుండా చూసుకోవాలి. గెలిచాము అంటే, బాధ్యతలు పెరిగాయి. అంటే, మనకు ఎక్కువ పుణ్యము లేదా పాపము పెరగడానికి అవకాశం వచ్చింది. అందరినీ కలుపుకు పోవాలి, ఎన్నికల వరకే పోటా పోటీలు, ఆ తర్వాత అందరూ కార్యకర్తలే, అన్న దమ్ములే, ముఠా తగాదాలు విడవాలి, రాజకీయ వాసనలు వదలాలి.

ఇక్కడనే మనము అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమునకు లోను కాకుండా, మానసిక నియంత్రణ కలిగి ఉండాలి. పంచభూతాలు గమనిస్తున్నాయి, ఈ గెలుపు అవకాశాన్ని నిస్వార్ధముగా సద్వినియోగం చేసుకుంటారా, లేదా స్వార్ధముగా దుర్వినియోగం చేసుకుంటారా అని. అది మన పిల్లల, మనుమల పతనం పై కూడా పడుతుంది, ప్రస్తుత రాజకీయాలలో అలాగే మన ఇళ్ళలో చూస్తున్నాము దీనికి సాక్ష్యాలు.

అందరినీ సమముగా చూడాలి, అధ్యక్షుని కుటుంబం పైనే ఇబ్బందికర పరిస్తితి ని చూపిన సంస్కార పెంపక హీనులను, తాగి మీటింగు లలో అరచే కరచే కుసంస్కారులను, అతిధులకు అన్నం దొరకకుండా చేసిన నీచ స్వార్ధ బుద్ది వారిని, కార్యక్రమానికి జమా ఖర్చులు నెలలు అయినా చెప్పలేని దొంగ బుద్ది వారిని, మిలియన్ల ఆదాయం లేకుండా మిలియన్లు ఖర్చు పెట్టే ప్రాపంచిక ఆనందాల అవసరాల బుద్ది హీనులను, కర్రలు రాడ్ లతో కార్యక్రమానికి వచ్చి మనది రౌడీలకు నిలయం అయిందని నిరూపించిన వారిని, వీసా పై చదువుకోవడానికి వచ్చిన విద్యార్ధులను అలాగే కొత్త ఉద్యోగులను పిజ్జా బిర్యాని సోడా అంటూ మనచుట్టూ తిప్పుకునే వారి భవిష్యత్ నాశనం చేసే తప్పుడు వారిని, మన సంఘాన్ని పార్టీలకు/ రాజకీయాలకు/ తమ అవసరాలకు బానిసలు గా చేసే వారిని, ఇలాంటి వారిని సమర్ధించే వారిని, బహిష్కరించాలి లేదా క్షమాపణ చెప్పించాలి.

అదే ద్రోహము/ వెన్నుపోటు/ అవమానము/ కక్షసాధింపు రేపు మనకూ జరగవచ్చు. తప్పు ఎవరిదైనా తప్పే, మన తన ఉండకూడదు. రామాంజనేయ మరియు క్రిష్ణార్జున యుద్దం మరువద్దు. ప్రహ్లాద హిరణ్యకశప, రావణ విభీషణ, కైక భరత, సత్యభామ నరక కలహాలు మరువద్దు. ఈ కధలు తెలీకపోతె, పెద్దలను అడగండి.

ధర్మం కోసం, మన గాడ్ ఫాదర్ ని అయినా, ఆఖరికి దేవుడు అయినా, అది ఏ బంధమైనా, తల్లి దండ్రులు అన్న దమ్ములు అయినా బుద్ది చెప్పాలి, మానవత్వం ఉన్న మనుషులు గా మార్చాలి లేదా కపట నటన 2 నాల్కల క్రూర మ్రుగాలను దూరముగా ఉంచాలి.

నేను పెంచిన వైరస్ ఇతరులను బాగా నాశనం చేస్తుంది అని వెనకటికి ఓ పెద్దాయన మురిసిపోయారు, గుండెల్లో పెట్టుకుని చూసారు, మిగతావారిని విదిలించి. చివరకు ఏమి జరిగింది? ఆ వైరస్, తన సహజ గుణ లక్షణం ప్రకారం, ఆ పెద్దాయననే, సొంత కుటుంబముతో పతనము చేసింది.

అందుకే చెడపకురా చెడేవు అన్న సామెత వచ్చింది. పాముకు పాలు పోస్తే, అది మనల్నే కాటేస్తుంది. అయినా, తెలిసినా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, రావణ దుర్యోధనులుగా ఎంతో మంది పతనము అయ్యారు. విలన్ తో తిరిగే వారు, చివరకు ఆ విలన్ స్వార్ధానికే బలి అవుతారు.

సొంత భవనము కావాలి అని కొందరు. మరి రేపు భవిష్యత్ లో, ఆ భవనములో, నటీ నటుల ఇతరుల షాపింగ్ జరిగింది అని, ఫోటోలు బయటకు వస్తాయేమో జాగ్రత్తగా ఉండాలి.

ఓడినవారి కి కూడా శుభాకాంక్షలు, ఎన్నికలు అయిపోయాయి, అందరూ ఇక కలసి పని చేయాలి. శభాష్ మీ గుండె ధైర్యానికి పట్టుదలకు ఆత్మవిశ్వాసానికి, మనము నమ్ముకున్న మంచి కోసం ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు అయినా ఎదుర్కోవాలి, ప్రయత్నం ఆపకూడదు. క్రిష్ణుడు రాముడు అలాగే మమ్మల్ని కూడా దూషించే వారు ఉంటారు, పట్టించుకోవద్దు. మిగతా సంఘాలలో మాదిరిగా, ఎన్నికలు లేకుండా, అన్యాయాలను చూస్తూ కూడా, మీరు చవటలుగా గమ్మున ఉండలేదు, వీరులుగా పోరాడారు, వీర మరణానికి కూడా, స్వర్గమే.

మీరు నిజముగా ఓడిపోలేదు, తర్వాత మెట్టుకు అనుభవం, సంపాదించారు. ఊసర వెల్లులు వెన్నుపోటు దారులు 2 నాల్కల కపట నటక స్వభావులు ఎవరో గ్రహించారు. అయితే మన వైపు తప్పు ఉండకూడదు.

చలి చీమలు కూడా బలవంతమైన సర్పాన్ని గెలవగలవు. లేదంటే పెద్ద మర్రి చెట్టు కూడా ఒక పెద్ద గాలివానకు ఎగిరిపోతుంది/ విరిగిపోతుంది. గెలుపు ఓటములు, దైవాధీనం. పంచ భూతాలు గమనిస్తున్నాయి, మన సాత్విక ప్రయత్నం చాలకపోతే, తర్వాత రజో/ తమో గుణ పని అవి చేస్తాయి నేడో రేపో.

ఒక తప్పును సరి చేయడానికి, మనము ఎన్ని సార్లు అయినా ఓడటానికి సిద్దమే అన్నట్లు ఉండాలి. మా సందేశాలకు 5 ఏళ్ళుగా స్పందన లేని, గురువుల బండ హ్రుదయాలు ఉన్నా, మేము నేటికీ వారికి గౌరవముగా పంపిస్తున్నాము. ఎందుకంటే, వారు వారి కుటుంబం పంచభూతాల శిక్షణకు పోకూడదు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో. ఏదో ఒకరోజు మేలుకొంటారు అని ఆశ.

అలాగే మీరు ధర్మం నిలపడాని, ఎన్ని సార్లు అయినా, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అధర్మమే రాజ్యం ఏలుతుంది అన్నప్పుడు, విభూషణుడు లాగా దూరంగా వెళ్ళి, సిలికానాంధ్రా లాగా, మేము కొత్తగా మంచి చేయగలము అని నిరూపించాలి. లేదూ ఎన్నికలో తప్పు జరిగింది అని అనుకుంటే, కోర్టు మెట్లు ఎటూ ఉన్నాయి.

5 ఏళ్ళు పైగా మనము మాట్లాడుకుంటున్నాము, ఎవరి తప్పులకైనా శిక్షణ తప్పదు, కాలం మరియు పంచభూతాలు వదలవు. రామన్న, రాజన్న, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, సావిత్రమ్మ, కోడేలయ్య దగ్గర చూసాము.

కార్యకర్తలూ, మేము కేవలము సేవ ల లో పాల్గొన్నాము, మాకు నాయకుల గుణ గణాలు తెలీదు, అని నిచ్చెన ఎక్కినాక అనవద్దు. గుణ గణాలు తెలియకుండా వారి వెంట ఉండొద్దు. నాయకుల పాప ఫలితాలు మనము, మన కుటుంబము తర్వాత భరించాలి. ముందు అన్ని తీయగా ఉంటాయి, తర్వాత ఏ ఒక్కరూ మన వెంట ఉండరు. మామ కి అల్లుడు వెన్నుపోటు లాగా, బాబాయికి అబ్బాయి గుండెపోటు లాగా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,206; 104 తత్వాలు (Tatvaalu) and views 226,403
Dt : 21-Jan-2024, Upd Dt : 21-Jan-2024, Category : General
Views : 161 ( + More Social Media views ), Id : 1992 , Country : USA
Tags : TANA , election , results , came , 2023 , 2025 , kodali , vemuri , Gunavanth , america , usa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content