పాటతో పరమార్ధం - తెలుగు భాష - నీకు నేను నాకు నువ్వు - ఉదయ్ కిరణ్, శ్రియ, కృష్ణం రాజు, సుమన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,793; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*పాటతో పరమార్ధం - తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం - నీకు నేను నాకు నువ్వు - ఉదయ్ కిరణ్, శ్రియ, కృష్ణం రాజు, సుమన్

Song Spirit - Telugu Bhasha Tiyadanam - Neeku Nenu Naaku Nuvvu - Uday Kiran, Shreya Saran, Krishnam Raju, Suman

మనము ఏళ్ళు గా మాత్రు మూర్తి కి, మాత్రు నేలకు, మాత్రు భాషకు క్రుతజ్ఞతలు విశ్వసనీయత చూపించమని, భవిష్యత్ శిక్షలు తప్పించుకోమని, అందరినీ వేడుకుంటున్నది మీకు తెలుసు. తెలుగు రాయడం, మాట్లాడడం ద్వారానే, తెలుగు జాతి మరియు భాష గొప్పతనం అందరికీ తెలిసేది.

కనీసం భాష రాస్తూ, కన్న తల్లికి క్రుతజ్ఞతలు రుణం తీర్చుకోలేని దరిద్రులు, ఇప్పుడు మన ఇంట్లో, మన లో, మన సంఘం లో, మన పార్టీ లో ఉన్నారు. మీ చుట్టూ అడిగి చూడండి, అబ్బే మా ఇంట్లో ఏ ఇనప గుండె బండ రత్నాలకు, తెలుగు రాయడం రాదండి, అని సోషల్ మీడియాలో అంటారు. వెన్నుపోటు, గుండెపోటు, నక్క పాము పులికి ఓటు మన కుటుంబాలకు చేటు, ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం, మా కుటుంబాలలో కామనే అంటారు చిరునవ్వుతో. కానీ చివరలో కన్నీళ్ళే, వారి ద్రోహానికి.

ఈ పాటలో నే చేప్పారు, తెలుగు మరచి పోతే, అమ్మ నాన్న ను మరచినట్లే అని. తెలుగు జాతిలో నేలలో పుట్టి, అందులోనే చదివి లోకజ్ఞానం నేర్చుకుని, కోట్లు సంపాదిస్తూ, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ అధికారం పదవి చేపట్టి, పాలు తాగిన కన్న తల్లి రొమ్మునే గుద్దే, నీచులు పాపాత్ములు మన తెలుగు ఆడ/ మగ జాతిలో ఉన్నారు.

మరలా ఓటర్లుగా, నాయకులుగా, సంఘాలుగా చెలామణి అవుతున్నారు, కపట నాటకముతో. జీవిత చరమాంకములో లేదా రోగాల బారిన పడ్డాక, వారికి దక్కేది ఈ కపట నాటకమే. పంచభూతాలు వదలవు, వారి ఇంట్లో వారు ఎటూ వదలరు.

వీరు రాయరు, వీరి పిల్లలకు నేర్పరు. అదే క్రుతఘ్నత మోసం అవసరం తీరాక పక్కకు నెట్టడం, తమ భాగస్వామి అలాగే పిల్లలు చేసిన నాడు, ఈ మూర్ఖులకు కనువిప్పు కలుగుతుంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని, ఉపయోగం ఉండదు ఆనాడు.

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, ధనాన్ని ఆస్తులు సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు, వ్యాసం రాయి అంటే వింటారా? అబ్బో తమ ఇంగ్లీష్ లేదా సాఫ్ట్ వేర్ లేదా వ్రుత్తి విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆత్మ లేని ఆ విద్య, వారి మెడకే చుట్టుకుంటుంది, చివరలో.

తల్లి తండ్రి నేర్పినట్టి, మాతృభాషరా, తెలుగు మాట్లాడి, తెలుగు రాసి వాళ్ల రుణం, తీర్చరా, కొంత రుణం తీర్చరా? అంటే వింటారా? మా వంశం లోనే క్రుతజ్ఞత విశ్వసనీయత లేదు, మేము రుణం తీర్చుకోము అని, 5 ఏళ్ళుగా తెలుగు రాయని ప్రయత్నం చేయని, ప్రబుద్దులు మన చుట్టూ ఉన్నారు.

జంతువుల కన్నా మనము హీనం, అని ఎంత బాగా చెప్పారో? ఆవు, కుక్క, పిల్లి తమ భాష మారుస్తాయా, మానతాయా? కానీ మానవత్వం లేని మనుషులు? తమ భాషను మరుస్తారు. కొమ్మల్లోన పక్షులన్ని, తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్ని, తమ భాషను మరువలేవు. మరి మనుషులమై అంటే, రాక్షసులమై కుసంస్కార పెంపకముతో, మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. పంచభూతాలు కాలరాస్తాయి మిత్రమా, ద్రోహులను క్షమించవు.

తెలుగు జాతిలోనే, తెలుగు గురువులైన బ్రహ్మం వేమన రాఘవేంద్ర స్వామి లను మరచి పరాయి మత భాషా గురువుల వెంట పడటం మొదలు పెట్టి, సొంత ముదుసలి అమ్మ నాన్నను అత్త మామను, ఆనాధాశ్రమాలలో వేసిన, నీతి మాలిన జాతిగా మిగిలిపోతున్నాము.

పాటలో కొన్ని పదాలు కలిపాము, సంస్కారం పెంచడానికి, రోషం తెప్పించడానికి, మంచి దోవలో నడిపించడానికి, కాబట్టి, పేరడీ అని కూడా అనవచ్చు.

తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్లకి, తెలుగే. ఒక మూలధనం..
తల్లి తండ్రి నేర్పినట్టి, మాతృభాషరా
తెలుగు మరచిపోతే, వాళ్లని నువు మరచినట్టురా.
ఆత్మ చంపుకోకురా ||తెలుగు భాష|| 2

అమ్మా, అన్న పిలుపులోన, అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా, అన్న పదములోన, అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలో.న, ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్నమాట, మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు, మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన, ఆ ఆప్యా.యత ఎక్కడుందీ..
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు 2
కానీ నీ భా.షలోనే నువ్వు సంభా.షించు
తల్లితండ్రి నేర్పినట్టి, మాతృభాషరా..
తెలుగు మాట్లాడి, రాసి వాళ్ల రుణం, తీర్చరా,
జన్మ రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

కొమ్మల్లోన పక్షులన్ని, తమ కూ.తను మార్చుకో.వు
భూమిపైన ప్రాణులన్ని, తమ భా.షను మరువలే.వు
మనుషులమై మన భా.షకు, ముసుగును, తగిలిస్తున్నాము..
ప్రపంచాన మేథావులు, మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర, కవులు కూడ, తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై, మన భాషకు, అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి, నింగే హద్దు 2
అది భాషా, ఆచారాలను, మింగెయ్యెద్దు
ఆత్మాభిమానమును చంపెయ్యద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి, మాతృభాషరా
ఉగ్గుపాల భాష, పలికేందుకు సిగ్గుపడకురా...
రాయలేనందుకు, సిగ్గు పడాలిరా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి, తెలుగే ఒక మూలధనం
మమ్మీడాడీ అన్నమాట, మరుద్దామురా
అమ్మానాన్నా అంటూ, నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా

Movie : Neeku Nenu Naku Nuvvu; Lyrics : Chandrabose;Music : R P Patnaik; Singer : S P Charan; Cast : Uday Kiran, Shreya Saran, Krishnam Raju, Suman

telugu-bhasha-tiyadanam-neeku-nenu-naaku-nuvvu-uday-kiran-shreya-saran-krishnam-raju-suman  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,793; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 09-Jul-2023, Upd Dt : 09-Jul-2023, Category : Songs
Views : 298 ( + More Social Media views ), Id : 1827 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , bhasha , tiyadanam , neeku , nenu , naaku , nuvvu , uday , kiran , shreya , saran , krishnam , raju , suman
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content