తెలుగు గురువుల గురించి, ఇతర రాష్ట్రాలలో దేశాలలో ప్రచారం, ఓ 10 కొత్త మందిరాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1401 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1433 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తేట తెలుగులో, మన తెలుగు ఆధ్యాత్మిక గురువు లైన, వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర స్వాములు లాంటి ఘనమైన గొప్ప గురువుల గురించి, ఇతర రాష్ట్రాలలో మరియు దేశాలలో తెలియచెప్పి ప్రచారం చేసి, వారికి నమ్మకం కలిగించి, ఓ 10 కొత్త మందిరాలు అయినా, ఇతర ప్రాంతాలలో కట్టించ గలిగామా? ఉన్నవాటిని నడిపించ గలిగామా? అసలు మన దగ్గర్నే మూత పడ్డాయి కదా, మనం పట్టించుకోక పరాయి వ్యామోహములో పరుగులు తీస్తుంటే? అంటే, మనము తెలుగు వారము చవటలము కాదా?

మన సొంత తెలుగు గురువుల గొప్ప, మనకు చెప్పుకోవడం చాత కాని, దద్దమ్మలము కాదా? తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే అధములము కాదా? విశ్వాస ఘాతకులము కాదా? ఎప్పుడూ, పొరుగింటి పుల్ల కూరే రుచినా మనకు, ఇక జన్మలో మారమా?

మన తండ్రి లాంటి తెలుగు గురువు ఫోటో ఇంట్లో లేకుండా, ఇతర పిన తండ్రులు లాంటి పరాయి గురువుల ఫొటో బొమ్మ పెడితే, మన అంత నీతి తక్కువ వారు, ఇంకొకరు ఉంటారా?

పోనీ, చవటలము దద్దమ్మలము అనుకుంటే, అలాగే గమ్ముగా ఉండకుండా, అమాయక వెర్రి వెంగళప్ప లాగా, పరాయి దూర ప్రాంత గురువుల ప్రచారం కోసము, మనము మన ప్రాంతాల్లో వీధికి ఒకటి అలాగే విదేశాల్లో కూడా ధనం పోగేసి తెలుగు వారిమి, మందిరాలు కడుతున్నాము అంటే, మన గురువులనే తక్కువ చేసి మనమే అవమానిస్తూ,

కనీసం ఇంట్లో ఒక ఫోటో (బ్రహ్మం, రాఘవెంద్రా, వేమన గార్లవి) కూడా లేకుండా చేస్తున్నాము అంటే, మన కన్నా వెర్రి వాళ్ళు, స్వార్ధ వ్యాపార ధనం కోసం, సొంత తెలుగు వారినే, మోసము మాయ బ్రమలలో ఉంచే, అతి తెలివైన (తెలివితక్కువ) వారిలో, దేశం మొత్తములో, ప్రధమ స్థానం మనది కదా?

ఇంత వెర్రి వారు, ఇతర భాషలలో రాష్ట్రాలలో ఉన్నారా? పొనీ దానివలన, సొంత గురువును వదిలేసిన, ఆత్మ జ్ఞానం సంపాదించుకో గలమా?

ఆత్మ విమర్శ ఎవరికి వారు చేసుకుందామా? ఇలాగే వ్యాపార మత్తులో పరాయి మోజులో, పతన మౌదామా, మన ఇష్టమే. రాత రాసుకుంటుంది మనమే. ఇతరులను గౌరవించు, కానీ సంస్కారం క్రుతజ్ఞత ఉన్నవారు, ముందు మన వాళ్ళను, మన తల్లిని, మన గురువు ను గౌరవించాలి కదా?

అబ్బే మేము కొత్త కరెంటు ట్రెండ్ నే అనుసరించి కొత్త వారినే నమ్ముదాము, మరి కరోనా దరి చేరుదామా? అవ్వ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1433 General Articles, 48 Tatvaalu
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 397 ( + More Social Media views ), Id : 962 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , guru , campaign , states , countries , new mandir , temple , vemana , brahmam , raghavendra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content