Vaikuntha Ekadashi PraNam to all Gurus - Om Namo Narayanaya, Om Sri Matre Namah - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,402; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Om Namo Narayanaya, Om Sri Matre Namah ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః

Vaikuntha Ekadashi PraNam to all Gurus
గురువులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు నమస్కారములు

ముక్కోటికి ఏది చేసినా కోటి ఫలము, మరి మీలాంటి మంచి గురువులను పలకరించి నమస్కరించే ఈ శిష్యునకు కొండంత ఫలము. మీరూ మీ గురువులైన ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలను మరువద్దు, దూరముగా విడువద్దు, పసి పిల్లలుగా దగ్గర పెట్టి సాకాలి, లాలించాలి. తెలుగు భాష మరువద్దు, రాయడం మొదలుపెట్టండి.

Whatever you do on mukkoti ekadasi, it will be multiplied as crores of fruit, so as a sishya, greets and praNam to good Guru like you. You too should not forget your Guru, older parents inlaws, do not leave them far away, keep them close and caress them like babies. Do not forget the mother tongue, start writing.

ఫొటోలు వాట్సాప్ స్టేటస్ లో. Photos are in WhatsApp status.

మీరూ పాడే ప్రయత్నము చేయండి, భావం అర్ధం చేసుకుంటూ, సంస్కారం క్రుతజ్ఞతలు ఇంకా పెంచుకుంటూ. మంత్రాలు పాటలు, మన కంఠ మరియు ఊపిరితిత్తుల శ్వాస ఆరోగ్యరక్షణకు, వాటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 2 నిమిషాలలో, మన గొంతు జీర పోకూడదు గాత్ర స్థాయి తగ్గకూడదు, బండ గొంతు ఉన్నా పర్లేదు.

Make an effort to sing yourself, while understanding the meaning and cultivating the culture and gratitude. Mantras Slokas songs, for the health of our throat and lungs breathing exercise, to prevent diseases related to them. In 2 minutes singing, our throat should not go bad, voice level should not decrease, it may not be sweet voice but still fine.

శ్వాస మీద పట్టు ఉండాలి, ఊపిరితిత్తులు కరోనా దెబ్బకు లొంగలేదు లొంగవు కూడా, మన సాత్విక సాధన బాగుంది, అని ఆ ప్రాణవాయువు తో ఈ పాటతో శ్లోకము తో, శ్వాస పూర్వక వ్యాయామం చేయాలి. గతములో పెళ్ళి కొడుకు కూతురు, ఇద్దరికి కనీసం ఒక పాట వచ్చి ఉండాలి, సంస్కారవంతులుగా. ఇప్పుడు మనకు సంస్కారము లేదు కాబట్టి, అవన్నీ వదిలేసాము.

There should be a grip on the breath, even lungs do not succumb to the corona blow, our sattvic practice is good, with the hymn with this song with that oxygen, breathing exercise should be done. Previously before marriage both boy and girl should sing at least one song, in cultured way. Now we have no traditional culture, we have given up everything.

మన లోని పశు లేదా రాక్షస గుణాలనే అరిషడ్ వర్గాలు ను, నిరంతర సాధన తో మనమే అంతమొందించి జయించి, సాత్విక గుణం కూడా దాటాలి, దేవుని అండతో. దానికి ఏళ్ళు, కొన్ని సార్లు జీవిత జన్మ లు కావాలి.

The animal or demonic qualities within us, we must conquer Arishadvarg with continuous practice, and also cross the sattvic quality, with the support of God. It takes years, sometimes even life births.

మంచి విన్నా, చూసినా, చేసినా పుణ్యం, అదీ సత్సంగమే. ఇవి అందుకునే, ప్రతి ప్రాణికి, దైవ రక్ష కలగాలి.

Good hearing, seeing, or doing is virtue, that is satsang. To every living being who receives these, there must be divine support.

ప్రత్యక్ష దైవాలు ముదుసలి అమ్మా నాన్న ల పూజ సేవ రుణం తర్వాతే, సొంత మానసిక దేవుని పూజకు విలువ ఫలితం. సాంప్రదాయం, ఆరోగ్యం, మనశ్శాంతి, గ్రహశాంతి అన్ని మన చేతిలోనే ఉన్నాయి.

The value of the worship of one's own mental god puja or meditation is, after the worship service of the living Gods mother and father. Tradition, health, peace of mind, peace of graha are all in our hands.

భౌతిక ఆడంబర ఖర్చు పూజ కన్నా, మానసిక పూజ ఉత్తమం. భక్తి, త్యాగం నేర్పాలి, కఠిన పరిస్థితి కి నీతి గా నిలబడే ధైర్యం ఇవ్వాలి.

Mental worship/ Meditation is better than physical luxury worship. Devotion and sacrifice must be taught, and courage must be given to stand up for righteousness in the face of adversity.


తాత్త్విక సందేశం తెలుసా -
విష్ణువు ఉండే చోటు ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం.

Know the philosophical message -
Vishnu is here to be found, the body is the temple, based of Veda. As stated in the Kaivalyopanishattu, God shines in every human heart cave (Nihitam Guhayam Vibrajate). Practicing Ekadashivrata as a rule, referring to the deity who is so close, means suppressing the Ekadashendriyas through fasting and worshiping through means such as puja-japam-meditation.

పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

The five senses (eyes, ears, etc.) five sense organs (legs, arms, etc.), the mind - We commit sins through these eleven senses; These eleven are the place of ignorance. That is why only Ekadashi, the sage, can slay Murasurun, the representative of ignorance in the eleven positions. That is why those who faithfully practice Ekadashivrata become wise.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,402; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171
Dt : 29-Dec-2023, Upd Dt : 29-Dec-2023, Category : General
Views : 262 ( + More Social Media views ), Id : 1975 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vaikuntha , vaikunta , ekadashi , ekadasi , pranam , gurus , om , namo , narayanaya , srimatre , namah
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content