Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. We trust our children so much, they will take their pit, then for us?
Response/ స్పందన - అసలు ఒకరి మీద నమ్మకము ఉందా, సంతానమైనా, భాగస్వామి అయినా తల్లి దండ్రులు అయినా, ఈ రోజుల్లో? ఊరక అబద్దాలు చెప్పుకుంటే, అబద్దాలలో బతికితే, మరి వెన్నుపోటులు ఎందుకు జరుగుతున్నాయి? తమ పిల్లల దగ్గర ముదుసలి తనములో, దేవతలు గా ఉంటాము అని చెప్పే, ఒక్క సంస్కార కుటుంబం ఉందా?
ఏమండీ, మాత్రు ఋణం, సజీవ గురువు సేవతో (ఈ పదానికి అర్ధం చాల మందికి తెలీదు, ఇది ఇక్కడ ముఖ్యం) 9 ఏళ్ళుగా తీర్చుకుంటున్నారు కనీస ప్రయత్నముతో. అలాగే పిత్రు ఋణం, ఈనాడు నిస్వార్ధ సమాజ/ కుటుంబ సేవతో, అందరినీ అన్నలా/ తమ్ముడులా, అక్కలా/ చెల్లెలులా, అమ్మలా/ నాన్నలా, గురువులా/ శిష్యుని లా, కష్టాలు కన్నీళ్ళు వింటూ, వాటిని కధల రూపములో అందరితో పంచుతూ, అరిష్డవర్గ అష్టవ్యసన బానిసత్వం వద్దు, కపటం వద్దు, అది మన కుటుంబాన్నీ/ వర్గాన్ని/ సమాజాన్ని/ సనాతన ధర్మాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, జాగ్రత్తలు పడమని, రోజు నిద్రలేపుతున్నారు.
ఎన్నో ఏళ్ళుగా మీరు మొత్తుకుంటున్నారు, కపటం నటన 2 నాల్కలు వాద్దు, కనీసం ఉన్నది ఉన్నట్లు గా చెప్పి, రాక్షసుల స్థాయిలో అన్నా బతికి ఉందాము అని, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం పెద్దలలో ఉంటే, అదే పిల్లలకు వస్తుంది అని ఎంత చెప్పినా, కానీ జనాలకు అర్ధం కావడం లేదు. చేతులు కాలాక ఉపయోగం ఏముంది?
రామన్న కు వెన్నుపోటు పొడిచారు అల్లుడు అన్నాము అంటే, అలాంటి వారిని పక్కన పెట్టుకుని అన్నాళ్ళు ఊరేగిన ఆయన తెలివితేటల/ ముందుచూపు ను ఏమనాలి, వారి కూతుళ్ళు కూడా ఆయన క్షేమం కోరలేదు కదా, ఆయన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉండబట్టే, ఇది జరిగింది అని అనే వారు ఉన్నారు. ఇప్పుడు అందరి ఇళ్ళలో, ఇదే మోహ వ్యామోహ ఆటలు సాగుతున్నాయి. ఒకరి సాయముతో అవతల వారిని ముంచినా లేదా మత్తులో ఉండి, తన చుట్టూ తాను పరిశీలించుకోకపోయినా, అధోగతే కదా.
ఇప్పుడు వస్తున్న/ వచ్చిన, అక్క చెల్లెళ్ళ కధనం లో ఉన్న, గుట్టు అదే కదా. వారు ఇంట్లో మొహమాటం లేకుండా మాట్లాడుకొని ఉంటే, ఈ రోజు ఎవరూ చావాల్సిన పని లేదు, జైలు కు పోవాల్సిన పని లేదు, ప్రపంచానికి తెలియాల్సిన పని లేదు, పోలీసులకు అనవసర తలనొప్పి సమాచార సేకరణ వెదుకులాట సమయం దండుగ ఖర్చు ఉండదు. మనకు ఈ కధనాల పని ఉండదు. వీరి వలన, ఇతర పిల్లలు చెడుపోరు కదా?
ఏముంది, ఇంట్లో కూర్చుని, 20 ఏళ్ళకు దగ్గర ఉన్న అక్క చెల్లెలు వోడ్కా తెచ్చుకుని తాగడం అంటే, మా ఇంట్లో దొంగతనం చేద్దాం రా అని ఇతరులను పిలవడం అంటే, ఎంత ఒద్దిక, ఎంత కుటుంబ సాంప్రదాయం? సినిమాలలో కూడా, మా అబ్బాయి నేను ఎదురుగా కూర్చుని తాగుతాం, మా ఆవిడ కావాల్సినవి అందిస్తున్నది, మా ఇంట్లో అంతా సోషల్ గా విచ్చల విడిగా ఉంటాము అని ఎంత బాగా చూపిస్తున్నారు, అందరూ వారిలాగే చెడిపొమ్మని. ఇంక మాత్రు/ పిత్రు దేవోభవ అని నేర్పని పాపం మనదే కదా?
మరి ఈ మందుకు, ధనం ఇచ్చింది ఎవరు, ఇంట్లో వారే కదా? ఇంటికి తెచ్చే ధైర్యం ఎక్కడిది? ఇంట్లో వారే నేర్పారు లేదా నేర్చుకునే అవకాశం ఇచ్చారు. పిల్లలు మానసిక బలహీనతతో దిగజారిపోతుంటే, ఆ పెద్దలకు పట్టలేదు. అంటే ఇంట్లో ఇంత తతంగం జరుగుతుంటే, అమ్మ నాన్న కు అసలు పట్టలేదు, తమ ప్రాపంచిక బ్రమలతో. ఇంక బయట హాస్టల్ లో, నగరం లో, దేశం లో అయితే, వీరికి అసలు తెలుస్తుందా?
పెద్దలనే నమ్మలేని రోజులలో, మా పిల్లల/ సంతానం పై మాకు చాలా నమ్మకమండి, వారు వారి గొయ్యి తీసుకుంటూ, మాకు కలిపి గొయ్యి తీస్తారు పనిలో పని అని ధైర్యముగా ఎలా చెప్పగలుగుతున్నారు? లెక్కలేని తనం కాదా?
మోటారు బైక్/ కారు కొనిచ్చి, అత్యంత స్పీడ్ తో బైపాస్ రోడ మీద చావండి అని పంపుతుంది, సొంత తల్లి దండ్రులే కదా? పేరెంట్స్ కి, తమ పిల్లల మానసిక స్తితి తెలీదా? తెలీకపోతే, ఆ పిల్లలను వారితో ఉంచకుండా, ప్రభుత్వానికి అప్ప చెప్పడం మంచిది కదా?
అక్క చెల్లెలికి నీతి చెప్పాలి, చెల్లెలు తప్పుడు పనుల గురించి పేరెంట్స్ కు చెప్పాలి, కానీ తానే తాగి మత్తులో ఉంటే, ఇంక చెల్లి కి ఏమి నీతి చెపుతుంది.
మరి ఇంత ధైర్యం ఉన్నప్పుడు, నాన్నారు, నేను పరాయి మత అబ్బాయి తో ప్రేమలో పడ్డాను, మీరు తెలుగు హైందవ వేమన బ్రహ్మం రాఘవేంద్ర స్వాములను వదిలేసి, పరాయి భాషా మత బాబాయి లతో ఎలా తిరుగుతున్నారో, మేము అలాగే తిరిగితే తప్పు ఏమిటి? మీరు ధనం ఇస్తారా లేదా మా పెళ్ళికి, లేదా మా ప్రియుడిని ఇంటికి పిల్చి, నాలుగు తన్నించి, నగలు ధనం ఎత్తుకు పొమ్మంటారా? చాయిస్ మీదే అని, ఈడియెట్ సినిమాలాగ అడిగితే, ఇంత అనర్ధం జరగదు కదా?
ఆ తల్లి దండ్రులు మాత్రం ఏమి చేస్తారు? తమ సంస్కార పెంపకం తెలుసు కాబట్టి, పెద్దలమైన తమ లోపాలు, పిల్లల కు అలవాటుపడి, స్పష్టము గా ఎదురి తిరిగి అడుగుతుంటే, సహకరించడమో, ఇంట్లో నుంచి పంపడమో చేసేవారు. ఎందుకు ఈ చంపడాలు, గొడవలు, తగువులు?
మీ శనివారం సాధనలు, ప్రతి కుటుంబం, పెద్దలు కొన్ని అయినా ఆచరిస్తూ, తమ అహంకారాన్ని పక్కన బెట్టి, తమ పిల్లలకు దగ్గర కూర్చోబెట్టుకుని, ప్రతి పదం అర్ధం చెప్పి, ఇలా మనసును వశపరుచుకోవాలి, లేదంటే మానసిక బలహీనతలు ఉంటే, ఇలాగే ఎవరి గొయ్యి వారు తీసుకోవాలి అని ఉదాహరణలతో చెప్పాలి.
ఎంత మానసిక బలం ఉంటే, చలికాలము లో కూడా, ఉత్త పాదాలతో, గంటకు పైగా, 108 ప్రదక్షిణలు చేస్తూ, చేతి వేళ్ళతో కరమాల లెక్క పెట్టడం అన్నది, నోటితో నారాయణ జపం చేస్తూ, మల్టి టాస్కింగ్ పద్దతి కొనసాగుతుంది, గత 200 పైన వారాలుగా, ఎంత మందికి సాధ్యం అవుతుంది?
చెడిపోవడానికి అలాగే సుఖాలు అనుభవించడానికీ 100 దోవలు ఉన్నా, ముదుసలి కన్న తల్లి చెయ్యి పట్టుకుని రోజు నడిపిస్తూ, 9 ఏళ్ళ సజీవ గురువు సేవ చేయాలంటే, ఎంత మానసిక పరిపక్వత ధైర్యం ఉండాలి?
3 ఏళ్ళు పైన ఆదాయం లేకపోయినా, మా బాగు కోరుతూ, ఎన్ని సందేశాలను పంపారు, ఎన్ని సార్లు జాగ్రుతం చేసారు, అరిషడ్వర్గ బానిసత్వం లో పడవద్దు అని? ఆ మానసిక బలం, దైవ అండ ఎలా వచ్చింది, ఎంత సాధన ఉంటే వచ్చింది? అన్నది తాము తెలుసుకుంటూ, తమ పిల్లలకు నేర్పాలి.
మర్యాద గా, గిచ్చి గిచ్చనట్లుగా రాయడం, దైవ గీతాలు పాడటం, పలికినా పలకకపోయినా, నాయకులు అధికారులు మిత్రులు బంధువుల క్షేమం కోరి, నిద్ర లేపడం, తస్మాత్ జాగ్రత జాగ్రత అని చెప్పలి అంటే, ఎంత మంది చీదరించినా గేళి చేసినా, ఏళ్ళు కొనసాగించడానికి ఎంత సహనం, ఓర్పు, త్యాగం ఉండాలి? ఎంత దైవ బలం ఉండాలి?
ఇవి చదవడానికి, ఆచరణలో పెట్టడానికి, సమయం లేకపోతే ఇప్పుడు, అక్క శివైక్యం చెల్లెలి చేతిలో, చెల్లి ప్రియుడు పోలీసుల చేతిలో, ఉసూరు మంటూ తామ చేసిన పాపాల ఫలితం అనుభవిస్తూ ఆ తల్లి దండ్రులు, మరి ఇప్పుడు అందరికీ కావాల్సినంత ఖాళీ దొరుకుంది కదా? దానివలన ఉపయోగం ఉందా?
అసలు మీ సందేశాలు మాలో ఎవరైనా వారి తల్లి దండ్రులకు పంపి ఉంటే, ఈ రోజు అది జరిగేది కాదేమో. ఎంత బద్దకం మాకు, రేపు మా పిల్లలు/ పెద్దలు అదే పరిస్తితి లో ఉండరా?
అందరూ ఇవి నేర్చుకుని మానసిక బలం పెంచుకుంటే, వారి బడిలో, కాలేజీలో, యూనివర్శిటీలో, ఉద్యోగములో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యామోహాలు వచ్చినా, వారు తట్టుకుని మీలాగే స్తిరముగా నిలబడటానికి ఎంతో ఉపయోగము.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1952 General Articles and views 1,579,908; 97 తత్వాలు (Tatvaalu) and views 199,063 Dt : 07-Sep-2023, Upd Dt : 07-Sep-2023, Category : General
Views : 102
( + More Social Media views ), Id : 1909 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
trust ,
children ,
parents ,
pit ,
older Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments