మతం లేదా దేవుని మార్చినా, కష్టాలు నష్టాలు పోతాయా లేదా తగ్గుతాయా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,364; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనం మారకుండా ఊరు మార్చినా , దేవుని మార్చినా , మతం మార్చినా ప్రయోజనం శూన్యం. అరగంట మనలో కి మనం చూస్తే ధ్యానం లో, భయపడతాము మన వక్ర బుద్ది చూసి.

తినటానికి తిండి లేక, ఉంటానికి చోటులేక, బతకటానికి దోవ లేని వారి గురించి కాదు ఇది. అది కూడా మన హిందువుల తప్పే, ఎందుకంటే అవతలి మతం వారు అన్ని సమకూరుస్తుంటే వారి దేవుని పేరు చెప్పి, మనము కనీసము మన వాళ్ళకు కూడా అలా సహాయము చేయలేక పోతున్నాము, కోట్లలో వ్యాపారాలు ఉన్నా, స్వార్ద బుద్దితో.

సమస్య అంతా, అన్ని ఉండి, స్వార్దము తో మారే వాళ్ళ గురించి. ప్రపంచములో అన్ని మతాల దేశాలు కూడా, రోజూ ఎదో ఒక సమస్యతో సతమతమవుతున్నాయి. బిక్కు బిక్కు మంటున్నాయి, తమలో ఎవరు ఎవరిని కాలుస్తారో అని, ఎక్కడ ఏమి పేలుతుందో అని.

వేరే మతం లో ఉన్న, మీ ఊరి వాళ్ళనో, స్నేహితులనో అడగండి - మీకు కష్టాలు లేవా? భవంతులు డబ్బులు మీ దేవుడు ఇవ్వడా అని? వాళ్ళూ ఏమి చెప్పలేరు ఎందుకంటే అందరికి సమస్యలు ఉన్నాయి కాబట్టి.

దేవుని లేదా మతం మారే వారు, వారికి ఉన్నదంతా పాత దేవుని కి ఇచ్చి, కొత్త దేవుని తో రూపాయ తో మొదలు పెడతారా? కొత్త దేవుని లేదా మతం వారికి కష్టాలు, బాధ లు లేవా? వాళ్ళలో బీద వారు లేరా? మనం అవకాశవాదులం , అంతే.

మీకు తెలుసా, చరిత్రలో వేరే దేశం మీద దాడి చేయని ఒకే ఒక్క దేశం, భారత దేశం, హిందూ దేశం. క్రైస్తవులు, మహమ్మదీయులు ఇతర దేశాల మీద దండయాత్రలు చేసి, వారిని హింసించి హతమార్చి రాజ్యాధికారాన్ని పొందారు. 5 నుంచి 10 వ తరగతి స్కూల్ పుస్తకాలలో చదివాము గుర్తు చేసుకోండి. అలా చేయమని, వారి మతం కూడా చెప్పదు, వారి మత సూత్రలను కూడా పాటించని వారే లేదా అతివాదులు ఇలా చేస్తారు.

మనలో నీతి, నిబద్దత, భక్తి, సాంప్రదాయం ఉంటే, కష్టాలు మనల్ని ఏమీ చేయవు. శ్రీ రాముడు ఎదుర్కొన్న కష్టాలు కన్నా ఎక్కువా మనవి, రాజ్యాధికారం సంపదలు వదలి అడవిలో 14 ఏళ్ళు బతకడం రాక్షసుల మధ్య.

భారతీయులు అందరూ హిందువులే మొదట. ఆంగ్లేయులు, మహమ్మదీయులు దాడి తర్వాత మనలను ఆశ చూపించో లేక భయపెట్టో మార్చారు కొంతమందిని. అలా చేయమని వారి మతం కూడా చెప్పదు, కేవలం కుటిలత్వం తో స్వార్ధం తో అలా చేసారు కొందరు.

ఏ పినతల్లి అయినా, సొంత అమ్మను వదిలి నా దగ్గర ఉండు అంటుందా? మానసికముగా ఎదిగి, తమంతట తాము, ఆనందముగా, తమ హిందూ మతం లోనికి వెనక్కి రావచ్చు, తప్పు లేదు.

మీరు విదేశాలలో ఇస్కాన్ గుడికి వెళితే ఇది చూస్తారు, చాలమంది విదేశీయులు మన క్రిష్ణయ్య బోధనలు విని, చైతన్యవంతులై మన మతం లోకి మారి, ప్రశాంత జీవనము గడుపుతున్నారు.

మహిళలను దేవతలు గా , అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి గా కొలిచే మత ధర్మం, హిందూ సనాతన మతధర్మం. అలా వేరే మతం ఉంటే చెప్పి, లక్ష తీసుకుందురు.

అలాంటి తల్లి లాంటి హిందూ ధర్మం ని వదిలి, పక్క మతాలకు వెళ్ళే అవకాశవాదుల ని జాలి పడాలి. తల్లి ని వదిలిన వారికి ఏనాటికైనా పతనం తప్పదు.

మరి రోజులు ఎందుకు ఇలా తయారు అయినవి అంటే , మనకు రామాయణం, భారతం , గీత తెలీదు. పిల్లల కు నేర్పి ఆచరించము కాబట్టి.

కష్టాలు ఉండాలి, అవి దేవుని కి దగ్గర గా ఉంచుతాయి. సుఖాలలో మునిగిన వారి చివరి రోజులు చూడండి. మనశ్శాంతి లేక ,పిల్లలు మాట వినక , వంద మంది ఉండి , ఏవిధంగా బాధపడ్డారో పడుతున్నారో.

కర్మ విడువదు, బాంకు వడ్డీ ఆగదు, మనం తప్పించుకోలేము.

సమయం లేదు మిత్రమా , మారటమా , చేసిన తప్పులు కే బలి అవ్వడమా. ఛాయిస్ మనదే. దేవుని కి సంబంధం లేదు , మన రాత మనమే మార్చుకున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,364; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399
Dt : 29-Mar-2019, Upd Dt : 11-Apr-2019, Category : General
Views : 1449 ( + More Social Media views ), Id : 68 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : religion change , difficulties
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content