Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Ye nyaya sthanam - Amma Naa Kodala - Vinod Kumar, Soundarya, Vanisri
*పాటతో పరమార్ధం - ఏ న్యాయస్థానం తేల్చాలి, అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్య అంటే తనువున సగభాగం, నిజమా? - అమ్మ నా కోడలా - వినోద్ కుమార్, సౌందర్య, వాణిశ్రీ*
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
అమ్మ నా కోడలా లేదా అమ్మ నా అత్తా, చవటనా పుత్రుడా/పతీ అనని ఇల్లు లేదు ఇప్పుడూ 80 శాతం, ఒకరిపై ఒకరు పెత్తనము చూపించుకోవాలి, రజో తమో గుణాలతో. ఎందుకంటే, వీరిద్దరు ఆత్మలను అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. కాబట్టి పోటీ తప్పదు, పాట్లు పోట్లు కోర్టులు తప్పవు జీవితాంతతం. రజో తమో గుణాల పెళ్ళి లేదా బంధాలల్తో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో వెతకనవసరము లేదు, ఇరువైపులా తగ్గట్లు గానే ఉంటారు, నిత్య పోరాటాలతో, పతన దోవలతో.
ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మ శాస్త్రం చెప్పాలి? ఎంత అమాయకముగా రాశారు రచయిత. ఆత్మలను అమ్ముకున్నాక, కొన్నాక, ఇంక ధర్మాలతో దేవుడు దెయ్యాలతో పనేమిటి? అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్య అంటే తనువున సగ భాగం, అని అమ్మకాలు కొనుగోలు దగ్గర మరచారా? సత్వ గుణం గల భాగస్వామిని ఎందుకు ఉచితముగా ఎంచుకోలేదు?
కొనక పోతే, అమ్మక పోతే, గుణ భాగస్వామి అయితే, సొంత అమ్మకు ఎందుకు నచ్చ చెప్పుకోలేవు, ఇది తప్పు అని? ప్రహ్లాదుడు తండ్రికి, భరతుడు తల్లికి బుద్ది చెప్పలేదా?
అమ్మిన అమ్మ, కొన్న భార్య - ఈ ఇద్దరి మధ్యన పందెమా, అధికారం కోసం పంతమా? అసలు కొనుక్కున్నాక ఈ ప్రశ్నకు అర్ధం ఉందా? గేదెను/ సైకిల్ ను సంతతో అమ్ముతాము, ఇక మనకు దానికి ఏమి సంబంధం? అమ్ముకున్నాక, అనుబంధం అంటే బంధమా, అనురాగం హక్కులా కోసమా అని అడగవచ్చునా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు, ఈ చిక్కును వదిలించేదెవరు. మీరే కదా అమ్ముకున్నది కొన్నది, కాబట్టి మీరే జవాబు చెప్పాలి, వదిలించుకోవాలి, బయట వారెందుకు?
కొంగు చాటు బిడ్డగానె ఉండాలని ఈ తల్లి అనుకుంటే, అమ్ముకోదు. తను అన్నమాట చెల్లించకుంటె, శాంతించని కొన్న అర్ధాంగి, అంతే కదా? శాశించే సమయములో, సాగించె సమరములో, కొడుకల్లె మిగలాలో, మొగుడల్లె నిలవాలో, తేల్చలేని ఈ మగవాడు, ఏ వైపు మొగ్గు చూపిస్తాడు? సంసార నాటకములొ ఇతడు, ఏ పాత్ర దాల్చి మెప్పిస్తాడు? పిచ్చి ప్రశ్న, అమ్ముడుపోయిన పశువు ఎటూ వైపు ఉండాలి? కొన్న వారి వైపే కదా? ఆత్మాభిమానం ఉంటే, అమ్ముడుపోతుందా?
అత్తగారి పెత్తనంలో, కొడుకంటే అరాటం కు అర్ధం లేదు అమ్ముకున్నాక. కొనుక్కున్న కోడలమ్మ పట్టుదల్లో, పతి క్షేమం పరమార్ధం కనిపించదు. ఈ పచ్చని నోట్ల అమ్మకాల లొగిల్లో, పై వాల్లెవరున్నారు, వీరికి వీరే కదా? ఈ ధన మమతల కోవెల్లో, ఈ కలహలెందుకు అంటే ఎలా? బ్రమలు లో గొడవలు సహజం.
కొన్న అమ్మిన అలుమగలలో అనురాగం, ఇల్లాలు అత్తకు తెలియొద్దా. కన్న పశువును అమ్ముకున్న అత్తగిరిలో అమ్మతనం, కాబోయె తల్లికి తెలియొద్దా? ఖచ్చితముగా తెలుస్తున్నది.
అదే ఇప్పుడు 80 శాతం ఇళ్ళలో నిత్యం అగ్ని పుట్టిస్తున్నది. తమ తప్పులు తెలుసుకుని, సత్వ గుణ పెళ్ళిళ్ళ వైపు, క్రుతజ్ఞత విశ్వసనీయతలతో ఎవరూ వెళ్ళే, ఓపిక సహనం ధర్మం లేవు కదా. అందుకనే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలి సాధనతో. లేదంటే, ముదుసలితనములో లేదా రోగాలలో, ఒంటరి జీవితాలు అనాధాశ్రమాలు తప్పవు.
+ + +
ఏ న్యాయస్థానం తేల్చాలి.., ఏ ధర్మ శాస్త్రం చెప్పా.లి..2
అమ్మంటే తనువిచ్చిన దైవం ..., భార్య అంటే తనువున సగభాగం
ఈ ఇద్దరి మధ్యన పందెమా, అధికారం కోసం పంతమా
అనుబంధం అంటే బంధమా, అనురాగం హక్కులా కోసమా.
ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు... ఈ చిక్కును వదిలించేదెవరు.
ఏ న్యాయస్థానం తేల్చాలి.., ఏ ధర్మ శాస్త్రం చెప్పా.లి.
కొంగు చాటు బిడ్డగానె, ఉండా.లని ఈ తల్లి,
అన్నమాట చెల్లించకుంటె, శాంతించ.ని అర్ధాంగి
శాశించే సమయములో., సాగించె సమరములో.
కొడుకల్లె మిగలాలో., మొగుడల్లె నిలవాలో.
తేల్చలేని ఈ మగవాడు, ఏ వైపు మొగ్గు చూపిస్తాడు
సంసార నాటకములొ ఇతడు, ఏ పాత్ర దాల్చి మెప్పిస్తాడు
ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు... ఈ చిక్కును వదిలించేదెవరు
ఏ న్యాయస్థానం తేల్చాలి.., ఏ ధర్మ శాస్త్రం చెప్పాలి
అత్తగారి పెత్తనంలో, కొడుకం.టే అరాటం
కోడలమ్మ పట్టుదల్లో, పతి క్షే.మం పరమర్ధం
ఈ పచ్చని లొగిల్లో., పై వాల్లెవరున్నారు.
ఈ మమతల కొవెల్లో., ఈ కలహ.లెందుకు .
అలుమగలలో అనురాగం, ఇల్లాలు అత్తకు తెలియొద్దా
అత్తగిరిలో అమ్మతనం, కాబోయె తల్లికి తెలియొద్దా
ఈ ప్రశ్నకు బదులిచ్చేది ఎవరు...!? ఈ చిక్కును వదిలించేదెవరు
ఏ న్యాయస్థానం తేల్చాలి.., ఏ ధర్మ శాస్త్రం చెప్పాలి
అమ్మంటే తనువిచ్చిన దైవం ..., భార్య అంటే తనువున సగభాగం
రచన: సిరివెన్నెల, గానం.కె.జె.ఏసుదాస్ కోరస్
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,126; 104 తత్వాలు (Tatvaalu) and views 259,051 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments