Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. నిన్న గిల్ రాయ్ వెల్లుల్లి రుచుల తిరణాల(పండగ), అంటే ఆంగ్లం లో Gilroy garlic food festival, కార్యక్రమములో అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. అన్ని టీవీ వార్తలు లో అదే, అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసారు.
ఈ సంఘటన జరిగింది Jul 28, ఆదివారం సాయంత్రం, షుమారుగా 5.40 PM కి లోకల్ ఫసిఫిక్ కాలమానం ప్రకారం(PST), భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం షుమారు 6.10 AM(IST).
ఈ ఊరు, శాన్ ఫ్రాన్సిస్కో కి దక్షిణం గా కనీసం 80 మైళ్ళు దూరం లో ఉంటుంది, కారు లో గంటన్నర పడుతుంది.
ఆ శబ్దాలు వినగానే, జనము హహకారాలు చేస్తూ బయటకు పరుగెత్తారు. ఒకతను కాల్పులు జరిపితే, కనీసం ముగ్గురు చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. దేవుని దయవలన, అందరూ క్షేమంగా ఉండాలి. మరణించిన వారి ఆత్మ కి శాంతి కలగాలి.
ఒక దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు, ఇంకొకతని కోసము వెతుకుతున్నారు అని సమాచారం. 2వ వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు, జనము మాటలను బట్టి అనుకుంటున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి, శాంటినో విలియం, 19 ఏళ్ళు.
చాలా పేరున్న అతి పెద్ద తిరణాల, దేశం నలుమూలల నుంచి జనం వేలాది గా తరలి వస్తారు. వెల్లుల్లి తో చేసిన అన్ని రకాలు వంటలు, ఆటలు, పాటలు, వంట పోటీలు, బహుమతులు.
ఊరి బయట పెద్ద పార్కింగ్. 10 పైగా పెద్ద బస్సులు రెడీగా ఉంటాయి, ప్రతిక్షణం జనం కోసం. అక్కడ నుంచి బస్సులలో తీసుకువెళ్ళి, మరలా వెనక్కు తెస్తారు. తిరుణాల దగ్గర కార్లు రద్దీ తట్టుకోవడం కష్టం కాబట్టి.
40 ఏళ్ళు గా ఈ తిరణాల జరుగుతుంది, ఎప్పుడూ విపరీతమైన జనం వస్తారు, ఉచితమా అంటే కాదు, ప్రతి పెద్దకు 20 డాలర్లు, పార్కింగ్ కు 15 ఉంటుంది షుమారుగా.
గతం లో వెళ్ళాము , ప్రత్యేక అనుమతి తో(మీడియా). మరలా ఎందుకు లే అని, ఈసారి వెళ్ళలేదు. దగ్గర గుడి ఉంటే వెళ్ళాం. లేకపోతే, ఆ జన సముద్రం లో అమ్మ తో పరుగు అంటే. వామ్మో, ఊహించలేము ఏమి జరిగి ఉండేదో.
భగవంతుడు మన ఆలోచన ఎలా మార్చారో చూడండి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 86 Tatvaalu అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments