దేవాలయం - దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం - అహం బ్రహ్మస్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,711; 104 తత్వాలు (Tatvaalu) and views 225,615.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

This song is also referring jagadguru Adi Shankaracharya sloakam, saying our body is a temple, soul is Shiva, mind is Parvati. It is also saying, each person is a brahma and have right to know brahma jnana.

ఎంతో అద్భుతమైన పాట ఇది, మీరూ పాడి వినిపిస్తారు కదూ? ముందు తనను తాను తెలుసుకో గలిగిన వాడే బ్రహ్మము అంటున్నారు. దైవ ఆదాయ మార్గమైన దేవాలయాలు కేవలం వ్యక్తుల పెత్తనములో ఉంటే, ఒక విధమైన సమస్యలు. అదే ప్రభుత్వం తో ఉంటే, ప్రభుత్వ పలుకుబడి వ్యక్తులతో, ఇంకో రకమైన సమస్యలు.

ఈ పాటలో, నేనే బ్రహ్మ ఎందుకు కాదు? అవ్వాలంటే ఏ అర్హత ఉండాలి? ఎవరి అధికారం కావాలని, పెత్తందార్లను ప్రశ్నిస్తూ, మనకు కూడా, ఆత్మ జ్ఞానం చేసారు. నేను బ్రహ్మ అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం.

అలాగే జగద్గురు ఆదిశంకరులు చెప్పిన జ్ఞానాన్ని కూడా మనకు తెలిపారు - ఓ శంభో.!నా ఆత్మయే నీవు; నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి), నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు), నా ఈ శరీరమే మీ గృహము అని.

అంతే కదా, సరిగ్గా సరిపోయింది. ఎప్పుడు అయితే, బుద్ది ని ఆత్మ ను కలపి ముందుకు సాగుతామో, అరిషడ్వర్గాలను జయించినట్లే కదా?

అలాగే భగవద్ గీత లో ని, సమానత్వం ఉత్తమ భక్తుల లక్షణాలను ఆయనకు ఎవరు ఇష్టమో కూడా చెప్పారు. ఇలాంటివి, ఇతర గ్రంధాలలో ఉండవు, వారికి అవి తెలీదు. మా మతము లో లేకపోతే, ఇక నువ్వు మనిషివే కాదు అంటారు.

ఈ కింద చెప్పినవి అన్నీ మనకు సరిగ్గా సరిపోయినవే, మేము పాటిస్తున్నవే. మరి మీరు?

It is also saying sloka from bhagavad gita BG 12.13-14, One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on Me – such a devotee of Mine is very dear to Me.

భగవద్గీత BG 12.13-14: ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనము పై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, ధృడ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.


పల్లవి :
దేహో దేవాలయో ప్రోక్తో, జీవో దేవస్సనాతనః

దేహమేరా దేవాలయం 2 జీవుడే సనాతన దైవం

నేనే బ్రహ్మ... నేనే విష్ణువు 2 నేనే శివుడై నిలబడితే....
ఏ అర్హత నాకుండాలీ? ఏ అధికారం కావాలీ?

అహం బ్రహ్మస్మి... అహం బ్రహ్మస్మి, ||దేహమేరా||

చరణం 1 :

ఆత్మాత్వం గిరిజా మతిః, పరిజనాః ప్రాణః శరీరం గృహం

అనలేదా ఆది శంకరుడు..., అంతకు మించిన వారా మీరు?

ఆడంబరమూ బాహ్యవేశము, అర్బాటలే మీ మతమా
అస్థికులంటే మీరేనా, అస్థికలంటే శరీరమా

శిలా గోపురం ఆలయమా, శఠగోపురమే అర్చనమా ||దేహమేరా||

చరణం 2 :
అద్వేష్టా సర్వ భూతానాం, మైత్రః కరుణ యేవచ
నిర్మమో నిరహంకారః, సమ దుఃఖ సుఖ క్షమీ
సంతుష్ట స్సతతం యెగీ, యదాత్మా దృఢ నిశ్చయః
మై అర్పిత మనో బుద్దిర్యోహో, మద్బక్త స్సమే ప్రియః 3

దేహమేరా దేవాలయం, చిత్రం : దేవాలయం (1985), సంగీతం : చక్రవర్తి, గీతరచయిత :
నేపధ్య గానం : బాలు
Dehamera Devalayam Video Song from Devalayam Telugu Movie
Starring : Shoban Babu, Vijay Shanthi, JV Somayajulu.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,711; 104 తత్వాలు (Tatvaalu) and views 225,615
Dt : 25-Apr-2022, Upd Dt : 25-Apr-2022, Category : Songs
Views : 2352 ( + More Social Media views ), Id : 1369 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dehamera , devalayam , movie , shoban , vijaya , shanthi , somayajulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content