Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. అమెరికాలో దెయ్యాల పండగ సందడి అప్పుడే మొదలైంది. దేశంలోని ఏ షాప్ కు వెళ్ళినా ఈ పండగ దెయ్యాల కస్ట్యూమ్‌లు, మాస్క్‌లు పెట్టి ఉన్నాయి.
ఏ వ్యాపార స్థలమునకు వెళ్ళినా ఈ పండుగ అలంకారములు చూడవచ్చు - సాలె గూడులు, పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మలు కనిపిస్తాయి. ఈ హాలోవీన్ పండుగ సమయంలో, అనేక కోట్ల వ్యాపారము జరుగుతుంది అంటారు. కొట్ల లో, రకరకాల చాక్లెట్లు విక్రయానికి ఉంటాయి. ట్రిక్ లేదా ట్రీట్ ఆట కు ఇంటికి వచ్చిన పిల్లలకు, ఈ చాక్లెట్లు పంచడము ఆనవాయితి.
హాలోవీన్ పండగను ప్రతి ఏడు అక్టోబర్ 31న అనేక పశ్చిమ దేశాల్లో నిర్వహించుకుంటారు. పండగలు దేవుళ్ళకే కాదు, దెయ్యాలకూ ఉంటాయనేది ప్రజలు విశ్వాసం. బతికి ఉన్నవారికి మరియు లేని వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వీరి నమ్మకం. బహుశా పిల్లలు కూడా, దెయ్యాలు అంటే భయపడకుండా ఉంటారు కదా.
ఆల్ హలో ఈవెనింగ్ నుంచి ఈ హాలోవీన్ పుట్టింది అంటారు. దీన్ని ఆల్ సెయింట్స్ డే అని కూడా పిలుస్తారు.
ఈ పండుగ రోజున, దెయ్యం సినిమాల్లోని భయంకర పాత్రల మాదిరిగా, వికృత వేషధారణల్లో పిల్లలు పెద్దలూ కూడా కనిపిస్తుంటారు. తామూ దెయ్యాల వేషములో ఉంటే, ఆ రోజున వచ్చే దెయ్యాలు, వీరూ తమలో వారే అని, ఏమి చేయవని ఇంకో విశ్వాసం.
పాత రోజుల్లో చిరంజీవి పాట గుర్తు ఉందా, గోలీమార్ అని, దొంగ(1985) సినిమాలో, అలాంటి వికృత వేషధారణ. See picture and video.
పిల్లలు, బకెట్లు లేదా సంచులు పట్టుకుని, ఇంటింటికీ వెళ్లి చాక్లెట్లు సేకరిస్తారు. పిల్లలు ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నపుడు, మేం ట్రిక్(మాజిక్ - ఇంద్రజాలం) చేయలేం కానీ, ఇదిగో ట్రీట్(తినడానికి) అంటూ పెద్దలు, చాక్లెట్లు ఇస్తారు. పిల్లలు కూడా ట్రిక్ చేస్తారు అని ముందే చాక్లెట్ లు ఇస్తారు పెద్దలు. పండగ రోజు సాయంత్రం చాక్లెట్లను పెట్టుకుని ఇంటి గుమ్మం ముందు ఉండి, అటువైపు వచ్చిన పిల్లలకు ఆనందంగా పంచుతారు.
ఈ దెయ్యాల పండగ పుట్టింది ఐర్లాండులో. 1846లో ఏర్పడిన కరువు దెబ్బకు, అమెరికాకు వలస వచ్చిన ఐర్లాండు వాసులు, ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు.
దీన్ని హార్వెస్ట్ పండుగ అని కూడా అంటారు, అంటే పంట కోతల కాలం ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక. హాలోవీన్‌లో అంత్యంత ముఖ్యమైనది, గుమ్మడికాయలో లాంతర్లను(Jack-o-lantern) ఏర్పాటు చేసి అలంకరించడం.
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,383,001; 104 తత్వాలు (Tatvaalu) and views 257,834 ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments