కాళహస్తి మహాత్యం -మహేశా పాపవినాశా, శ్రీ పార్వతిదేవి, మాయజాలము, జయజయ మహాదేవా, చంచలమైన - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,990; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఓం నమహ్ శివాయా, హర హర మహాదేవ శంభో శివ శంకర.

ప్రపంచ యుద్దం రాకుండా, ఆపదలు రాకుండా, ఇంతకన్నా మనము చేయగలిగింది ఏముంది? ఏ మంచి ప్రయత్నము చేయకుండా, స్వార్ధము గా ఉంటే, దేవుడు మెచ్చడు.

భక్తి గీతాన్ని అనుభూతి చెంది పాడండి, గాత్ర మాధుర్యం ఆయాసం గురించి చింతించకండి, భక్తి ప్రయత్నం మాత్రమే లెక్కించబడుతుంది.

ఇది మనశ్శాంతికి అమృతం లాంటిది మరియు అనేక వ్యాధులను నివారిస్తుంది మరియు ప్రపంచ భ్రమలకు దూరంగా ఉంటుంది.

కాళహస్తి మహాత్యం 1954, కన్నడ రాజకుమార్ నటించిన సినిమా నుంచి ఈ పాటలు.

1. ఓ నమశ్శివాయా నవనీత హృదయా

తమ: ప్రకాశా తరుణేందుభూషా

నమో, శంకరా, దేవదేవా

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా - మహేశా

భక్తి యేదో పూజలేవో తెలియనైతినే 2
పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా 2 మహేశా

మంత్ర యుక్త పూజసేయ, మనసు కరుగునా 2
మంత్రమో - తంత్రమో ఎరుగనైతినే 2
నాదమేదో వేదమేదో తెలియనైతినే 2
వాదమేల పేదబాధ తీర్చరావయ్యా స్వామి 2 "మహేశా"

చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య 2
ప్రాకటముగ చిరువేట చూపి, నా ఆకలి తీర్చగరావయ్య 2
దీటుగ నమ్మితి గనవయ్య, వేట చూపుమా రుద్రయ్యా (2)
వేట చూపుమా రుద్రయ్యా 2
Mahesa papa vinasa kailasavasa eesa
రచన: తోలేటి, గానం: ఘంటసాల, సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం

2. శ్రీ పార్వతి దేవి, చేకోవే శైల కుమారి
మా పూజలే తల్లీ గౌరీ శంకరీ.. గౌరీ.. శంకరీ.. 2

ప్రాపు నీవే పాపహారి, పద్మ పత్ర నేత్రీ 2
కాపాడ రావమ్మా.. కాత్యాయనీ..2 శ్రీ పార్వతి దేవి

నిన్ను నమ్మినాను తల్లీ, అన్నపూర్ణ దేవి 2
పాలించ రావమ్మా , పరమేశ్వరి.. ఈ..ఈ.. 2 శ్రీ పార్వతి దేవి
Sri parvati devi, chekove saila kumari

3. మాయ జాలమున మునిగేవు నరుడ
దారీ తెలియక తడబాటులేల 2
జ్ఞాన నేత్రమున వెదకీ జూడుమ
శాశ్వత జ్యోతీ.. కనుగొనుమా.. 2

జీవిత సమర విహారములోన, దీక్షా ధైర్యం జయపేరి రా - 2
జీవుడులో శివుడున్నాడురా 2 నరుడ
ఆ శివుడే జగదాధారి రా 2

నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇల ఫలియించు రా 2
మదిలో కల్లోలము విడరా... 2
మనసున గల దేవుని గనరా... 2

మాయ జాలమున ..
మునిగేవు నరుడ మునిగేవు నరుడ
Maya jalamun munigevu naruda

4. జయ జయ మహాదేవ శంభో హరా శంకరా సత్య శివ సుందరా నిత్య గంగాధరా!
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా!
భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్!
దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్!
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్!
విశ్వరూపా! మహామేరు చాపా! జగత్సృష్టిసంరక్షసంహారకార్యః కలాపా!
మహిన్ పంచభూతాత్మ నీవే కదా! దేవ దేవా! శివా!
పృథ్వి జల వాయురాకాశ తేజో విలాసా! మహేశా! ప్రభో!
రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా!కాశీపురాధీశ విశ్వేశ్వరా!
నీలిమేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా! శ్రీశైల మల్లేశ్వరా!
కోటి నదులందు సుస్నాముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా!శ్రీరామలింగేశ్వరా!
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమా వాస భీమేశ్వరా!భీమేశ్వరా!
దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీస్వరా! శ్రీకాళహస్తీస్వరా!
దేవ దేవా! నమస్తే నమస్తే! నమస్తే! నమః!
Jaya Jaya Mahadeva

5. స్వామీ..! చంచలమైన చిత్తమిదె.., నీ ఙ్ఞానాంజనా రేఖచే..
నీమంబున్ గొనె.., నిశ్చలత్వ మొదవెన్, నిండారు నీ భక్తిచే..
కామక్రోధ విరోధ వర్గములు, చీకా.కై నశించెన్ భవద్
ధామంబౌ, రజతాద్రి జేర్చ.., దయరాదా..! కాళహస్తీశ్వరా..!
కాళహస్తీశ్వరా..! శ్రీ కాళహస్తీశ్వరా..!ఆ ఆ

చండహుతాశు కీలికలు, చయ్యన గ్రక్కుచు దండధారి
మా ర్కండునిపై మహోగ్రగతి, గ్రక్కున వైచిన కాలపాశమే..
గ్రక్కున వైచిన కాలపాశమే..
తుండెములై పఠా.లుమని తూలిపడెన్, నిను నమ్మువారికీ.
దండనలేమిలెక్క, రజతాచలవాస.., మహేశ.., ఈశ్వరా..!

ధన్యుడనైతిని.. దేవదేవ..2
ఎన్నడైన మరువనయ్య, (నీ) పాదసేవ 2
పాహి శంకర.., మాం పాహి శంకర..2

పాహి శంకర.., మాం పాహి శంకర
దీనాళి రక్షించు దేవ దేవా 2
నా గతి నీవయ్య, దేవ దేవా 2
పాహి శంకర.., మాం పాహి శంకర..2

దేవా.., దివ్య క్రుపాకరా భవహరా..
దీనావనా శంకరా..
నీవాళ్యభ్యద్రుగంచలా అమ్రుతఝరుల్, నీ పుత్రుపై చల్లగా...,
భావాతీ.త. మనోజ్ఞ నేత్రముల్, విప్పారించి నా.వా.
ప్రభో..., సేవా భాగ్యము కల్గచేయుమా దయన్..
శ్రీ కాళహస్తీస్వరా... శ్రీ కాళహస్తీస్వరా...
Swamy Chanchalamaina chittamide

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954), రచన: తోలేటి, గానం: ఘంటసాల, సంగీతం: ఆర్.గోవర్ధనం, ఆర్. సుదర్శనం

Kalahasti Mahathyam - Mahesha Papavinasha Kailasavasa Isha, Sri Parvati Devi, Chekove Shaila Kumari

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,990; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528
Dt : 05-Mar-2022, Upd Dt : 05-Mar-2022, Category : Songs
Views : 975 ( + More Social Media views ), Id : 1310 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kalahasti , mahathyam , mahesha , papavinasha , kailasavasa , parvati , shaila , kumari , Rajkumar , kannada , Jaya , Mahadeva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content