తెలిసిన జీవిత భాగస్వామి, ప్రధాన దేవత ఒకరే, గతం తెలియని కొత్త గురువు లెందుకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2084 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2119 General Articles and views 1,881,420; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

భగవద్గీత లో కృష్ణ భగవానుడు వివరంగా, ఎవరి చిత్తము దృష్టి కర్మ ఓపిక సహనము నా వైపు ఉంటుందో, వారి యోగ క్షేమము నేను వహించెదను అని నారాయణుడి గా చెప్పారు. ఆది గురువు జగద్గురువు శ్రీ కృష్ణుడే. ఇది పురాణములలో చెప్పబడింది.

మరి దానిని తస్కరించి కొత్త బాబాలు గురువులు లేదా వారి అనుచరులు ప్రచారం చేస్తే నమ్ముతామా? మరి మనం కొత్త గురువు లు , బాబాల దగ్గరకు ఎందుకు వెళుతున్నాము, బలహీన మనసు తో లేదా చపల చిత్తము తో.

కనీసం బతికి ఉన్న మానవ గురువు, మన ఇంట్లో లేదా మన మనసులో సమస్యలు బాధలు విని, స్వార్థ రహితంగా, మంచి మార్గం నిర్దేశం చేయాలి కదా, మనలను దేవుని వైపు మరలిస్తూ? ఇంత చిన్న విషయం ఎలా మరుస్తున్నాము చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళము కూడా. మనల్ని చూసి పల్లెటూరు వాళ్ళు మొదలు.

మన ఇంటికి ఎవరన్నా వచ్చి అద్దెకు ఉంటాము అంటే నే, వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని, నమ్మకం లేకపోతే ఇల్లు కూడా ఇవ్వము. కనీసం కొత్త వారిని ఇంట్లో కి రానీయము. మన పిల్లలను సంబంధము కోసము ఇవ్వము.

మరి ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో, వారి గతం ఏమో, వారి గురువు ఎవరో, తల్లి దండ్రులు ఎవరో, తెలీకుండానే గాలి మాటలు విని నమ్మి, పోలోమని పరుగులు తీస్తూ ఉన్నాము అంటే, మనంత మూర్ఖులు ఉంటారా? గురువు, కులము, మతము, తల్లి దండ్రులు, ఊరు, అన్ని వివరాలు తెలిసిన రాముని, కృష్ణుని నమ్మము.

లేదా ఉదయం ఈ గుడి లో ఒక కాలు, సాయంత్రం ఆ మందిరంలో ఇంకో కాలు. మనకున్న చంచల నీతి అదే కదా? పిల్లల కు నేర్పే చంచల మంచి బాధ్యత అదే కదా?

పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన జీవిత భాగస్వామి ఒకరే ఉండాలి, అలాగే పురాణ ప్రధాన దేవత ఒకరే ఉండాలి. అది రాముడో, శివుడో, నారాయణుడో, ఆదిశక్తో కావొచ్చు. ఇంక గతం తెలియని కొత్త మానవ గురువు లెందుకు?

పురాణాలలో చెప్పిన, కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం, మన తెలుగు గడ్డ మీద ఉన్న, తిరుమల తిరుపతి వెంకన్న కన్నా గొప్ప దైవం ఉన్నారా.

తెలుగు వారమై ఉండి, వేరే గురువు లు కోసం, వెంకన్న కిచ్చే ధనం ఎందుకు వృధా చేస్తున్నాము? తిరుమల దేవస్థానం హైందవ సంస్కృతి ని, నీతి నియమాలను, క్రమశిక్షణ తో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తోంది. బాలాజి గుడులు దేశ విదేశాలలో కడుతూ, హైందవాన్ని ప్రచారం చేస్తుంది ప్రభుత్వ సహకారముతో. అదే డబ్బు, మన తెలుగు నేల కు కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పటి కీ అర్థం కాని విషయం ఏమిటి అంటే, భారత దేశం లో ని లేదా ప్రపంచంలో ని హైందవ జాతి మొత్తం, తిరుమల వచ్చి దేవ దేవుడు అని, నారాయణ స్వరూపుడైన వెంకన్నను కొలుస్తూ వెంకన్న గుడులు కడితూ ఉంటే,

కేవలం తెలుగు వారు మాత్రం ఉత్తరం వైపు పరుగులు తీస్తూ, గతం తెలియని గురువు కు ప్రపంచ వ్యాప్తంగా, విపరీత ప్రచారం చేసి, మందిరాలు కట్టి, వ్యాపారం చేస్తున్నారు, పక్క దారి పడుతున్నారు, మిగతా వారిని పట్టిస్తున్నారు.

ఎందుకో మీకైనా తెలుసా? చెప్పి పుణ్యం కట్టుకోగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2119 General Articles and views 1,881,420; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268
Dt : 22-Jan-2020, Upd Dt : 22-Jan-2020, Category : General
Views : 975 ( + More Social Media views ), Id : 283 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , rama , narayana , guruvu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content