లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం- LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM, Adi Shankaracharya - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,999; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, రచించినవారు ఆది శంకరాచార్యులు. చాలా శక్తివంతమైనది. మొన్ననే జయంతి వెళ్ళింది, పూజించి ఉంటారు కదా. అత్యంత శక్తివంతమైన దేవుడు.

రాక్షసుడైన తండ్రి ని మార్చే ప్రయత్నములో, తండ్రి చేతిలోనే, ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా, నారాయణ స్మరణ మరువకుండా, దేవ దేవునే కిందకు రప్పించాడు, స్థంభము నుంచి.

మరి నేడు అలాంటి నీతికి నిలిచే ప్రహ్లాదులు ఉన్నారా ఏ ఇంట్లో అయినా? తండ్రి అక్రమాలు అన్యాయాలు చేస్తూ, జనాల సొమ్ముతో ఆస్తులు పెంచుతుంటే, ఇది తప్పు, అలాంటి తిండి నాకు వద్దు, అలాంటి సంపాదన మనకు వద్దు అనే, ఉత్తమ పిల్లలు లేరు.

తండి రాక్షస క్రుత్యాలలో పాలుపంచుకునే, ఆ మత్తులో తూగే, ఉత్తర కుమారులే అందరూ, కదూ? ఇంకా తండ్రికి, కొత్త గా ఎలా మోసం చెయాలో, కూడా నేర్పుతున్నారు తమ తెలివితేటలతో. అందుకే, పెరుగుట విరుగుట కొరకే అన్నది పెద్దలు.

ఎందుకండీ ఇన్ని స్త్రోత్రాలు అంటారు. మరి ఇన్ని, సినిమాలు మరియు గేం లు ఎందుకు, సంగీత సినిమా పాటలు ఎందుకు ఇన్ని, వంటకాలు ఫలహారాలు రుచులు సోకులు సౌకర్యాలు ఎందుకు ఇన్ని అని మాత్రం ఎప్పుడూ అడగము, ప్రాపంచిక వ్యామోహం లో.

కానీ ప్రతి దైవ స్త్రోత్రాలు లో బీజాక్షరాలు ఉంటాయి, నిఘూడముగా. వాటిని పలికే తీరులో, మన ఆరోగ్య రక్షణ ఉంటుంది.

మన సాంప్రదాయ గొప్ప తనం, విలువ మరియు జాగ్రత్తలు, నేటి కరోనా గురువు పరంపర తో, అందరికీ ఆదర్శ ప్రాయం అవుతున్నాయి కదూ.

స్తోత్రాలు మరలా మరలా, మనం మననం చేయాలి, స్పష్టము గా పలకాలి, ఏకాగ్రత తో మనసు ను నియంత్రణ కొరకు, అవన్నీ కావాలి.

అవి మన నోటితో ఒక క్రమ పద్దతిలో పలికినప్పుడు, ఒళ్ళు పులకరించి, శరీరం జలదరిస్తుంది, రక్త ప్రసరణ శ్వాస నియంత్రణ ఉంటుంది.

మనసును నియంత్రించేదే మంత్రం. పద్మాసనం వేసుకుని, నిఠారుగా కూర్చొని రాగ యుక్తముగా, ఈ పదాలు పలికి చూడండి.

చాలా మందికి అసలు నొటికే తిరగవు మరి. మన గొంతు పై లింకు లో వినండి, మరీ మీరూ ఉచ్చారణ చేయాలి.

*లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఆది శంకరాచార్య, LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM, Adi Shankaracharya, लक्ष्मी नृसिंह करावलंब स्तोत्रम्, आदि शंकराचार्य*

śrīmatpayōnidhinikētana chakrapāṇē bhōgīndrabhōgamaṇirājita puṇyamūrtē ।
yōgīśa śāśvata śaraṇya bhavābdhipōta lakṣmīnṛsiṃha mama dēhi karāvalambam ॥ 1 ॥

श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगींद्रभोगमणिराजित पुण्यमूर्ते ।
योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मीनृसिंह मम देहि करावलंबम् ॥ 1 ॥

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే ।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 1 ॥

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత ।
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 2 ॥

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య ।
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 3 ॥

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య ।
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 4 ॥

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య ।
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 5 ॥

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ ।
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 6 ॥

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః ।
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 7 ॥

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పం ।
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 8 ॥

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య ।
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 9 ॥

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ।
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 10 ॥

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య ।
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 11 ॥

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ।
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 12 ॥

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప ।
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 13 ॥

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ ।
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 14 ॥

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః ।
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 15 ॥

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస ।
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥ 16 ॥

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ।
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం ॥ 17 ॥  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,999; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010
Dt : 25-May-2021, Upd Dt : 25-May-2021, Category : Devotional
Views : 1822 ( + More Social Media views ), Id : 1178 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lakshmi , narasimha , karavalamba , stotram , shankaracharya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content