ఒకే కుటుంబం- మంచిని మరచి వంచన నేర్చి, నరుడే ఈనాడు వానరుడైనాడు - NTR, Kantha Rao - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,470; 104 తత్వాలు (Tatvaalu) and views 226,269.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఒకే కుటుంబం- మంచిని మరచి వంచన నేర్చి, నరుడే ఈనాడు వానరుడైనాడు - NTR, Lakshmi, Kantha Rao, Rajashree*

ప్రముఖ సినిమానటుడు నాగభూషణం ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాకు తమిళచిత్రం పాపమణిప్పు ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో, తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్‌.రాధా కి నాగభూషణమే డబ్బింగ్‌ చెప్పారు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించారు.

ఏమండీ మీరు ఒక్కరే మంచివారా నీతులు చెపుతున్నారు, మీరే నిబద్దత గల వారా అంటారు 75 మంది 100 లో, తమ తప్పు ఒప్పుకోలేక, సరి చేసుకోలేక, 60 తర్వాత కష్టాలు ఊహించలేక. అదే కపట నాటక పరిస్తితి.

అయ్యయ్యో ఎంత మాట అండీ, మీ ఇంట్లో పెద్దవారు నీతులు చెప్పలేదని నేర్పలేదని, సుమతి వేమన శతకాలు తెలీవని, ఇక అందరూ అలాగే తోటి మనిషి పతనాన్ని చూస్తూ ఆనందించమని, మన పతనం కొనసాగించమని ఎవరు చెప్పారండి?

అలా చెప్పేవారు, తన బిడ్డలందరినీ కాపుకాచే, దేవుని దగ్గర పూజల నాటకాలు ఎందుకండీ? సంఘము అంటే, మనము ఒక్కరమేనా, మన స్వార్ధమేనా? చుట్టూ అందరూ అధర్మం లో మునిగిపోతే, మనము ఒక్కరిమే ధర్మం గా ఉండగలమా? చుట్టూ ఇళ్ళు తగలపడితే, మన ఇల్లు కాలకుండా ఉంటుందా? మనది కాలాక ఆర్పుదామా? ముందే అందరి ఇళ్ళ మంటను ఆర్పుదామా? చుట్టూ 10 మందికి మనశ్శంతి లేకపోతే, మన ఒక్కరికి ఉంటుందా?

అంటే, మీ పిల్లలకు కూడా నీతులు, మీరు చెప్పరు అనేగా అర్ధం? ఇలా ఉంది మన పరిస్తితి ఈ రోజు. అందుకే ఈ సినిమా పాటల పరంపర. నీతులు మీరు మేము మాత్రమే కాదు చెపుతున్నది, మనకన్నా ముందు మన తాతలు, సినిమా వారు, ఎంటీయార్ అక్కినేని, ఇతర పెద్దలు అందరూ చెప్పారు, ఇదిగో సాక్ష్యం.

50 ఏళ్ళ క్రితమే, మనుషులలో వానర లక్షణాలు కనపడ్డాయి అని చెపుతుంది ఈ పాట. మరి 50 ఏళ్ళ తర్వాత, కనీసం చింపాంజీ స్థాయికి అయినా నాగరికత పెంచుకుని, పతన దిశలో నడుస్తున్నామా లేదా అని పెద్దలు మీరే చెప్పాలి.

చదువు తెలివి పెరిగి, కపటం మోసం పెరిగి, చంద్రలోకాన్ని జయించినా, తన చేతిలో తనే ఓడిపోయి, పాతాళానికి జారాడు. మెదడు పెరిగింది, హ్రుదయం బండ అయ్యింది, స్వార్ధపు మురికి కూపం అయ్యింది, సొంత ముదుసలి తల్లి దండ్రుల మీదే జాలి లేదు. ధనం పెరిగి, గుణము చచ్చి, మానవుడు జంతువయ్యాడు అని చూడండి ఎప్పుడో ఈ పాటలో చెప్పారు. అమ్మ తోడు, ఈ మాటలు ఆనాటి పెద్దలవే, వినండి.

మంచిని మరచి వంచన నేర్చి 2
నరుడే ఈనాడు వానరుడైనాడు …., వానరుడైనాడు
మంచిని మరచి వంచన నేర్చి 2
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు

చదువు తెలివి పెంచాడు, చంద్రలోకము జయించాడు 2
నీతులు చెప్పి, గోతులు తవ్వి, పాతాళానికి జారాడు
మెదడే పెరిగి, హృదయం తరిగి
నరుడే ఈనాడు వానరుడైనాడు ….. వానరుడైనాడు

అందరి చెమట చిందించాడు, సంపద ఎంతో పెంచాడు 2
పంపకమంటూ వచ్చేసరికి, అంతా తనదే అన్నాడు
ధనమే హెచ్చి, గుణమే చచ్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు

తారాగణం నందమూరి తారక రామారావు, లక్ష్మి, కాంతారావు, రాజశ్రీ, అంజలీ,
నాగయ్య

Manchini Marachi vanchana nearchi, Oke Kutumbam, NTR, Lakshmi, Kantha Rao, Rajashree, Anjali

Cast: NTR, Lakshmi, Kantha Rao, Music: S P Kodandapani, Lyrics: Dasari, Director: A Bhimsingh, 1970, Ghantasala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,470; 104 తత్వాలు (Tatvaalu) and views 226,269
Dt : 06-Oct-2022, Upd Dt : 06-Oct-2022, Category : Songs
Views : 540 ( + More Social Media views ), Id : 1566 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manchini , marachi , vanchana , nearchi , okekutumbam , ntr , lakshmi , kantharao , rajashree , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content