Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* రెండు లక్షణాల్లో ఒకటి అవినీతిరహిత పాలన, రెండోది కొత్త పోకడలతో అభివృద్దే పరమావధి
* బెయిల్ పై ఒకరుంటే, బెయిల్ డాక్యుమెంట్లు తయారుచేసుకునే పనిలో మరొకరు
* రాజధానితో మొదలై పోలవరం టెండర్లు రివర్స్ టెండరింగ్ వరకు అన్నీ రివర్స్
* కొత్త బ్రాండులతో మద్యం , టీటీడీ ఆస్తులను అమ్మక ప్రయత్నం, ఎలక్షన్ కమిషనర్ల తొలగింపు, మొత్తం 60కి పైగా హైకోర్టుతో మొట్టికాయలు
* రాష్ట్రానికి మొత్తం రూ .45 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది
* జగన్ రూ .5,500 రైతులకు ఇస్తున్నట్లు చేసిన ప్రకటనలో రూ .4 వేలు కేంద్రానివే
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2.0 - ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వర్చ్యువల్ ర్యాలీలు - జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్
2019లో రెండవ సారి తిరుగులేని మెజారిటీతో ఏర్పాటైన, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దిగ్విజయంగా, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతీయ జనతా పార్టీ కోవిడ్ విపత్తు కారణంగా, కేంద్ర ప్రభుత్వ ఘన విజయాలపై, దేశవ్యాప్తంగా వర్చ్యువల్ ర్యాలీలు నిర్వహిస్తోంది.
10 వ తేది, సాయంత్రం హైదరాబాద్ నగరంలో, ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సారధ్యంలో, వర్చ్యువల్ ర్యాలీ సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వారణాసి రామ్ మాధవ్ గారు, ముఖ్య అతిధిగా పాల్గొని బిజెపి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు.
రామ్ మాధవ్ గారి ప్రసంగంలో ముఖ్య అంశాలు..
నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సిద్ధాంతంతో, జవాబుదారీతనంతో అహర్నిశలు పని చేస్తూ, ప్రజలకు చేరువయ్యిందని, రామ్ మాధవ్ గారు ప్రశంసల వర్షం కురిపించారు.
ఆర్ధికవృద్ధి, దేశభద్రత, ప్రజల ఆత్మగౌరవం పెంచడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం ద్వారా, ప్రధాని మోదీ చేసిన ఆదర్శవంతమైన పాలన నిర్వహించారని, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, వారణాసి రాంమాధవ్ ప్రశంసించారు.
నరేంద్ర మోదీ గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, చేసిన పనులను గత ఆరేళ్లుగా ప్రతి ఏటా ప్రజలకు నేరుగా, బిజెపి వివరిస్తోంది. ఇలాంటి మంచి సంస్కృతిని కేవలం బిజెపికి మాత్రమే సాధ్యం మని రామ్ మాధవ్ గారు హర్షం వ్యక్తం చేశారు.
ఆరేళ్ళ మోదీ గారి ప్రభుత్వ, 2 ముఖ్యమైన రెండు లక్షణాల్లో ఒకటి అవినీతిరహిత పాలన, రెండోది కొత్త పోకడలతో అభివృద్దే పరమావధితో పనిచేయడం, స్వచ్ఛమైన పాలన, అభివృద్ధి, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వమని ఆయన తెలిపారు.
ఏడాది కాలం చాలా మందికి పూర్తయింది. ఎపీకి కూడా ఆరేళ్లు పూర్తయింది. తెదేపా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నా, ఆయన తన సొంత లాభాల కోసం భాజపాను వీడారు, ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. మరో ప్రత్యామ్నాయం లేక వైఎస్ఆర్సీపికి అధికారం ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా ఏడాది పూర్తిచేసుకుంది. ఒక పక్క మోదీ ప్రభుత్వం అవినీతి రహితంగా, అభివృద్దివైపు సాగుతుంటే, దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ పాలన సాగుతుంది. బెయిల్ పై ఒకరుంటే, బెయిల్ డాక్యుమెంట్లు తయారుచేసుకునే పనిలో మరొకరున్నారని, రామ్ మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన తీరును విమర్శించారు.
ఎపీ పాలన అంతా తిరోగమనంతో సాగుతోంది. రాజధానితో మొదలై పోలవరం టెండర్లు రివర్స్ టెండరింగ్ వరకు అన్నీ రివర్స్. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేదిస్తామన్నారు, కాని కొత్త బ్రాండులతో మద్యం ప్రవహింపచేస్తున్నారని మరియు టీటీడీ ఆస్తులను ఆమ్ముదామంటే ప్రజలే ఎదురుతిరిగారని, ఎలక్షన్ కమిషనర్ల విషయంలోనూ రివర్సుగానే, ఈ ప్రభుత్వం వెళ్తోందని, అలాగే మొత్తం 60కి పైగా, వారానికోసారి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న ప్రభుత్వం, దేశంలో ఇదొక్కటే అంతే అతిశయోక్తి కాదని, రామ్ మాధవ్ గారు ఎద్దేవా చేశారు.
దేశంతో పాటు రాష్ట్రం ముందుకు కెళ్లాలని ఎపి కి కేంద్రం నిధులిస్తోందని, పన్నుల కింద రూ .35 వేల కోట్లు ఆదాయం రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో, ఆదాయం పెరగడం అటుంచి వచ్చేది తగ్గింది. ఇప్పటికే పదివేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చాం. స్థానిక సంస్థలకు రూ 3,900 కోట్లు చెల్లించాం. కోవిడ్ ను ప్రకృతి వైపరీత్యం కింద ప్రకటించి ప్రకృతివైపరీత్యాలకు ఇచ్చే నిధుల కింద, రూ .1,100 కోట్లు ఇచ్చామని, రాష్ట్రానికి మొత్తం రూ .45 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని రామ్ మాధవ్ గారు తెలిపారు.
కోవిద్ సమస్య వల్ల, ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు రూ .1.70 లక్షల కోట్లతో పిఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రకటించి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని, కోవిడ్ సంక్షోభం వల్ల ఆహార కొరత లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం, మొత్తం 1.34 లక్షల టన్నులు అదనపు ఆహారధాన్యాలు, ఉచితంగా అందచేసిందని రామ్ మాధవ్ గారు తెలిపారు.
పిఎమ్ కిసాన్ యోజన కింద రైతులకు ఇచ్చే రూ . 6 వేలలో రూ . 4 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని,ఈ పథకాన్నే చంద్రబాబు అన్నదాత పేరుతో, జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరుతో ప్రచారం చేరుకుంటున్నారని, జగన్ తాను రూ .5,500 రైతులకు ఇస్తున్నట్లు చేసిన ప్రకటన లో రూ .4 వేలు కేంద్రానివేనని, రామ్ మాధవ్ గారు స్పష్టం చేశారు.
దేశంలోని 14 కోట్ల మంది వలస కార్మికుల్లో 8 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కు వారం రోజుల ముందు, వారిని స్వస్థలాలకు పంపాలని, కొందరు మేధావులు విమర్శిస్తున్నారు. 8 కోట్ల మంది వలస కార్మికులను, నాలుగు రోజుల్లో పంపడం సాధ్యం అవుతుందా? అని రామ్ మాధవ్ గారు సభ ముఖంగా ప్రశ్నించారు.
కొందరు కార్మికులు భయంతో నడచి వెళ్లిపోతూ, ఎంతో ఇబ్బందులు పడ్డారు వారికి మోదీ క్షమాపణలు చెప్పినా,కారణమైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం చెప్పలేదు. సకాలంలో మార్చి 23 న లాక్ డౌన్ విధించడం వల్లే, దేశంలోని ప్రజల్లో 99.95 శాతం మంది ప్రజలు, నేడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఈ విషయాన్ని నిర్యక్షం చేసిన దేశాల్లోని ప్రజలు నేడు మృత్యువుతో పోరాడుతున్నారని మరియు మోదీపై నమ్మకంతో 8 కోట్ల వలసకార్మికుల్లో 7.50 కోట్ల మంది ఇల్లు వదలలేదని అంతే కాకుండా వసతి, భోజన సౌకర్యాలు కల్పించి, శ్రామిక రైళ్లు నడిపి 60 లక్షల మంది వలస కార్మికులను గమ్యం చేర్చామని రామ్ మాధవ్ గారు వివరించారు.
అన్ని రాష్ట్రాలు తమ కార్మికులను అనుమతించినా, బెంగాల్ మాత్రం తమ కార్మికులను తీసుకువచ్చేందుకు ముందుకురాలేదు.లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు వ్యవసాయరంగంలో ఉపాధి లభించేలా వ్యవసాయానికి లక్ష కోట్లు కేటాయించామని ఎంఎస్ఎంఈ లకు రూ .4 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించామని, గరీబ్ కల్యాణ్ యోజనలో ప్రకటించిన ప్రతి పైసా లబ్దిదారుల ఖాతాకు నేరుగా చేరిందని ఒక్కో కుటుంబానికి రూ . 12,500 లబ్దిచేకూరిందని రామ్ మాధవ్ గారు తెలిపారు.
ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ యోజనలోని రూ .20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా అదే విధంగా ప్రజలకు ఉపయోగపడేదేనని,దేశం తమ కాళ్లమీద తాము నిలబడేలా చేసేలా 80 వేల స్టార్టప్ కు, 7 కోట్ల ఎంఎస్ఎంఈలను నిలబెట్టడానికి, కార్మికులను ఆదుకోడానికి ఈ నిధులు ఖర్చుచేస్తామని అంతేకాని సీఎంల జేబుల్లోకి ఇచ్చేందుకు కేటాయించినవి కావుని నేరుగా ప్రజలకు చేరతాయని రామ్ మాధవ్ గారు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో 65 లక్షల పేద కుటుంబాలకు ( 2.50 కోట్ల మందికి ) రేషన్ కేంద్రం ఇచ్చిందని, 49 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ యోజన కింద నేరుగా నగదు జమచేసామని అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా దేశం తయారవుతుందా అని కొందరు అపహాస్యం చేస్తున్నారు కాని ప్రజల శక్తి, సామర్థ్యాలు,సృజనాత్మకతతో ఈ లక్ష్యాన్ని ఆరు నెలలు జాప్యమైన 2024 నాటికి సాధిస్తామని రామ్ మాధవ్ గారు తెలిపారు.
దేశ భద్రత,సార్వభౌమత్యం ప్రజల్లో ఐకమత్యం సాధించడం ప్రధాని సంకల్పమని, 370 అధికరణం రద్దు ఈ సంకల్పం వల్ల జరిగిందేనని కశ్మీర్ నేడు ప్రశాంతంగా ఉందని, ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని రామ్ మాధవ్ గారు హర్షం వ్యక్తం చేశారు.
భారత్ లోకి పంపుతున్న పాకిస్తాన్ తీవ్రవాదులను సరిహద్దు గీతమీదనే ఏరివేస్తున్నామని, ఏ విదేశీ సైనికుడు కూడా ఒక్క అంగుళం భారత భూభాగం పైన నిలబడే ప్రశ్నేలేదని, రాహుల్ గాంధీ ఎసీ గదుల్లో కూర్చుని గాలిబ్ గీతాలు చదువుకోవచ్చుని, దేశ భద్రత గురించి ఆయన అతిగాఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ విషయం మోదీ చూసుకుంటారని ఇండో - టిబెటన్ సరిహద్దుల వద్ద చైనా దళాల చొరబాటుపై సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతూనే సరిహద్దు వద్ద మన భద్రతా దళాలతో అడ్డగించామని, కోవిడ్ తో భారత ప్రభుత్వం చేసిన పోరాటాన్ని ప్రధాని వంటి నాయకత్వ పటిమను, ప్రపంచం సైతం ప్రశంసిస్తోందని రామ్ మాధవ్ గారు తెలిపారు.
దేశ ఆర్ధికవృద్ధి,దేశభద్రత , ఆత్మగౌరవం పెంచడం కార్యాలు మోదీ చేసిన ఆదర్శవంతమైన పాలనకు ఉదాహరణలని, మోదీ వ్యక్తిత్వం వినమ్రతకు మారుపేరు, మన్ కీ బాత్ లోనూ సామాన్యులు చేసిన సేవలనే ఆయన ప్రస్తావిస్తారని ప్రజలే దేవుళ్లుగా పాలించే అలాంటి నాయకత్వం లభించినందుకు మనం గర్వపడాలని రామ్ మాధవ్ గారు ప్రశంసల జల్లు కురిపించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రెండో విడత పాలన ఏడాదికాలం పూర్తిచేసుకున్న సందర్భంగా, సాధించిన విజయాలపై చేసే ప్రచారంలో భాగంగా కోవిడ్ సమస్య వల్ల ఈ వర్షువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతి రహితంగా పాలించి,తమను అభివృద్ధి చేస్తారని నమ్మిన ప్రజలు 2014 లో మోదీని గెలిపించారన్నారని, పేదరిక నిర్మూలన, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అవినీతి రహిత పాలన, జాతీయ భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారని, కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
అలాగే స్వచ్ఛభారత్, పెద్దనోట్ల మార్పిడి, జీఎస్టీ, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత, సర్జికల్ స్ట్రైక్స్, కిసాన్ సమ్మాన్ నిధి, పేదలకు ఇళ్ళు, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, జన్ ధన్, మేకిన్ ఇండియా ఇలా దేశాభివృద్ధికి పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారని, కన్నా లక్ష్మీనారాయణ గారు నరేంద్ర మోదీ గారి నిబద్ధత, పారదర్శకత, దార్శనికతను కొనియాడారు.
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు నిర్వహించిన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ వి. సతీష్ గారు, బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సహా ఇంఛార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ గారు, బిజెపి జాతీయ మహిళ ఇంఛార్జి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బిజెపి నేత రాజ్యసభ సభ్యులు శ్రీ సి.ఎమ్ రమేష్ గారు,
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ నెహ్రు యువ కేంద్ర సంఘతన్ ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బిజెపి ఆంధ్రప్రదేశ్ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు, వల్లూరి జయ ప్రకాష్ గారు, శ్రీ అడపా శివనాగేంద్రరావు, ఐ-హబ్ కన్వీనర్ శ్రీ కానూరి బాలకృష్ణ మోహన్ గారు మరియు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు,
విజయవాడలో నుండి ఆన్లైన్ ద్వారా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నాయకులు పాతూరి నాగభూషణం గారు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు, కుమారస్వామి గారు, దాసం ఉమామహేశ్వరరావు గారు మరియు రాష్ట్ర, స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Photo/ Video/ Text Credit : Andhra BJP Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,491; 104 తత్వాలు (Tatvaalu) and views 253,856 Dt : 12-Jun-2020, Upd Dt : 12-Jun-2020, Category : News
Views : 1376
( + More Social Media views ), Id : 15 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
narendra modi ,
govt 2.0 ,
virtual rallies ,
nationwide ,
1st year ,
andhra bjp ,
national secretary ,
ram madhav అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments