రాయలసీమ జన-సంవేద్ ర్యాలీ - కేంద్ర అభివృద్ధి సహయం, రాష్ట్ర అవినీతి పాలన గురించి కేంద్ర మంత్రి - Politics - News (వార్తల సమాచారం)
           
మిగతా News కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 35 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1985 General Articles and views 1,686,112; 102 తత్వాలు (Tatvaalu) and views 208,386.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
హైదరాబాద్ వేదికపై నుంచి ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ, మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, దేశం మోదీ - 2.0 ప్రభుత్వంలో అభివృద్ధి వైపు నడుస్తుంటే, రాష్ట్రంలో వ్యతిరేక పాలన నడుస్తోంది.

* ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కొనసాగుతూనే ఉంది.
* తెలుగుదేశం, చంద్రబాబు హయాంలో అవినీతి, అసత్యాల పాలన జరిగితే..
* వైకాపా పాలనలో ఇప్పుడు అవినీతి, అహంకారం, అబద్దాలు, పోలీసు రాజ్యంగా పాలన కొనసాగుతోంది.
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రాయలసీమ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గారు స్పష్టం చేశారు.

రాయలసీమ ప్రాంత సంపూర్ణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా మోదీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.

ఎన్డీయే - 2 పాలన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్, జన - సంవేద్ వర్చ్యువల్ ర్యాలీ, సోమవారం సాయంత్రం నిర్వహించారు.

ప్రధాన అంశాలు :

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధంగానే మద్యం, ఇసుక మాఫియాలు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ హయాంలో మరలా చెలరేగిపోతున్నాయి.

అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే తమను వేధిస్తున్నారని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటువంటి పద్దతి మంచి పద్దతి కాదు.

రాష్ట్ర అభివృద్ధికి భాజపా మనసా వాచా కట్టుబడి ఉంది : విద్యాసంస్థలు, మౌలికసదుపాయాలు, పోలవరం, విశాఖ రైల్వేజోన్, ఎస్.ఈ. జెడ్లు వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ గారి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తన ప్రేమను చాటుకుంది. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్రమే భరిస్తుంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేదు. రాజకీయ నాయకుల్లో నిజాయితీ నిబద్ధత లేకపోవడం వల్లే రాయలసీమ వెనుకబాటుకు గురైంది.

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతోంది. ఇదే విషయాన్ని చిలకం రామచంద్రారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరిగిన భాజపా పాదయాత్రలో స్పష్టం అయింది. నాటి పాదయాత్ర ప్రజలను చైతన్యవంతులను చేసింది.

రాయలసీమ ప్రాంతంలో సాగునీటి పథకాల అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి జరగాలని భాజపా కోరుతోంది.

ఎవరి పైనా వ్యతిరేకతతో రాష్ట్ర విభజననను భాజపా సమర్ధించలేదు . అధికార వికేంద్రీకరణ, ప్రాంతీయ అభివృద్ధి కోసం మాత్రమే సమర్ధించాం. కరోనా సంక్షోభం కారణంగా ఎపీకి పెద్దఎత్తున సహాయ సహకారాలు కేంద్రప్రభుత్వం అందిస్తోంది.

* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 47 లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.939 కోట్లు పంపిణి చేయడం జరిగింది.
* స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణ సహాయం.
* ప్రధాన మంత్రి జన్ - ధన్ యోజన ఖాతాలు కలిగిన 60,22,126 మంది లబ్ధిదారులకు రూ.1,500 చొప్పున పంపిణి చేయడం జరిగింది.
* 10 లక్షల మంది వితంతులువు, వృద్ధులు , దివ్యాంగులుకు జాతీయ సామాజిక సహాయ పథకం కింద నగదు పంపిణి చేయడం జరిగింది.
* 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సాయం
* స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రూ.559 కోట్లు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది.
* స్థానిక సంస్థలకు రూ.వెయ్యి కోట్లు, 15వ ఆర్ధిక సంఘం నిదులు రూ.7,834 కోట్లు,
* 2.60 కోట్ల మంది ప్రజలకు 15 కిలోల బియ్యం, 90 లక్షల టన్నుల పప్పుదినుసులు ఉచితంగా పంపిణీ
* 4,68 లక్షల N95 మాస్కులు, 2.79 లక్షల పిపిఈ కిట్లు, 22 లక్షల టాబ్లెట్లు పంపిణి చేశాం .
* 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశాం.

మార్చి 15 నాటికి ఒక్కటి కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి లేకున్నా మోదీ గారి ప్రోత్సాహం, చొరవతో ఔత్సాహికులు వీటి ఉత్పత్తిని భారీ చేపట్టారు. నేడు 500 కంపెనీలు రోజుకు 5 లక్షల N95 మాస్కులను తయారుచేస్తున్నాయి.

దేశంలో 4.25 లక్షల పాజిటివ్ కేసులు నమోదైతే 2.35 లక్షల మంది సురక్షితంగా బయటపడ్డారు. మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. కరోనా కోవిడ్ కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులు 982 ఉన్నాయి. 985 పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. 4.70 లక్షల బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందవద్దు. నిబంధనలు పాటించి అందరూ జాగ్రత్తగా ఉంటే కరోనాపై తప్పక విజయం సాధిస్తాం . ఈ విషయంలో అందరూ ఐక్యంగా పనిచేయాలి.

రాయలసీమ వాసుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు మోదీ ప్రభుత్వానికి ఉండాలి. అందరూ భాజపాను బలపరచండి. రాయలసీమతో పాటు రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది.

భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానిగా కాకుండా ఒక సేవకుడిగా తాను దేశాన్ని పాలిస్తానని పార్లమెంటులో ప్రమాణం చేశారు. అధికారం చేపట్టిన నరేంద్రమోదీ గారు తన మాటలు అక్షరసత్యంగా నిజం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు.

పేదరిక నిర్మూలన, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అవినీతి రహిత పాలన, జాతీయ భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అలాగే స్వచ్ఛభారత్, పెద్దనోట్ల మార్పిడి, జీఎస్టీ, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ కమిషన్ కు చట్టబద్దత, సర్జికల్ ( స్పైక్స్, కిసాన్ సమ్మాన్ నిధి, పేదలకు ఇళ్లు, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, జన్ ధన్, మేకిన్ ఇండియా ఇలా దేశాభివృద్ధి కోసం పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని రీతిలో ఎపికి 12 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు.

11 విద్యాసంస్థలు ఏర్పాటుచేయాల్సి ఉండగా 39 ఇచ్చారని, రెవిన్యూ లోటు, అన్ని రంగాలకు నిధులు, ప్రాజెక్టుల రూపేణా రూ.10 లక్షల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి మంజూరు చేశారన్నారు. కాని చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు, నిదులు తీసుకుని ఏం చేయలేదని ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేసి భాజపా ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. వాస్తవాలు తెలిసిన ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారని చెప్పారు. ప్రధాని మోదీ రెండో విడత పాలన ఏడాదికాలం పూర్తిచేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై చేసే ప్రచారంలో భాగంగా కోవిడ్ సమస్య వల్ల ఈ వర్టువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.

జైపూర్ నుంచి భాజపా జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి సతీష్ జీ, ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు గారు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, జాతీయ కార్యదర్శి సునిల్ డియోధర్ గారు, హైదరాబాదు వేదిక నుంచి మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి గారు, ఆదినారాయణరెడ్డి గారు, విష్ణువర్ధనరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ లో వేదికపై సంధానకర్తగా మాజీ మంత్రి చింతల పార్ధసారది గారు వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ గారు, పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జి, రాష్ట్ర కార్యదర్శి అడపా శివనాగేంద్రరావు గారు నాయకులు పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.
 

Photo/ Video/ Text Credit : Andhra BJP
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1985 General Articles and views 1,686,112; 102 తత్వాలు (Tatvaalu) and views 208,386
Dt : 22-Jun-2020, Upd Dt : 22-Jun-2020, Category : Politics
Views : 1194 ( + More Social Media views ), Id : 19 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Rayalaseema Zone , Jan Samvad Virtual Rally , G Kishan Reddy , central Minister , Home Affairs , andhra bjp

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content