అమెరికాకు వందనం - దేశ చరిత్రలో నే గొప్పవైన జూలై 4 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,961; 104 తత్వాలు (Tatvaalu) and views 224,522.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ రోజు, అమెరికన్లు తమ దేశం 243 వ పుట్టినరోజున, స్వాతంత్ర దినోత్సవ వేడుకల ను, దేశమంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఊరిలో కూడా, జాతీయ జెండాలు ఎగుర వేసి, ప్రదర్శనలు మరియు ఊరేగిపులు(పరేడ్) చేస్తారు. ముఖ్యముగా రాజధాని వాషింగ్టన్ డి.సి. లో, పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతారు.

సంవత్సరాలు గడిచేకొద్ది, జూలై నాలుగవ తేదీ దేశభక్తితో పాటు, ఈ దేశం మనకు ఆశీర్వదించిన స్వేచ్ఛలు మరియు అవకాశాలను గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం, అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్, నేషనల్ మాల్‌లో, మొదటి సారి జరిగే కొత్త రకం వేడుక కార్యక్రమం కు, తనతో పాటు పాలు పంచుకోవాలని, అమెరికన్లను ఆహ్వానించారు.

ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు(ఈస్టరన్ కాలమానం), లింకన్ మెమోరియల్ వద్ద, అధ్యక్షుడు ట్రంప్, అమెరికాకు వందనం(ప్రణామము) అన్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాని తరువాత అమెరికా యొక్క ఐదు సైనిక శాఖల యొక్క సంగీతం, సైనిక ప్రదర్శనలు మరియు బహుళ ఫ్లైఓవర్‌లతో(విమానాలు ఎగురుతూ), వేడుక లు కొనసాగుతాయి.

ఇది నేషనల్ మాల్ అంతటా, అందరికి అందుబాటులో ఉండే, జూలై నాలుగున జరిగే గొప్ప కార్యక్రమం అవుతుంది మరియు అలాగే మన కమాండర్-ఇన్-చీఫ్ ప్రసంగం కూడా - అని ఇంటీరియర్ సెక్రటరీ డేవిడ్ బెర్న్‌హార్ట్ చెప్పారు. అసాధారణమైన బాణసంచా ప్రదర్శన కోసం మేము అసాధారణమైన విరాళం అందుకున్నాము, మరియు రక్షణ శాఖ నుండి మా సహచరులు, బ్లూ ఏంజిల్స్ నుండి విమాన ప్రదర్శనతో సహా, ఒక రకమైన సంగీతం మరియు వాయు శక్తి అనుభవాన్ని అందిస్తారు - అని అన్నారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరాలను ఆస్వాదించడంలో, అద్భుతమైన బాణసంచా ప్రదర్శన కూడా మంచి మార్గం. ఈ రోజు రాత్రి, నేషనల్ పార్క్ సర్వీస్ మరియు దాని భాగస్వాములు, అలాంటి ఒక ప్రదర్శన నిర్వహిస్తారు ఎల్లకాలం గుర్తు ఉండేటట్లు గా. D.C. యొక్క ఐకానిక్ స్మారక చిహ్నాలు మరియు స్మారక చిహ్నాలు నేపథ్యంగా, వాషింగ్టన్ రాజధాని ప్రాంతంలో, ఈ 35 నిమిషాల ప్రదర్శన, ఇప్పటివరకు జరగని అతిపెద్ద బాణసంచా ప్రదర్శన అవుతుంది.

లింకన్ మెమోరియల్ వద్ద, మన జూలై 4 న, అమెరికాకు వందనం కార్యక్రమం, నిజంగా పెద్దదిగా ఉంటుంది - అని అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో రాశారు. ఇది జీవితకాలం లోనే, గొప్ప ప్రదర్శన అవుతుంది అని అన్నారు.

Today, Americans will gather in Washington, D.C., for a celebration of Nation’s independence on its 243rd birthday. This year, President Donald J. Trump is inviting Americans to join him for a first-of-its-kind ceremony on the National Mall.

The -Salute to America- will be kicked off by President Trump at the Lincoln Memorial today at 6:30 p.m. ET, followed by a celebration that will honor each of Americas five military branches with music, military demonstrations, and multiple flyovers.

అంతేగాకుండా, ఈ రోజు ఉదయం 11.45 కు పరేడ్ కూడా జరుగుతుంది. చారిత్రకమైన కాన్స్టిట్యూషన్ అవెన్యూ మరియు వాషింగ్టన్, డి.సి.లోని స్మారక చిహ్నాలు, అమెరికా యొక్క అతిపెద్ద మరియు ఉత్తమ స్వాతంత్ర దినోత్సవ పరేడ్‌కు, అనుకూలమైన పరిస్తితులు కల్పించాడానికి, కారణమయ్యాయి. అమెరికా పుట్టినరోజున, దేశ రాజధాని లో జరిగే సంబరాల కంటే, గొప్ప ఉత్సాహం ఎక్కడా లేదు!

Historic Constitution Avenue and the Monuments in Washington, D.C. form the setting for Americas biggest and best Independence Day Parade at 11.45 AM.

బ్రిటన్ నుండి స్వాతంత్రం ను ప్రకటించిన రోజు - జూలై 4, 1776. దానికి గుర్తు గా సమాఖ్య(ఫెడరల్) సెలవుదినం.  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,961; 104 తత్వాలు (Tatvaalu) and views 224,522
Dt : 04-Jul-2019, Upd Dt : 04-Jul-2019, Category : America
Views : 1559 ( + More Social Media views ), Id : 130 , Country : USA
Tags : Salute to America , Fourth of July , july 4th , Washington DC , National Mall , Donald J. Trump

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content