సప్తపది - అఖిలాండేశ్వరి చాముండేశ్వరి, వ్రేపల్లియ ఎద ఝల్లున, మరుగేలరా ఓ రాఘవా - భక్తి రసం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,573; 104 తత్వాలు (Tatvaalu) and views 225,080.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సాత్విక మనసున్న దర్శకేంద్రుడు కె విశ్వనాధ్ గారి అద్భుత స్రుష్టి ఈ చిత్రం అని ముందు కధనం లో చూసాం, అక్కడ 2 పాటలతో మనుషులు కు కుల రంగు తేడాలు ఉండవని తెలుసుకున్నాము, క్రిష్ణయ్య గోధూళి గోవు ఆకాశం భూమి పోలికలతో.

ఇప్పుడు దుర్గమ్మ, క్రిష్ణయ్య మరియు తారక రాముని భక్తి గీతాలు మనసారా పులకిస్తూ పాడుకుందాము. మనము మరియు పిల్లలూ అందరూ పాడుకో తగ్గ, భక్తి గీతాలు. మనము గాయకులము కాదు, కేవలం సాధకులము, గాత్రం మాధుర్యం ముఖ్యం కాదు, ప్రయత్నం మాత్రమే ముఖ్యం సుమీ.

అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, పాలయమాం గౌరీ పాటలో, దాదాపుగా అమ్మవారి అష్టోత్తరము సహస్రనామము లో ఉన్న పదాలే ఉన్నాయి.

అంటే శుక్రవారం పూట ఆ ఆదిశక్తి ని మనసారా తలచుకుందాము. లక్ష్మి గౌరి సరస్వతి లాంటి అందరూ దేవతల పేర్లూ ఈ మధుర గీతములో పలకరించబడ్డాయి. అదే మన మంచి సాత్విక భక్తి పాటల శక్తి, తెలీకుండానే, మంత్రాలను చదివేయగలము. తప్పక ప్రయత్నం చేస్తారు కదూ?

ఆ క్రిష్ణుని లీలలు కూడా తలచుకుందాము. కాళింది మడుగున, కాళీయుని పడగల, నాట్యం చేసిన ఆబాలగోపాలుడు, మన బాలగోపాలుని లీలలు కూడా పాడుకుని, మనశ్శాంతిని పొందుదాము.

త్యాగరాజయ్య రచించిన క్రుతుల నుంచి, సుతి మెత్త గా, ఆ రామయ్య ను మనసులో ఇలా తలచుకుని, వేడెదము, మరుగేలరా ఓ రాఘవా అంటూ.

1) ఓంకార పంజర శుకీం, ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్
ఆ.గమ విపిన మయూ.రీం., ఆర్యాం, అంతర్విభావయే ద్గౌరీమ్.

అఖిలాం.డేశ్వరి, చాముండే.శ్వరి, పాలయమాం. గౌరీ.., పరిపాలయమాం. గౌరీ.. 2

శుభగాత్రి గిరిరాజపుత్రీ.., అభినేత్రి శర్వార్థ గా.త్రీ.. 2 ఆ ఆ
సర్వార్థ సంధాత్రి, జగదే.కజనయిత్రి, చంద్రప్రభా. ధవళకీర్తి.. 2
చతుర్బాహు సంరక్షిత శిక్షిత, చతుర్ద శాంతర భువనపాలిని
కుంకుమ రాగ శోభిని., కుసుమబాణ సంశోభిని.
మౌన సుహాసిని, గాన వినోదిని, భగవతీ పార్వతీ దేవీ ||అఖిలాండేశ్వరి ||

శ్రీహరి ప్రణయాంబు రా.సి.., శ్రీపాద విచలిత క్షీరాంబురా.సి.. 2
శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని 2
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి దేవీ ||అఖిలాండేశ్వరి ||

ఇందువదనే. కుందరదనే.,వీ.ణా పుస్తక ధారిణే.. 2
శుక శౌనకా.ది వ్యాస వా.ల్మీకి, మునిజన పూ.జిత శుభచరణే 2
సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే 2
వరదే అక్షరరూపిణే, శారదే, దేవీ.. ||అఖిలాండేశ్వరి ||

వింధ్యాతటీ వాసినే, యోగ సంధ్యా సముద్భాసినే
సింహా సన స్థాయినే, దుష్ట హర రంహ క్రియాశాలినే
విష్ణుప్రియే సర్వ లోకప్రియే, శర్వ నామప్రియే ధర్మ సమరప్రియే
హే బ్రహ్మచారిణే, దుష్కర్మ వారిణే, హే విలంబిత కేశ పాశినే
మహిష మర్ధనశీల మహిత గర్జనలోల భయజ నర్తన కేళికే
కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి..

Akhilandeswari, Lyricist: Veturi, Singers: S.P.Balu, Suseela

2) వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి - మొత్తం 2 సార్లు

కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని 2
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ 2
తాండవమాడిన సరళి గుండెల మోగిన మురళి ఇదేనా ||ఇదేనా ఆ మురళి||

అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై
మరలా వినిపించి మరులే కొలిపించి - మొత్తం 2 సార్లు
జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన రవళి నటనలసరళి
ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి

మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి 2
సంగీత నాట్యాల, సంగమ సుఖవేణువై 2
రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి

Repalliya Yeda, Lyricist: Veturi, Singers: Suseela, S.P.Balu

3) మరుగేలరా ఓ రాఘవా.., మరుగేలరా ఓ రాఘవా.. 2
మరుగే.ల చరా.చర రూ.ప పరా.త్పర సూ.ర్య సుధా.కర లో.చనా 2
మరుగేలరా ఓ రాఘవా . . .

అన్ని, నీవనుచు, అంతరంగమునా ...,
అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెద,కి తెలిసికొంటినయ్యా
అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా

నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా....
నిన్నెగాని మదీ నెన్నజాలనురుల, నన్ను బ్రోవవయ్యా,
త్యాగ రాజనుతా
మరుగేలరా, ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా

Marugelara, Lyricist: Thyagaraja, Singer: S.Janaki

Saptapadi, Music: K.V.Mahadevan
Saptapadi akhilandesvari chamundesvari vrepalliya ed jalluna marugelara o raghava  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,573; 104 తత్వాలు (Tatvaalu) and views 225,080
Dt : 16-Jun-2022, Upd Dt : 16-Jun-2022, Category : Songs
Views : 676 ( + More Social Media views ), Id : 1431 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : saptapadi , viswanath , somayajulu , akhilandeshwari , chamundeshwari , vrepalliya , jalluna , marugelara , raghava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content