Sri Krishna Damodarastakam – శ్రీ కృష్ణ దామోదరాష్టకం श्री कृष्णा दामोदराष्टकम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,061,707; 104 తత్వాలు (Tatvaalu) and views 236,208.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Damodarastakam or Damodar Ashtakam is an 8 verse stotra in praise of Lord Sri Krishna. Damodara literally means Rope tied around the belly in Sanskrit, where Dam means a rope or cord, and udara means Stomach. Chant it with devotion for the grace of Lord Sri Krishna.

దీపావళికి, లక్ష్మి అమ్మవారిని, అలాగే శ్రీక్రిష్ణుని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. వారికి సంభందించిన శ్లోకము/ మంత్రములు ఎన్నో పంపాము. మనమూ నేర్చుకుని, పిల్లల చేత కూడా పలికిస్తాము కదూ. నాభి నుంచి బలముగా, మాట/ మంత్రం రావాలి ఇది మరువద్దు, అదే ఆరోగ్యం మనశ్శాంతి.

మన మరియు మన వాళ్ళ గొంతు పాటలు/ మంత్రాలు, దీపావళి వేడుకల దీపాల వెలుగుల ఆనందాల ఫోటోలు వీడియోలు, మన మిత్రులకు బంధువులకు పంపినందుకు ధన్యవాదములు. మనకు ప్రతినమస్కార సంస్కారం ఉందని, స్తితప్రజ్ఞత సమానత్వం ఉందని, పిల్లలకు ఆదర్శముగా అది నేర్పుతామని, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం లో లేమని చెప్పడానికి అదోక ఉదాహరణ.

మన పెద్దలను ప్రేమగా దగ్గర ఉంచి చూసే వారే, అందరినీ సమానముగా చూస్తారు, అవసర అవకాశవాదులుగా ఉండకుండా. మన పిల్లలు, మనల్ని ముదుసలి తనములో, దగ్గర ఉంచి చూడగలరు అని అనుకోవడానికి, ఇదొక కారణం సాక్ష్యం గా కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే, ప్రాపంచిక మాయలో ఉన్నవారు, ఇవన్నీ చూసి నవ్వుతారు, నోటితో పలకలేరు, నిజం ఒప్పుకోరు, ఉచితముగా చెప్పే శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చెప్పలేరు, మోహములో పతనములో ఉండి. వారిని దేవుడే కాపాడతారు సుమీ, ఇంట్లోవారే బుద్ది చెప్పి మోహము నుంచి బయటకు లాగుతారు.

పరమాత్మ ఒక్కడే, అయినా ఆ దేవ దేవుడిని, ఎన్ని విధాలుగా తలచుకున్నా, తనివి తీరదు. బియ్యం ఒక్కటే, కానీ అన్నము, పొంగలి, పులిహోర, దద్దోజనము అని ఎన్ని రకాలుగా ఆస్వాదిస్తున్నాము. ఏ విధముగా రుచికరముగా తిన్నా, అన్నిటిలో ఉన్నది ఆ అన్నమే అన్న జ్ఞానము మనకు ఉండాలి, ఉంది.

చిన్ని క్రిష్ణుని అల్లరికి, ఇరుగు పొరుగు చెప్పే చాడీలకు, ఏమి చేయాలో తెలీక, అనంత విశ్వాన్ని తన కడుపులో ఉంచుకున్నా, ఆ పరమేశ్వరుడినే, ఓ చిన్న తాడు ముక్కతో, రోకలికి కట్టేస్తే, చిద్విలాసముగా నవ్వుకుంటూ, ఆ తల్లి ప్రేమకు కట్టుబడిపోయాడు.

మరి, ఆ కపట నాటక సూత్రధారికి తెలుసు, ఆ తలంపు తల్లికి రావాలి, తనని కట్టాలి, ఇంకొకరుకు మోక్షం ఇవ్వాలని. వెంటనే, అలా రోలు ను ఈడ్చుకుంటూ పెరటిలోకి వెళ్ళి జంట వ్రుక్షాల మధ్యలో నుంచి, బలముగా లాగారు. అంతే, ఆ చెట్లు కూలి, దివ్య పురుషులు శాపవిమోచనం అయ్యి, తలవంచి నమస్కరించి, తమ లోకాలకు వెళ్ళిపోయారు.

దామోదరాష్టకం లేదా దామోదర అష్టకం అనేది, శ్రీ కృష్ణ భగవానుని స్తుతిస్తూ 8 శ్లోకాల స్తోత్రం. దామోదర అంటే సంస్కృతంలో, బొడ్డు చుట్టూ కట్టబడిన తాడు. ఇక్కడ దామం అంటే త్రాడు మరియు ఉదర అంటే కడుపు అని అర్థం. శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం భక్తితో జపించండి.

నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలాద్ధావమానం
పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 1 ||

namamisvaram saccidananda rupam
lasat-kuṇḍalam gokule bhrājamanam
yaśodā-bhiyolūkhalād dhāvamānam
parāmṛṣṭam atyantato drutya gopyā || 1 ||

नमामीश्वरं सच्चिदानन्दरूपं
लसत्कुण्डलं गोकुले भ्राजमानम् ।
यशोदाभियोलूखलाद्धावमानं
परामृष्टमत्यन्ततो द्रुत्य गोप्या ॥ 1 ॥

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ-
స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ || 2 ||

ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |
తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే || 3 ||

వరం దేవ మోక్షం న మోక్షావధిం వా
న చాన్యం వృణేఽహం వరేషాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 4 ||

ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్-
వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్తధరం మే
మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 5 ||

నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను
గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః || 6 ||

కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ |
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 7 ||

నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం || 8 ||

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సంపూర్ణం ||

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Sri Krishna Damodarastakam namamisvaram saccidananda rupam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,061,707; 104 తత్వాలు (Tatvaalu) and views 236,208
Dt : 24-Oct-2022, Upd Dt : 24-Oct-2022, Category : Songs
Views : 869 ( + More Social Media views ), Id : 1594 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , damodarastakam , namamisvaram , sachchidananda , rupam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content