అమ్మ - సహాయం చేయకపోయినా పర్లేదు, మన వలన ఇబ్బంది కూడదు, మంచి కి అడ్డు పడకూడదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,373,394; 104 తత్వాలు (Tatvaalu) and views 256,980.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాము సోము ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటున్నారు, అమ్మ బాధ్యత గురించి.

కన్నతల్లి కి ఓ కొడుకు, ప్రపంచ అత్యుత్తమ వైద్యం, నెలకి 2 లక్షల తో ఇప్పిస్తుంటే, అంటే సంవత్సరం కి 24 లక్షలు, అంటే 6 ఏళ్ల కు కోటి ఇరవై లక్షలు పైన.

ఇంత ఖర్చు, మోహం లో రాక్షసులు గా తల్లి దండ్రులు నే దూరముగా వదిలేసే గేళిచేసే, ఎదిగే పిల్లలు పెట్టుబడి కోసం కాదు, తరిగే వదిలి వెళ్లి పోయే ముదుసలి కన్నతల్లి కోసం. మిగతా కడుపు న పుట్టిన ఒకరూ ఒక పైసా లేదు. బయట వారు అందరూ, తిన్నవారే.

శభాష్ అంటానికి నోరు ఎటూ రాదు, సహాయం చేయడానికి చేతులు రావు, ఎందుకంటే ఆ సంస్కారం మనకు మన పిల్లలు కు లేదు.

అలాంటి తల్లి మరియు కొడుకు ధనం దోచుకోవడానికి, ఇంకా వారికి ఎక్కువ కష్టాలు పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్న వారి, చివరి రోజుల యాతన ఎంత నరకం గా ఉంటుందో?

ఇలాంటి మనస్తత్వం గల వారి పిల్లలు స్తోమత ఉండి, మద్రాస్ మరియు అమెరికా తీసుకుని వెళ్లి, దగ్గర ఉండి, కోటి ఖర్చు పెడతారా? ఒకవేళ డబ్బు ఖర్చు పెట్ఞగలిగినా, దగ్గర ఉండి ప్రేమతో సంవత్సరాలు చూస్తారా, సపరిచర్యలు చేస్తారా? అసలు అమ్మ అంటే, లాలన పాలనా వారికి తెలుసా?

మీ అందరి ఎదురు గతంలో చెప్పా , ఇప్పుడూ చెపుతున్నా. వారు గనుక ఇప్పుడు అయినా నోటితో - మీ కడుపు లు కొట్టి, మా బిడ్డలు కడుపు నింపుతున్నాము నింపాలి, మేము ఇవ్వలేము అంటే, ఒక్క రూపాయ అడగము, మా కుటుంబ కష్టాలు మేమే పడతాము. దాని పాపం, వారే పడతారు.

మరి ఎందుకు ఈ తాపత్రయం? నాయనమ్మ ల మంచి పెద్ద కొడుకు గా, జన శాపాల వలన, వారి వంశానికి జరగబోయే, దైవ విపత్తు ను ఆపే, చిన్ని ప్రయత్నం మాత్రమే. అది అర్థం చేసుకుంటే, వారు పారిపోరు.

అమ్మ కు ఖర్చు పెట్టిన దాంట్లో, వారు ఇవ్వాల్సింది ఎక్కువ శాతం కూడా లేదు.

అమ్మ కోసం అంత ఖర్చు పెడుతుంది, అదీ ఆదాయం లేకుండా కూడా అంటే, అంటే నష్టపోతూ కూడా అధిక ఖర్చు, మధ్య తరగతి కి ఎంత కష్టం.

కానీ మనం పూరింట్లో ఉన్నా, పచ్చడి వేసుకున్నా పర్లేదు. మనం వస్తా తెచ్చింది లేదు, అన్ని ఆయనే సమకూర్చారు, చివరి క్షణంలో అయినా. కాబట్టి ప్రపంచ ఆస్తులు సుఖాల పై మోహం మక్కువ, పోతాయని తరుగుతాయని భయం మనకెందుకు, పైవాడు ఉండగా.

మనకు అన్ని తెలుసు, అహంకారం తో మన ఉన్నత స్ధితికి మనమే కారణం అంటే, ఆయన వదిలేస్తాడు, నీ దోవలో నువ్వు వెళ్ళు అని, కష్టనష్టాలు ఒంటరిగా ఎదుర్కోవాలి.

మనకేమీ తెలీదు, నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తాను నీతిలో ధర్మం లో అంటే - ఇప్పుడు బాధ్యత ఆయనది, గౌరవం ఆయనది, అవమానం ఆయనది. అదే భగవంతుని భగవద్ గీత. పాల ముంచినా నీట ముంచినా, మన ప్రయత్నం, చివర వరకు చేద్దాం.

చాలామంది చెప్పారు, ఆశ్రమంలో లేదా ఊళ్ళో వదిలేయి. ఆ కోటి ధనం తో స్ధలం కొను, ఇల్లు కొను, వ్యాపారం చేయి, వడ్డీ కి ఇవ్వు అని, జీవితం సాఫీగా ఉంటుంది అని. అందరూ ఇదే పని చేస్తున్నారు అని. మూర్ఖంగా, జీవితం పాడు చేసుకోవద్దని.

అమ్మ కు మొత్తం నేను అయినప్పుడు, నా కూతురు ఆమె. నా కూతురు భూమి పై ఉన్నన్ని రోజులు, త్రికరణ శుద్ది గా కనీసం సొంత ఇంట్లో అయినా, ఓ పచ్చడి ముద్ద పెట్టి, ఆమె ను నవ్వుతూ సంతోషం గా దిగులు లేకుండా పంపాలి, ధనం లేక పరాయి చోట ఎక్కువ కాలం ఉండలేకపోయినా.

పూర్వ కాలంలో పుణ్యాత్ములు ఉంటారు కాబట్టి, మేము చేయలేని మంచి పని నువ్వు చేస్తున్నావు, ఆదాయ మార్గాలు మేము చూపెడతాము దాని గురించి మరచిపో, నీ పని లో నువ్వు ముందుకు పో, మాకూ ఆ పుణ్యం లో భాగం వస్తుంది అనేవారు, అండగా ఉండే వారు.

ఇప్పుడు, ఇంకెన్ని విధాలుగా ఇబ్బంది పెడదామా, అని పాపం మూటగట్టుకొంటున్నారు. ఎందుకంటే, వారి చివరి మరియు వారసుల రాతను, వారే భయంకరంగా రాసుకుంటూ ఉన్నారు. అందుకే సహాయం చేయకపోయినా పర్లేదు, నష్టం లేదు. మంచి కి అడ్డు పడకూడదు, మన వలన ఇబ్బంది కలగనీయకూడదు.

మనం ఇలాగే నీతి తప్పకుండా నష్టపోతూ అయినా, పదిమంది కి మంచి పంచుతూ, అధికారులు నాయకులు కు ఆలోచన తలనొప్పి కలిగిస్తూ, ముందుకు పోదాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,394; 104 తత్వాలు (Tatvaalu) and views 256,980
Dt : 31-Dec-2020, Upd Dt : 31-Dec-2020, Category : General
Views : 1044 ( + More Social Media views ), Id : 902 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amma , mom , help , do not , trouble , good
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content