పాటతో పరమార్ధం- పుట్టింటోళ్ళు తరిమేసారు, పుట్టినోళ్ళు వదిలేసారు(పేరడీ)- వేటగాడు- ఎన్టీఆర్, శ్రీదేవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,707; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Puttintollu Tharimesaaru, Puttinollu vadilesaru (Parody) - Vetagadu - NTR, Sridevi - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఇది మన ఇళ్ళ అందరి పాట, నిన్న నేడు రేపు మిత్రమా. ఏళ్ళుగా మనము అందిరినీ వేడుకుంటున్నాము, ఇది మాయల ప్రపంచం, నేడు మనవి అనుకున్నవి ఏదీ, మనవి కాదు. మన బలగం, మన ఆస్తి, మన సొంత మనుషులు, ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి రజో తమో గుణాలు విడిచిపెట్టి, కఠిన సాధనతో, సాత్విక గుణం వైపు రావాలి.

లేదంటే, నేడో రేపో మన వారు అందరూ మనల్ని వదిలేస్తారు, ఆదాయం ఆరోగ్యం అధికారం ఆయువు, పోగాల్నే. ఎందుకంటే, మనము అదే నేర్పాము, భాగస్వామి కి పిల్లలకి బంధువులకి స్నేహితులకు, మాకు గుణం కన్నా ఆస్తి, వీసా, అందం, అధికారం ముఖ్యం అని.

అప్పుడు మనము ఒంటరిగా ఏడుస్తూ, ఇలాగే పాడుకోవాలి. మన చెడ్డ గుణానికి అహంకారానికి బద్దకం నిర్లక్ష్యమునకు, మన పుట్టింటోళ్ళు తరిమేసారు, అలాగే కుసంస్కారం తో పెంచిన, కడుపున పుట్టినోళ్ళు వదిలేసారు, మా బతుకంతా పాపాలేనులే, ఓ సామి, పుణ్యముంటే మూడే సాధనలూ అయినా చిత్తశుద్దితో చేసి ఉండేవారిమి అని.

ఒక్క సారి ఒంటరి ముదుసలి వారిని, రోడ్ మీద, ఆశ్రమాలలో, ఇళ్ళలో ఒంటరిగా ఉన్న వారిని చూడండి. మంచి గుణం తమకు లేక, తమ పిల్లలకు నేర్పలేక, చివరకు ఎలా బావురు మంటున్నారో. తమ పిల్లలు, తమకు సమాన వైద్య సౌకర్యాలు, గౌరవ ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు, దగ్గర పెట్టుకుని, పంచడం లేదని, మింగలేక కక్కలేక జీవచ్చవాలుగా బతుకుతున్నారు, తమ ఇన్నాళ్ళ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ పెంపకమును తలచుకుని.

మనకు బుద్ది రావాలని, మన పెద్దలు ఎప్పుడో నిరూపించి, మనకు సజీవ సాక్ష్యం ఇచ్చారు. మంచి గుణం తప్ప, ఏదీ మనల్ని కాపాడదు అని. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

కర్మ కాలాక, మనము మాత్రం ఏమి చేస్తాము? ఇది ఆడ/ మగ ఇద్దరికి వర్తిస్తుంది సుమి. అయ్యోపాపం ప్రాపంచిక పాపాలమ్మ(య్య), ఇన్నాళ్ళు టింగురంగా అంటూ తైతక్కలాడిన మోహాలమ్మ(య్య), మన గతం చూస్తే నిర్లక్ష్య కపట నటన 2 నాల్కల జీవ హింస గడ్డిమేటలే, ఓ జీవా, ఇప్పుడైనా బుద్ది తెచ్చుకుని, కట్టు కధలతో బతకమాకులే అని మంచి చెప్పడం తప్ప.

నీతి నియమాలు దాటిన/ వదిలిన నాడె, వ్యామోహ మత్తున చేరాము, తలకు పోసిన్నాడే మానసిక భారం కాస్త తీసాము/ తగ్గించాము. మానసిక బలహీనతతో మోహాల పరుగులన్ని కలిపి, మదిలో మసాలా వేసి వంట చేసి, జీవితములో మంట చేసేసాము. ఎక్కడ ఏ ఊర్లో ఎవరితో ఉన్నా, ఓ సామి, మంట చేసేస్తాము, అన్ని చోట్ల అగ్గి రాజేసాము అని అందరికీ చెప్పి వాపోవాలి, పాపము తగ్గడానికి, మనల్ని మనము తెలుసుకోవడానికి.

అలా ఎలా చేసారండి, నీతి నియమాలు వదిలేసి, రేపు మనకు అవే తిరిగి వస్తాయి అని తెలుసు కదా? అంత మానసిక బలహీనత అయితే ఎలా?చూడండి, అమ్మతోడు శనివారం నాడు, అన్నమైనా అంటుకోము మేము. మన అమ్మమ్మ తోడు అర్ధరాతిరి, అనవసర విషయాలకోసం నిద్దరైనా మానుకోము, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నీతినైనా వీడబోము. ఇతరులకు ఉన్నట్లు ఆస్తులు ఇళ్ళు ధనము మనకు లేకపోవచ్చు, కానీ వారికి లేనిది దొరకనిది, మనశ్శాంతి మనకు ఉంది, 78+ ఏళ్ళ అమ్మ సజీవ గురువు సేవ లో.

చేతిలో డబ్బులున్నన్నాళ్ళు అహంకారముతో ఘల్లుమంటుంటాము ఎవరినీ లెక్క చేయక. ఒంట్లో వయసు ఉండి, మా తప్పులు జరిగిన్నన్నాళ్ళు, మొహానికి మేకప్ లాగా, కపట నటన 2 నాల్కల, రంగేసుంకుంటాము. ప్రాపంచిక మోహం దొరికిన్నాళ్ళు, ఆ బ్రమలును చుట్టుకుంటాము, వాటి చుట్టూ తిరుగుతాము. కానీ బాధ కలిగినప్పుడు, పంచభూతాల శిక్షణ మొదలు అయినప్పుడు, మా మీద ఒట్టు, మీరే గురువనుకుంటాము, అని అంటారు, మానసిక వత్తిడి తట్టుకోలేక.

కానీ సాధన లేని మాటలను నమ్మకూడదు, అవి బాధలో ఆవేశములో, నాలిక పై నుంచి వస్తాయి.

మనము వారికి నచ్చ చెప్పాలి. మన్నించాలి, దేవదేవ ఇప్పుడు ఆషాఢమాసం, అందులోను ముందుంది మూఢం, కాబట్టి మంచి రోజులు లేవు ఇప్పుడు, శుభ కార్యక్రమానికి. అమ్మ బాబోయ్ కాలేము మీ సాధనకు తోడు నీడ గా, దయచేసి మమ్మిడిచిపెట్టరా, మీరు మంచోరమ్మ(య్య). ముందు సాధన చెయ్యండి, మీకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని, కనీసం 1 ఏడాది సజీవ గురువు సేవ అనుభవం ఉంది అని చూపాలి, లేదంటే, మాతో నడవలేరు సాధనలో అని చెప్పాలి మిత్రమా. మాయతో జాగ్రత్త. తడి గుడ్డతో గొంతు కోస్తుంది.

Parody

పుట్టింటోళ్ళు తరిమేసారు, పుట్టినో.ళ్ళు వదిలేసారు 2
బతుకంతా పాపాలేనులే., ఓ సా.మి, పుణ్యముంటే మూడే సాధనలూ 2

అయ్యోపాపం పాపాలమ్మ, టింగురంగా మొహాలమ్మ 2
గతం చూస్తే గడ్డిమేటలే.., ఓ జీవ, కట్టు కధలతో బతకమాకులే.. 2

పుట్టింటోళ్ళు తరిమేసారు, అయ్యోపాపం పాపాలమ్మ
పుట్టినో.ళ్ళు వదిలేసారు, టింగురంగా మొహాలమ్మ..

నీతిదాటిననాడె మత్తున చేరాము., తలకుపోసిన్నాడే భారం తీసాము.
పరుగులన్ని కలిపి మంట చేసేసాము
ఎక్కడ ఉన్నా సామి మంటచేసేసాము, అగ్గిరాజేసాము

అమ్మతోడు శనివారం నా.డు, అన్నమైనా అంటుకోము మే.ము., 2 ఓయబ్బో
అమ్మమ్మతోడు అర్ధరాతిరి, నిద్దరైనా మానుకోము 2, నీతినైనా వీడబోము

పుట్టింటోళ్ళు తరిమేసారు, అయ్యోపాపం పాపాలమ్మ
పుట్టినో.ళ్ళు వదిలేసారు, టింగురంగా మొహాలమ్మ..


డబ్బులున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాము, జరిగిన్నన్నాళ్ళు రంగేసుంకుంటాము
మోహం దొరికిన్నాళ్ళు బ్రమలు చుట్టుకుంటాము
మా మీద ఒట్టు మీరే, మీరే గురువనుకుంటాము, మీరే గురువనుకుంటాము

దేవదేవ ఆషాఢమాసం, అందులోను ముందుంది మూఢం 2
అమ్మబాబోయ్ కాలేము మీతోడు, మమ్మిడిచిపెట్టర మంచోరమ్మ 2
మమ్మిడిచిపెట్టర మంచోరమ్మ

పుట్టింటోళ్ళు తరిమేసారు, పుట్టినో.ళ్ళు వదిలేసారు
అయ్యోపాపం పాపాలమ్మ, టింగురంగా మొహాలమ్మ

Original

పుట్టింటోళ్ళు తరిమేసారు, కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు, కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా, నా సామి, కట్టుకుంటే మూడే ముళ్ళురా 2

అయ్యోపాపం పాపయమ్మ, టింగురంగా బంగారమ్మ 2
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి
కట్టు కధలు చెప్పమాకులే

పుట్టింటోళ్ళు తరిమేసారు, అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు, టింగురంగా బంగారమ్మ

హా, గడపదాటిననాడె కడప చేరాను, తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను, వడ్డించుకుంటాను

అమ్మతోడు ఆదివారం నాడు, అన్నమైనా అంటుకోను నేను, 2 ఓయబ్బో
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను 2, ముద్దుకైనా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేసారు, అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు, టింగురంగా బంగారమ్మ

గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను, రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే, నువ్వే మొగుడనుకుంటాను, నువ్వే మొగుడనుకుంటాను

అమ్మతల్లి ఆషాఢమాసం, అందులోను ముందుంది మూఢం 2
అమ్మబాబోయ్ కాలేను నీతోడు, నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ 2
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

పుట్టింటోళ్ళు తరిమేసారు, హ, కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,707; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151
Dt : 18-Apr-2024, Upd Dt : 18-Apr-2024, Category : Songs
Views : 88 ( + More Social Media views ), Id : 2084 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Puttintollu Tharimesaru , Puttintollu Tharimesaaru , Puttintollu Tarimesaru , Vetagadu , NTR , Sridevi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content