వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RRR) జన్మదిన శుభాకాంక్షలు - రాజధాని రచ్చబండ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,290,437; 90 తత్వాలు (Tatvaalu) and views 176,253.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

* నిండైన భారీ విగ్రహం, గట్టి కంఠం, విషయ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, వాదనా పటిమ, నిత్యం వివిధ విషయాలపై ప్రెస్ మీట్ పెడుతూ, భయపడుతూ భయపెడుతూ,

సమస్యలపై స్పందిస్తూ, ఛలోక్తులతో, నవ్వులతో, పాటలతో, విమర్శలతో, మనిషి సంస్కారం ను బట్టి గౌరవ అగౌరవ జవాబులతో, సలహాలతో, నిరంతరం ఏదో ఒక సమాచారం వార్తలు ప్రజలకు అందిస్తూ,

అవసరమైతే కోర్టు కేసుల తో మేలుకొలుపుతూ, స్వపక్షం లో ప్రతిపక్షం లా, విపక్షం లో స్వపక్షం గా, అధికార ప్రతిపక్షాలకు అర్ధము కాకుండా నిద్ర లేకుండా,

సొంత నియోజక వర్గానికి వారి ప్రజలకు సమస్యలకు దూరముగా ఉంటూ,

ఢిల్లీ నుంచి ధైర్యముగా ఒంటరిగా గల్లీ దాకా వినపడే విధముగా రాజధాని రచ్చబండ తో రచ్చ రచ్చ చేస్తూ, ప్రజలు, జగనన్న మరియు రాష్ట్ర ప్రభుత్వ క్షేమము కై, పోరాడుతున్న

వైసీపీ నరసాపురం ఎంపీ శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు గారికి, జన్మదిన శుభాకాంక్షలు.

దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి, రాష్ట్ర ప్రజల మంచి కై, వివిధ అంశాల పై, పోరాడే శక్తిని ఇస్తారని ఆశిస్తున్నాము.

* కేవలం జగనన్న క్షేమమే కాకుండా, చంద్రన్న క్షేమం కూడా కోరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 10 ఏళ్ళ పైగా, చంద్రన్న పాలనలో, ఒక్క గట్టి నమ్మకమైన స్పెషాలిటీ ఆసుపత్రి లేక, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, చెన్నై హైదరాబాద్ వెళుతున్నారు అంటే, అది మొత్తము ఇన్నాళ్ళ చంద్రన్న అభివ్రుద్ది ఏ గదా, ఆంధ్రా లో అని గట్టి గా అడగాలని కూడా, ప్రజలు కోరుతున్నారు.

* జగనన్న చంద్రన్న లు, ప్రజా పన్నుల తో నడిపే పధకాలకు, తమ కుటుంబ పేర్లు పెట్టుకోవడాన్ని కూడా, గట్టి గా పొగడాలి. ఎవరి పక్షపాతం లేకుండా, గొప్ప పనులకు, రాజూ గారి పొగడ్తలు ఉంటాయని అందరూ అనుకోవాలి.

* అమరావతి పచ్చని 3 పంటల పొలాల లో, కాంక్రీటు పోసిన వారికి, వ్యతిరేకము గా, గట్టి గా నినదించాలని అభిమానులు కోరుతున్నారు.

* పార్లమెంట్ లో చట్టం చేసి, అందరూ అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, సోషల్ మీడియాలో పధకాల అమలు తీరు, పెట్టాలని అందరూ ఎంపీ లతో పాటుగా మిమ్మల్ని కూడా కోరాము. మరి ప్రయత్నం చేసారో లేదో తెలీదు. గట్టిగా మోదీ, అమిత్షా లను కలసి దాని ఉపయోగాలను చెప్ప గలరు.

* ముఖ్య అంశాల పై రాజు గారి రాజధాని - రచ్చబండ ప్రత్యక్ష ప్రసారం - ఈ వారము లో

- రాష్ట్రంలో కరోనా మరణాలపై అబద్దపు లెక్కలు
- 18-44 సంవత్సరాల మధ్య వారి వ్యాక్సినేషన్ విషయంలో సగటు మనిషి ఆవేదన,
- విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నా, రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టక పోవడం,
- రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలని మీడియా ముఖంగా ప్రోత్సహిస్తున్న సజ్జల
- ఆవ భూముల విషయంలో వై.వి.సుబ్బారెడ్డి పై, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి, ఉత్తర్వులు వచ్చి నెలలు గడుస్తున్నా కదలిక లేకపోవడం,
- సజ్జల వాళ్ళ సోషల్ మీడియా ద్వారా రాజు గారి ఫోన్ కి అసభ్యకరమైన పదాలతో మెసేజ్ ల ద్వారా దాడిచేయించడం

* రాజు గారిని తొలగించాలని, వైసీపీ వారు ఢిల్లీ వెళ్ళి విన్నపము ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,290,437; 90 తత్వాలు (Tatvaalu) and views 176,253
Dt : 13-May-2021, Upd Dt : 13-May-2021, Category : Politics
Views : 543 ( + More Social Media views ), Id : 1167 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : birthday , ycp , narasapuram , rebel , mp , kanumuri , raghurama , krishnamraju , Rajdhani , Rachchabanda
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content