శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా, ఆత్మను నేనే, పరమాత్మ నీవే - అల్లరి పిల్లలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,021; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

భక్తులము హైందవులమనే ప్రతి తెలుగు వారూ లేదా భారతీయుడు, సమానత్వం తో ఆడా మగా కూడా, సత్యనారాయణ స్వామి లేదా ఇంకో పాట, ప్రతి ఒక్కరూ పాడే ప్రయత్నం చేయాలి మనస్ఫూర్తిగా. శ్వాస ప్రక్రియకు, ఇది మంచి వ్యాయామము.

ఎందుకంటే కనీసం 10 వ తరగతి చదివి లేదా డిగ్రీ తో ఇంగ్లీష్ వెలగబెడుతూ, తేలిక మంత్రాలు శ్లోకాలు పూజ చూచి కూడా, చదవడం రాదని నాలుక తిరగదని మనసు ఒప్పదని, తమ తల్లి దండ్రుల పెంపక సంస్కారాన్ని తామే ఎత్తి చూపి, తప్పుకునే తప్పుడు వారు, మన చుట్టూ చాలా మంది చెపుతూ ఉన్నారు.

ఇక మామూలు మాటల పాటలు కూడా రావని చెబితే, వారి మొక్కుబడి నాటక కపటత్వం తో పాటూ, త్రికరణ శుద్ధి లేని పూజ స్పష్టం గా నిరూపితం అవుతుంది కదా. అది వారి పితరులకే అవమానము, మాత్రుభాషకు అపకారము, మన నాలుక మాటకే కే గ్రహచారము. రాహు కేతు మరియు శని దేవుళ్ళకు ఆవాసము.

నేటి మహిళలు హక్కుల సాధనలో, ఉద్యోగ ప్రాపంచిక వ్యామోహములో, గురుతరమైన పిల్లల పెంపకాన్ని దేవుని పూజ పాటలను వదిలేసినా, కనీసం పురుషులు అయినా, ఆ ఇంటి పతనాన్ని ఆపడానికి, ఇవి తప్పక నేర్చుకోవాలి.

సాధనమున పనులు సమకూరు ధరణిలో అని, తినగ తినగ వేము తీయగ ఉండును అని, కష్టే ఫలి అని సంపాదనలో చెపుతాము, కానీ దేహ ఆరోగ్యములో మరియు వాక్సుద్ది లో మరుస్తాము. అందుకే, ముందు మనలోకి మనము చూసుకోవాలి, సరి చేసుకోవాలి అనేది. ప్రపంచాన్ని గెలిచే మానవుడు కోట్లు సంపాదించినా, తనను మాత్రం తాను గెలవలేడు. అరిషడ్వర్గాలకు బానిసై, తర్వాత పతనం పొందుతాడు.

ఈ రోజుల్లో, వ్రతము చెయ్యాలి అంటే, ఉదయం 9 లోపు లేదా సాయంత్రము 6 తర్వాత, ఎవరికీ తీరిక లేదు. సినిమాలు షికార్లు నిద్ర సీరియల్స్ సోషల్ మీడియా తో ఫుల్ బిజీ.

దైవ అలంకారాలకు మరియు ఇతర డెకరేషను కు ప్రసాదాలకు ఎంతో సమయం వెచ్చించి, ఆర్భాటముగా ఖర్చు చేస్తారు. కానీ గొంతు ఎత్తి 4 పాటలు పాడమన్నా, గొంతు పెగలదు, మనసు కరుగదు, తన్మయత్వ ఆనందభాష్పాలు కూడా రావు కంటిలో, ఇంక ఉపయోగము ఏముంది?

ఒక మహిళ, పక్కన ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి, ఇంకో గౌరవ మహిళ చేతిలో తాంబూలం ప్రసాదం పెట్టలేదు, పూజ అయిన తర్వాత. పొరపాటున వెళ్ళినా, ఆయింటి ఆయన వచ్చి ప్రసాదం అందుకుంటాడు, మా ఆవిడ బిజీ ఇంకా తీరలేదు అని.

అలాగే వారు కూడా, పూజ అంటే అసలు రారు, వచ్చినా గొంతు ఎత్తి శ్లోకము లేదా పాట చెప్పలేరు. పోనీ చివరలో వచ్చి కూడా, ప్రసాదం తీసుకోరు.

బిజీ వాతావరణంలో ఎన్నో చిత్రాలు విచిత్రాలు. చదువు సంపాదన పెరిగి, సాంప్రదాయం సంస్కారం తిరిగే, మొక్కుబడి పూజలతో, సంతానం బుద్ది మందగించి, వెంపలి చెట్లకు కూడా నిచ్చెనలు వేసేటి వీరులు ముందుకు వస్తున్నారు, మన బ్రహ్మం గారు చెప్పినట్లు.

మనకు, భక్తి సాత్వికం లేని వారు, 100 మంది వచ్చి పాపం పెంచే కన్నా, పూజా ప్రసాదం ఉత్తములు ఒకరుకైనా ఇవ్వడం మాత్రమే ముఖ్యం సుమా, ఉదయం 9 లోపు వచ్చే వారు, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నది అందుకే. దానివలన మనకు ఎంతో పుణ్యం మనశ్శాంతి కూడా.

కమ్మటి ఈ గేయాన్ని, పాడే ప్రయత్నము చెయ్యడి. ఎంత బాగుంటుంది ఈ పాట వింటే, ఎంత మనశ్శాంతి. ఎంత అర్ధం ఉంది ఈ చిన్న పాటలో.

పల్లవి:
శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా, నా సామి శృంగార శ్రీనివాసా 2

చరణం 1:
ఆత్మను నేనంటివి దేహపరమాత్మ నీవేనంటివి 2
నీలోన నిలిచిపోనా.. నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాసా |శ్రీచక్ర శుభనివాసా|

చరణం 2:
కలవాడిననీ.. హరిఓం, సిరి కలవాడిననీ.. హరిఓం
మగసిరికలవాడిననీ.. హరి ఓం
మనసు పద్మావతికిచ్చి.. మనువు మహలక్ష్మికిచ్చినా, స్వామీ శృంగార శ్రీనివాసా

శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా 4

చిత్రం : అల్లరి పిల్లలు (1978), సంగీతం : సత్యం, రచన : C.S. రావ్, గానం: ఎస్.పి బాలు, పి.సుశీల

Sri chakra subhanivasa||Allari Pillalu||Satyam||Sp.Balu||Susheela
G. Ramakrishna, Jayachitra, Savitri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,021; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947
Dt : 15-May-2022, Upd Dt : 15-May-2022, Category : Songs
Views : 1133 ( + More Social Media views ), Id : 1390 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chakra , subhanivasa , swami , jagamelu , allari , pillalu , ramakrishna , jayachitra , savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content