ప్రజలలో ఉంటూ పనులు ల లో పోటీ పడే ఆమంచి మరియు రాజకీయ అనుభవ ఎమ్మెల్యే కరణం అండా కావాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,233; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నాయకులు అత్యుత్సాహం తో, జగనన్న కు తలనొప్పులు వద్దు, అని ఆర్టికల్ చూసాం, కోర్టు చీవాట్లు గురించి. మన మాటలు సౌమ్యంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, కోర్టుల జోలికి అసలు పోకూడదు. మనకు నచ్చినా, నచ్చక పోయినా, తప్పు అయినా, ఒప్పు అయినా, వేరే మార్గం లేదు.

బాపట్ల ఎంపీ సురేష్ గారు, మర్మగర్భంగా, ప్రశాంత తో, కోర్టు ల జోలికి పోకుండా, బాబు ను ఎత్తి పొడుస్తూ, ఇండైరెక్ట్ గా బాబు కాంటాక్ట్ ల ను, తెరవెనుక పనులు ను, ఎత్తి చూపారు. కాల్ డేటా వెరిఫై చేయమన్నారు - ఇది సౌమ్యమైన పద్దతి.

మన జన నాయకుడు ఆమంచి గారు, ఆవేశంగా దూకుడు గా, కోర్టు తీర్పు ను తప్పు బడుతూ, కరోనా ఉంది కాబట్టి, ధర్నా చేయలేకపోయాను, లేకపోతే చేసే వాళ్ళము. సీబీఐకి ఇలాంటి చిన్న కేసు ఇవ్వాలా అని ప్రశ్నించారు.

ఆ ఆవేశం, దూకుడు తగ్గాలి. బాపట్ల ఎంపీ గారి, అర్థం కూడా అదే. ఇక్కడ లౌక్యం గా ఉంది, ఆమంచి గారి మాటలలో అదే అర్థం, అయితే ఆవేశంతో ఉంది. అది కోర్టు దాకా చేరితే ధిక్కార నోటీసు వస్తుంది, అంతేగాక తటస్థంగా ఉండే వారికి నచ్చదు.

మన అభిమానులు ఎటూ మనకు ఉంటారు. కానీ, మనం తటస్థంగా ఉండే వారిని, అలాగే ఇతర పార్టీల వారిని, మనవైపు సౌమ్యంగా, మంచి మాటలతో తెచ్చుకోవాలి గానీ, ఆవేశంతో పోకూడదు. పోయిన సారి తగిలిన దెబ్బ లాగా, మరలా తగలకూడదు.

అలాగే కరణం గారి లాగా పూర్తిగా సైలెంట్ గా ఉంటే, కోవర్టు అన్న నమ్మకం బలపడుతుంది. ఆయన కూడా మెత్తగా ఖండించాలి మరియు ఆయన తరపున వెంకటేష్ లేదా ఇంకొకరు గట్టిగా ఖండించాలి, బాబు గారి పేరుతో. పోతుల సునీత గారు ఖండించారని విన్నాము.

ఇంకోటి బాపట్ల మరియు ఒంగోలు ఎంపీ గార్లు మరియు ప్రకాశం జిల్లా కు చెందిన ఇద్దరు మంత్రి వర్యులు కూడా, ఒకే పార్టీ లో ఉండే ఈ ఇద్దరు నూ, అంటే ఆమంచి మరియు కరణం గారిని, అంటే ఉప్పు నిప్పు లాగ ఉండే ఇద్దరు నూ, కూర్చున బెట్టి ఒక చోట, భార్య భర్తలు లాగా ఇంట్లో అరచుకోండి, అదీ బయట పడకుండా లేదా ఒకరి పై ఒకరు ఎత్తు లు పై ఎత్తు లు లేకుండా మాకు తలనొప్పులు కాకుండా, అని జాగ్రత్తలు చెప్పి నచ్చ చెప్పాలి.

మన పార్టీ లోగుట్టు వ్యవహారాలు, తగవులు బయటకు రాకూడదు. కావాలంటే ఎలక్షన్ ముందు, ఆరు నెలలు అరచుకోవచ్చు. అద్రుష్టము ఏమిటంటే, మిగతా పార్టీలు ఉన్నాయో లేదో కూడా సరిగ్గా జనాలకు తెలీదు, అది వైయెస్సార్ పర్టీకి అనుకూలము.

అలాగే మంచి పనులు ల లో పోటీ పడితే, ఎటూ గౌరవం మరియు వ్యక్తి విలువ పెరుగుతుంది. ఈ విషయంలో మాస్ లీడర్, ఆమంచి గారు ముందు ఉన్నారు. కరోనా సమయములో, చీరాల జనం లో తిరుగుతూ, ఎంతో మందికి సేవా కార్యక్రమాలు మరియు కూరగాయలు పంచుతూ, ప్రతి పనిలో ముందు ఉండి, నంబర్ వన్ గా చేస్తున్న, వందల సాక్ష్యం ఫోటోలు ఫేస్బుక్ లో ఉన్నాయి. మీరూ చూడవచ్చు.

కరణం గారు కూడా చీరాలలో ఉండి, కరోనా సేవలలో పోటీ పడాలి. ఎప్పుడు అయినా, నటన మరియు రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదం. ఇప్పుడు బాగున్నా, తర్వాత భవిష్యత్ మూసివేస్తుంది. అది వెంకటేష్ బాబు భవిష్యత్ కు అడ్డు పడుతుంది. చీరాల మరో అద్దంకి పరిస్తితి లా కాకూడదు.

సేవా కార్యక్రమాలు, ఆమంచి స్వాములు గారు చేసినా, వెంకటేష్ గారు చేసినా, అది వారి వ్యక్తిగతము గా ముద్రపడుతుంది కానీ, మాజీ ఎమ్మెల్యే లేదా ప్రస్తుత ఎమ్మెల్యే చేయవలసిన సేవలకు, బదులు మరియు సమానము కాదు. వెంకటేష్ గారి, భవిష్యత్ ప్రొజెక్షన్ అనుభవజ్ఞుల చేతిలో సరిగ్గా మరియు సహజముగా జరగడము లేదు.

మన పార్టీ లోగుట్టు వ్యవహారాలు, తగవులు బయటకు రాకూడదు. ఇరువురి పోటీలో, అధికారులు అభిమానులు నలగ కూడదు. కావాలంటే ఎలక్షన్ ముందు, ఆరు నెలలు అరచుకోవచ్చు. అద్రుష్టము ఏమిటంటే, చీరాల పట్టణములో, మిగతా పార్టీలు ఉన్నాయో లేదో కూడా సరిగ్గా జనాలకు తెలీదు. అప్పుడప్పుడు ఎవో కొన్ని చిన్న పనులు తప్ప, బలమైన లేదా రోజూ జనములో ఉండటానికి తగిన కసరత్తు చేయడము లేదు. అది వైయెస్సార్ పార్టీకి ఎంతో అనుకూలము.

ప్రజలలో తిరుగుతూ ఆవేశంతో పనులు ల లో చేతలలో పోటీ పడే ఆమంచి గారి అండా, రాజకీయ అనుభవం లో పండిన పెద్దాయన ప్రస్తుత ఎమ్మెల్యే కరణం గారి అండా, చీరాల ప్రజలకు ఇప్పుడు కావాలి. ఇద్దరూ కలిసి మెలసి క్రుషిచేసి, చీరాల వోడరేవు షిప్పింగ్ హర్బర్ ను తీసుకు రాగలగాలి. విడి విడి గా తెచ్చినా, అదే వారి రాజకీయ భవిష్యత్తుకు ఇంకో గీటు/ మైలు రాయి. అంతా మంచిగా ఉంటుంది అని భావిద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,233; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575
Dt : 23-May-2020, Upd Dt : 23-May-2020, Category : General
Views : 1183 ( + More Social Media views ), Id : 558 , City/ Town/ Village : Chirala , State : AP , Country : India
Tags : chirala , amanchi mass public activities , mla karanam political experience , vodarevu , shipping harbor
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content