చీరాల టు పర్చూరు వైసీపీ ఇంఛార్జి - స్ధానిక బలమైన నేత ను పదవి తో పంపే ప్రయత్నాలు, చర్చలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చీరాల ఎమ్మెల్యే కరణం గారు, వైసీపీ లో చేరినప్పుడు నుంచి, ఆమంచి గారి తో ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. కొంత మంది అధికారుల ట్రాన్స్ ఫర్స్ జరిగాయి. ఎవరికి వారు పై చేయి చేసుకోవడానికి, ప్రయత్నం చేస్తున్నారు.

పోతుల సునీత గారికి, మరలా ఎమ్మెల్సీ హామీ ఉందో లేదో తెలియరాలేదు. ప్రస్తుతం కు కరణం వైపు ఉన్నట్లు.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కి అండ విజయసాయిరెడ్డి గారు, ఆయన ప్రోద్బలంతో నే ఎన్నికల కు ముందు వైసీపీ లో చేరారు. గట్టి గా పోరాడారు, కానీ విధి వక్రీకరించింది.

కరణం గారిని, జిల్లా మంత్రి బాలినేని గారు పార్టీ లోకి తీసుకుని వచ్చారు. బాలినేని అండతో, ఒంగోలులో నే ఉంటూ, చీరాలలో పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి కుమారుడు యువ నాయకుడు వెంకటేష్, చీరాలలో చురుకుగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

వీరిద్దరి నిరంతర పోటీ తో, తలబొప్పి కట్టిన బాలినేని గారు, సజ్జల గారితో, కలసి రాజీ ప్రయత్నం లో భాగంగా, ఒకరు కు పర్చూరు వైసీపీ ఇంఛార్జి పోస్ట్ ఇచ్చి, సమస్య ను ప్రస్తుతం కు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు అని ఒక తెలుగు పత్రిక రాసింది.

కరణం గారి వైపు నుంచి చూస్తే, పార్టీ కి పర్చూరు సామాజిక వర్గ ప్రభావం తో అనుకూలం. కానీ కరణం గారు చీరాల ఎమ్మెల్యే గా ఉంటూ, పర్చూరు ఇంఛార్జి గా ఉంటే, ఇక్కడ ఆమంచి తో పోరు కొనసాగిస్తూ , అక్కడ కొత్త పోరు మొదలు పెట్టుకోవాలి.

స్ధానిక ఎమ్మెల్యే ఏలూరి గారికి వ్యతిరేకంగా పోరాడాలి. అద్దంకి చీరాల లో ఎదురు దెబ్బలు తో విసిగిపోయి ఉన్న కరణం గారికి ఇది అనవసర తలనొప్పి. కానీ పార్టీ కి అనుకూలం, ఉపయోగం. ఇలా చేసిన వెంకటేష్ భవిష్యత్తు కు సరైన దోవ, ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. కరణం గారి బదులు, వెంకటేష్ ను పంపవచ్చు. పార్టీ కి ఉపయోగం ఉండదు, కానీ రాజకీయం నేర్చుకోవడానికి ఉపయోగం, ఎదురు దెబ్బలు తిని. జగన్ గారు అలాగే నేర్చుకున్నారు.

ఇక ఆమంచి గారి వైపు నుంచి చూస్తే, పర్చూరు ఇంఛార్జి (ఇంకో కార్పొరేషన్ పదవి కలిపినా కట్టబెట్టినా కూడా), అనవసర వృధా ప్రయాస, పొమ్మన లేక పొగబెట్టడం. చీరాలలో ఉండి తరిగిన తన ప్రభను పెంచుకుంటే, వచ్చే ఎన్నికల కు మెరుగు పడవచ్చు. కరోనా సమయంలో గట్టి తోడుగా ఉన్నారు అని ప్రజల భావన, దానిని ఇంకా కొనసాగించవచ్చు. పిలిస్తే పలుకుతాడు అన్న పేరు ఉంది. చీరాల వైసీపీ కార్యాలయం ప్రారంభంతో, కొత్త ఒరవడి ఆరంభించారు.

అన్నిటికీ ఢీకొనే మనసు తో, అందుబాటులో ఉంటూ, ఆధునిక ప్రభుత్వ పాఠశాల కొత్తపేట లో కట్టించి, నూతన మార్కెట్ ను ఆవిష్కరించి, ప్రజలతో మమేకమై తిరిగే, గతంలో సొంతం గా పార్టీ పెట్టి గెలిచిన యువ నాయకుడు, ఇలా పక్క నియోజకవర్గ పరిధిలో కి వెళ్ళడం అంటే, తన స్ధాన బలం తగ్గించుకోవడం. కరణం గారి బలం, చేతులారా పెంచడం.

పర్చూరు సామాజిక వర్గ మద్దతు కష్టం. దాని బదులు చీరాలలోనే, తన సొంత పోరాటం తాను చేయవచ్చు, తన సొంత ఇమేజ్ పెంచుకోవచ్చు. చీరాలలో తనను గెలిచే వారు లేక, ఇతర ప్రాంతాల నుంచి నాయకులు ను తెచ్చుకోవడం, మరువలేని నిజం.

దాని బదులు గా, ఎవరూ పర్చూరు కు దొరకక పోతే పార్టీ క్షేమం కోసం, ఆమంచి సోదరుడు ను పర్చూరు పంపిన, ఆయన పట్టుసాధిస్తే పార్టీ కి ఆయనకు లాభం. సాధించకపోయినప్పటికీ, ఆమంచి కి చీరాలలో వచ్చే నష్టం ఏమీ లేదు.

పార్టీ కూడా బలమైన నాయకుల ను బలహీనం చేసి, రాబోయే ఎన్నికల్లో చీరాల స్ధానం ను, త్రిశంకు స్వర్గం లో ఉంచుకోవడం మంచిది కాదు.

ఇద్దరు నాయకులు కూడా చీరాల ఓడరేవు హర్బర్, కొత్త చీరాల జిల్లా, టెక్సటైల్ పార్కు వంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకుంటారని ఆశిద్దాం.

మరి ఇవన్నీ పుకార్లో లేక నిజాలో, పట్టణ రాజకీయ చదరంగంలో ఎటు పావులు ఎటు కదులుతాయో , త్వరలోనే చూద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 15-Jul-2020, Upd Dt : 15-Jul-2020, Category : Politics
Views : 578 ( + More Social Media views ), Id : 597 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , perchuru , ycp incharge , karanam , amanchi , yeluri , discussions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content