Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మన జిల్లా కు సంబంధించిన పెద్ద నాయకులు, ప్రస్తుతం అధికారం లో ఉన్నవారి ఫోటో చూడవచ్చు, పేర్లు తో.
వారి అండ దండలతో, మన కరణం గారు, షిప్పింగ్ హార్బర్ ను , పట్టుదలతో సాధించి, తన సత్తా ను చాటి, వెంకటేష్ బాబు కు, మంచి దోవ వేస్తారని ఆశిద్దాం.
ఎమ్మెల్యే శ్రీ కరణం గారు, చీరాల వాడరేవు ఫిషింగ్ హార్బర్ కూడా, మీ వలన పనులు మొదలు పెడితే, జగనన్న కు ఎంతో పేరు వస్తుంది కదా, స్ధానికంగా మీ ఇద్దరి పేర్లు సేవలు చిరస్థాయిగా నిలచిపోతాయి.
చంద్రన్న వల్ల గానిది, జగనన్న చేసి చూపారు అని, ప్రజలు కొనియాడుతారు. ఇక వైఎస్సార్ సీపీ పార్టీ ని, చీరాలలో ఓడించడం, ప్రత్యర్ధులు కు సాధ్యమేనా ఏనాటికైనా?
మీ మరియు మన వెంట, హేమా హేమీలు, రాజకీయ ఉద్దండులు దురంధరులు, పెద్దలు గొప్పవారు, చేతలలో పనులు చూపించేవారు ఉన్నారు కదా. మన పార్టీలో నే అండగా ఉన్నారు కదా, సహాయం చేస్తారు తప్పకుండా. మన ఆత్మీయులు అయిన వారు ఎవరంటే,
మన పెద్దాయన ఆత్మ బంధువు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు, జగనన్నకు పేరు వచ్చే పని కాదంటారా? వీలైంత ముందుకు తీసుకు పోరా? విజయ సాయి రెడ్డి గారి సప్పోర్ట్ మనకే గదా?
రాష్ట్రంలో సుపరిచితమే అయిన, స్వర్గీయ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరులు, ప్రస్తుత ఒంగోలు ఎంపీ శ్రీనివాసుల రెడ్డి గారు, మన పార్టీలో నే అండగా ఉన్నారు. ఎన్నోసార్లు ఎంపీ గా గెలిచి, రాజకీయ ఉద్దండులు అయిన వారికి తెలియని, నాయకులు మరియు రాజకీయాలు లేవు కదా.
అలాగే ముద్దు గా ఒంగోలు లో వాసన్న అని పిలవబడే, సౌమ్యుడు చిరు నవ్వుల మారాజు, మన అటవీ శాఖా మరియు విద్యుత్ శాఖామంత్రి వర్యులు, బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఎటూ అండగా ఉన్నారు.
ఇక కష్టపడి పైకి వచ్చి, ఉద్యోగం నుంచి నాయకులు గా ఉన్న, ఎర్రగొండపాలెం నుండి, మన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ గారు అండగా ఉన్నారు.
చిన్న తనం నుంచి కష్టాలు ఎదుర్కొంటూ, సామాన్య వ్యక్తి గా పేదరికం నుంచి వచ్చి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న, బాపట్ల ఎంపీ గారు నందిగామ సురేష్ గారు, మనకు అండగా ఉన్నారు.
నాకు ఓటేయని వారికైనా, పార్టీ వర్గ తార తమ్యాలు లేకుండా పట్టాలు ఇవ్వాలని, పబ్లిక్ గా మీడియా ముందు చెప్పిన, ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్ గురించి చెప్పనవసరం లేదు.
ఈ పెద్దలు అంతా, కొంత అయినా ముందుకు జరుపుదాము అంటే, ఏ శక్తి ఆపలేదు కదా ఇక ఆంధ్రప్రదేశ్ లో.
దయచేసి మన నియోజకవర్గ సమస్యలు ను పైన చెప్పబడిన, అనుభవజ్ఞులు రాజకీయ ఉద్దండులు శ్రేష్ఠులు, ఎంపీ మరియు మంత్రి వర్యుల అండతో సలహాలు సూచనలతో పూర్తి చేయాలని, చీరాల మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజల విన్నపము.
YSRCP Chief YS Jagan, Bapatla MP Nandigam Suresh, Education Minister Adimulapu Suresh , Balineni Srinivasa Reddy Minister for Energy, forest & environment, Ongole MP Magunta Sreenivasulureddy, V. Vijayasai Reddy MP Rajya Sabha, YV Subba Reddy TTD Chairman
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,067; 94 తత్వాలు (Tatvaalu) and views 184,764 Dt : 19-May-2020, Upd Dt : 19-May-2020, Category : Request
Views : 736
( + More Social Media views ), Id : 553 , City/ Town/ Village : Chirala , State : AP , Country : India
Tags :
chirala ,
vodarevu ,
fishing harbor ,
karnam ,
political support ,
ongole ,
bapatla ,
mp ,
ministers ,
jagan ,
balineni ,
magunta Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments