అన్ని జయించి ఎంతో సంపాదించినా, నన్ను జయించలేదు. మనసుపై నియంత్రణలే, నన్ను తెలుసుకోలేదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,353; 104 తత్వాలు (Tatvaalu) and views 229,694.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Even though I have conquered everything and gained a lot, I have not conquered myself. No mind control, dont know me.

*3 ఏళ్ళుగా ఇవి అందుకుంటూ ఉన్నా, మీరెవరో నాకు తెలీదు. ఏమిటీ ఈ తలనొప్పి అనుకున్నా ముందు, ఆపడం క్షణం పని, కానీ ఏదో దైవ కారణం లేనిదే ఇవి నాకు చేరవు. నా నుంచి మీరు కోరిందేమీ లేదు.
Although I have been receiving these for 3 years, I don't know who you are. Initially I thought headache, it is a minute task to stop, but they do not reach me without some divine reason. You didn't ask anything from me.

ఇప్పుడు అర్ధం అవుతుంది, అన్ని జయించి ఎంతో సంపాదించినా, నన్ను నేను జయించలేదు అని. నా మనసుపై నియంత్రణ లేదు, నన్ను నేను తెలుసుకోలేదు అని. అది నేను మొదలు పెట్టాలి మీ మార్గములోనే, త్యాగం కూడా చేసి చూపాలి. మా వాళ్ళకి స్నేహితులకి కూడా చెబుతాను, వారు ప్రయత్నం చేస్తారేమో, ఇప్పుడు నా చేతిలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంది.
Now I understand that even though I have conquered everything and gained a lot, I have not conquered myself. I have no control over my mind, that I do not know myself. I have to start it in your way and show it by sacrifice. I will also tell my friends if they will try, now I have direct evidence/ proof in my hands.

పాటలతో కూడా, మమ్మల్ని ప్రాణాయామం (శ్వాసప్రక్రియ, జలనేతి) చేయమని ఆరోగ్యాన్ని ప్రోత్సాహం చేస్తున్నారు. కరోనాకు ముందే, ఇంటి వైద్యం జాగ్రత్తలు పంపారు.
Even with the songs/ Slokas, you are encouraging us to do pranayama (breathing exercise, nose water cleaning/ jalaneti) for health. Before Corona also, home medicine precautions were sent to us.

ధైర్యం అంటే ఏమిటో చూసా, 3 ఏళ్ళు ఆదాయం లేకపోయినా, తొణకలేదు, బెణకలేదు, రాయడం మానలేదు, అప్పు లేదు, మమ్మల్ని తలచని రోజు లేదు, ఏనాటి రుణమో మీరు తీర్చుకుంటున్నారు.

I see what courage means, even if you don't have income for 3 years, you didn't get tension, you didn't get tired, you didn't stop writing, you don't have debt, you are thinking of us daily, you are paying off the old life debt.*

Reply - Above is the someone comment/ feeling/ question and we answered it politely but in Telugu. Every time writing in both languages is difficult. lol, If you want to know the reply, you have to ask best Telugu devotional responsible friend, who is loyal to own parents, what is the inner depth of that reply. Google translation will not do best, even not every Telugu known person, only responsible, loyal and devotional.

జవాబు - గురువు గారు, శుభోదయం, శుభదినం, శుభసంకల్పం. 3 ఏళ్ళ కైనా, మీలో మీ గురించి తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది, అదే మొదటి మెట్టు శుభారంభము, అరిషడ్వర్గాల సాధనకు, నిజమైన మానసిక దైవ పూజకు.

మన రాత మాట పాట ఆ దేవ దేవుని భిక్ష, మీ లాంటి సాత్విక గురువుల ఆశీర్వాదం. ఆయనకు సమర్పించిన మానసిక నైవేద్యాన్ని మీకు పంచుతున్నాము. స్వీకరిస్తారో, ఆపేసుకుంటారో, అవమానిస్తారో, కాలదన్నుతారో, మీ పుణ్యఫలం మరియు రాబోయే జీవిత గుణపాఠాల పై ఉంటుంది. మీకు పంపకపోయినా, వాట్సాప్ స్టేటస్ లో సోషల్ మీడియాలో ఉంటాయి. ఏ ఒక్కరికోసమో కాదు ఇవి, మన అందరికి.

మనకు సంబంధము లేదు, ఆయన ఆజ్ఞ మేరకు, జాగ్రత్తలు చెప్పి, నిద్ర లేపి, మోహం బయటకు తేవడానికి, ఇవి పంచడం వరకే మనపని. మనము అందరమూ ఆ దేవ దేవుని సంతానం, అందుకే ఆత్మ బంధువులు అంటారు. మీ ఆత్మ గురించి మీరు తెలుసుకో గలిగితే, మీరూ నేను ఆయనా ఒకటే.

ఇది సనాతన ధర్మ సాంప్రదాయం, వేద కాలం నుంచి ఉంది, ఇందులో మతానికి సంబంధము లేదు. ఆత్మవిమర్శ చేసుకోవడం, ప్రతి మనిషి కి అవసరం, పతనము కాకముందే. అది మనుషులకే సాధ్యం.

జంతువులకు రాక్షసులకు అరిషడ్వర్గాల బానిసలకు ఇది కుదరని పని, అర్ధం కాని గజి బిజి గందరగోళం.

ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళి మంత్రి లేదా కలెక్టర్ సీటు లో కూర్చోబెడితే లేదా నాగలి ఇచ్చి పొలములో నిలబెడితే, మనము ఏమి చెయ్యాలో తెలీక, అంత మందికి ఎలా జవాబు చెప్పాలో తెలీక జుట్టు పీక్కుంటాము.

అలాగే, ఆధ్యాత్మికత మనసు నియంత్రణ తెలీక, వీరూ అలాగే గేళి చేస్తారు, తలలు పట్టుకుంటారు.

భౌతిక పూజ, చిన్న పిల్లాడి నడక బండి లాంటిది, లేదా 10 వ తరగతి లాంటిది. వయసులో ఎదిగి, నడక బండి వదిలేది ఎప్పుడు? చదువులో ఎదిగి, డిగ్రీ కి వచ్చేది ఎప్పుడు? ఆధ్యాత్మికముగా ఎదిగేదెప్పుడు?

ప్రాపంచిక మాయకు దూరము అయ్యేది ఎప్పుడు? అరిషడ్వర్గాల బానిసత్వం వదిలేదెప్పుడు? దేవుని నీడనైనా చూసే అర్హత ఎప్పుడు? మనము దేవతల గుణ గణముతో, దేవుడు అయ్యెదెప్పుడు? ఎన్ని జన్మలు కావాలి?

ఇది ఎప్పుడైనా తప్పదు, 100 జన్మల అష్టకష్టాల కన్నీళ్ళు తర్వాత అయినా. జన్మలు పెరిగేకొద్ది, ఈనాడు ఉన్న మన సౌకర్యాలు సౌభాగ్యం ఉండదు సుమా. ఉద్యోగము లేదా వ్యాపారములో, నష్టము వస్తే, నమ్మకము కోల్పోతే, మన గత వైభవము తగ్గుతుంది కదా?

కొంత మంది, పెద్ద ఎదురు దెబ్బ తగిలాక లేదా కొందరిని తోడు లేదా కొన్ని పోగొట్టుకున్నాక అనుకుంటారు ఇక నుంచి ఆత్మవిమర్శ చేద్దాము అని.

కానీ సంవత్సరం లోనే, ఆ బాధ అలాగే ఆ ఆలోచన మరచి, మరలా అరిషడ్వర్గాలకు బానిసలౌతారు, మాయలో మునుగుతారు, ఇంకో జన్మను ఈ పాడు వాసనలతో సిద్దము చేసుకుంటారు.

మీరే కాదు, ఇవి అందుకునే వారిలో చాలా మంది మనకు తెలీదు, నాయకులు, అధికారులు మరియు ఇతరులు. ఎందుకు ప్రేరణ వచ్చిందో కూడా తెలీదు, ఆ అవసరము లేదు. మీరు మాకు, మేము మీకు, తెలియనవసరము లేదు. అలా ఊరు పేరు ఫోటో తెలియాలి అని తిరిగే వారు, మోహ వశులైన నాయకులు వారి అనుచరులు మరియు బానిసలు. మన గురించి మన గుణం, మన పనులు చెపితే చాలు కదా?

కానీ మనము తెలుసుకోవాల్సింది, ముందు మనల్ని మనము మరియు ఇతరులు చేస్తున్న సాత్విక మంచి పనులను. అలాంటి మన దగ్గరి మిత్రులతో కలసి, సాధన చెయ్యాలి. మన పేరు మన ఊరు మన ఫోటో తో అవసరము ఏముంది, కేవలము పనులు మాత్రమే ముఖ్యం - సజీవ గురు సేవ, ప్రదక్షిణ, నేల నిద్ర, శాఖాహారం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆరోగ్యం, . . .

మనము ఉన్నా లేకపోయినా, ధర్మం సత్యం పంచభూతాలు ఎప్పుడూ ఉంటాయి, మనల్ని ఒక కంట కనిపెడుతూ. వాటి సాక్ష్యాలను తుడపలేము సుమా, అవి ధనానికి అధికారానికి లొంగవు.

ఆ మంచి పనులు మనము కూడా ఆచరించి, ఆత్మ జ్ఞానాన్ని కొంతైనా సాధించవచ్చు, మాయకు దూరముగా ఉండవచ్చు, పంచభూతాల శిక్షలు తప్పించుకోవచ్చు. ఇది ఏ మతానికి సంబంధము లేదు, అందుకే సనాతన ధర్మము అంటాము - సజీవ గురువు సేవ ముదుసలి కన్న తల్లి దండ్రులు కు, ఆరోగ్యం, మనశ్శాంతి అన్ని మతాల మనుషుల కు కావాలి కదా?

మన ఆధ్యాత్మికత సాధన ఎంత బాగా సిద్దించింది అనేది, మనము 60 తర్వాత, మన సంస్కార పిల్లల తో (కనీసం ఒకరు) వారి ఇంట్లో ఉండ గలిగితే, కొంత పురోగతి ఉన్నట్లే సుమా. ఇది ఒకానొక కొలబద్ద, ఇంకొకరు చెప్పక్కరలేదు. ధనమిచ్చి వారితో ఉండలేము, కేవలము సంస్కారం నేర్పి మాత్రమే, అదీ మనకు తెలిసి ఉంటే, మనము సాధన చేసి ఉంటే నే.

మీరు ఇప్పుడైనా, కళ్ళు తెరిచారు, వాస్తవం కర్తవ్యం గ్రహించారు. ఒంటరిగా వచ్చి, ఒంటరిగా పోవాలి ఉత్త చెతులతో, అని జ్ఞానం ఉన్న అందరికీ ఇవి కావాలి.

మురికి మరక వస్త్రానికి ఎక్కువ అయ్యేకోద్ది, ఇంకా ఎక్కువ సబ్బు సర్ఫ్ పెట్టి, బండకేసి ఎక్కువ బాగా బాదాలి కదా?

మన స్నేహితులు కొంతమంది 10 ఏళ్ళుగా, మీరు పంపేది మేము చదవము గాక చదవము, స్పందించము అని భీష్మించుకు కూర్చున్నారు. వారికి నవ్వుతూ చెపుతాము - మీకు మంచి గురువులు తగిన సాధనా సామగ్రితో, రేపు రాబోయే రోజుల్లో ఎదురుదెబ్బ, రోగం, ఒంటరితనం, భాగస్వామి, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళే.

వారు ఇలా ఉత్త మాటాలతో చెపడం, గమ్ముగా ఉండటం ఉండదు. ప్రాక్టికల్ గా గుణపాఠాలు నేర్పుతారు. మరి మన సాత్విక పాఠాలు నుంచి తప్పించుకుంటే, పదోన్నతి లాగా, వారి చేతిలో రజో తమో గుణ పాఠాలు తప్పవు సుమా.

రేపు మనది కాదు, ఈరోజే అరిషడ్వర్గాల బానిసత్వం వదిలించుకుందాము, మనసు నియంత్రణ లో కి తెద్దాము, మనశ్శాంతిని పొందుదాము, మోక్షం వైపు అడుగులు వేద్దాము.

conquered everything gained a lot, not conquered myself. no control over my mind, do not know myself  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,353; 104 తత్వాలు (Tatvaalu) and views 229,694
Dt : 09-Jul-2022, Upd Dt : 09-Jul-2022, Category : General
Views : 519 ( + More Social Media views ), Id : 1457 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : conquered , everything , gained , myself , selfcontrol , mind , meditation , puja , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content