ఇదెమన ఆశ్రమ, రంగారుబంగారు, రావణు సంహరించి, శ్రీ రాఘవం, శ్రీవిద్యాం, స్త్రీ బాల - లవకుశ పద్యాలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,794; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మర్యాద, కష్టము సుఖాలను సమముగా చూడటము, ఇవన్నీ రామాయణము లో చెప్పబడినవి. లవకుశ సినిమాలో బాగా చిత్రీకరించారు అవి.

వచన పద్య రూపములో తేలికగా అర్ధము అవుతాయి. లక్ష్మణుడు అడవిలో సీతమ్మను వదిలేటప్పుడు చెప్పిన మాటాలు, వాటికి జవాబు గా సీతమ్మ చెప్పిన మాటలు, చివరగా వెళ్ళేటప్పుడు లక్ష్మణయ్య సీతమ్మ పాదాలకు నమస్కరిన్చే విధముగా చెప్పు మాటలను చూడండి. ప్రతి మాటలో ఎంతో ఓర్పు మర్యాద, అంత బాధా లో కూడా.

అడవిలో ఉన్న సీతమ్మ ను, వాల్మీకి ఆశ్రమం లోకి వచ్చి ఉండమని ఆహ్వానించడం ఈ పద్యం - ఇదె మన ఆశ్రమంబు. మీరూ ప్రయత్నం చేస్తారు కదూ.

ఇక దేవుని పద్యాలు పాటలు ప్రయత్నం చేయడం మంచిది. రాగం స్వర మాధుర్యం మనకు లేకపోయినా పర్లేదు, కానీ శ్వాస ఆపడం ప్రాణాయామం గొంతు జీర పోకుండా అంటే పీలగా రాకుండా ఉంటే, అందరికీ మంచిది.

గొంతు బాగా రాని వారు కూడా, ప్రయత్నం చేసిన మార్పు వస్తుంది. మనం మాట్లాడుతూ ఉన్న గొంతు వేరు, మన అసలు గొంతు వేరు. సాధనతో బయటకు తేవచ్చు ఆ మీ మంచి గొంతు ను. శ్వాస నియంత్రణ, ఆరోగ్యం కూడా.

నాయకులు, అధికారులు, చివరకు మనమైనా మన మాట స్పష్టంగా గట్టిగా ఉండాలి.

5. వాల్మీకి, సీతమ్మను గౌరవముగా ఆశ్రమానికి ఆహ్వానించుట, మా ఆశ్రమములో మీకు తగిన సేవలు చేస్తాము అని విన్నవించుట.

ఇదె మన ఆశ్రమంబు, ఇచటనీవు వసింపుము లోకపావనీ
సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ, తపస్వినుల్
ముదముగ రామ నామము 2, తపోవనమెల్ల ప్రతిధ్వనించూ . .
నీ పదములు సోకి, మాయునికి పావనమై చెలువొందు, నమ్మరో

6. సీతమ్మ నారచీరలు ధరించి, వారితో సామాన్య మహిళ వలే భోజనము చేయడం గురించి వాల్మీకి ఆవేదన

రంగారు బంగారు చెంగావులు ధరించు
శృంగారపతి నారచీర లూనె
భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు
కమలాక్షి కందమూలములు నమలె
చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు
జవ్వని మునిపర్ణ శాల నుండె
మరులుతో శ్రీరామునురముపై బవళించు
బాలికామణి యొంటి పవ్వళించె

తేటగీతి:
కన్నుసన్నల శుద్దాంతకాంత లాచరించు
సేవలు మెచ్చని కాంచనాంగి, యొగ్గె,
ముని ముగ్ధ కాంత కృతోపచార
విధికి, నెంచన సాధ్యంబు విధికి గలదే
https://www.youtube.com/watch?v=wP4jDQhMCrg

7. ఇతర మునులతో, వాల్మీకి రామాయణం కావ్యం కధను చెప్పడం

రావణు సంహరించి, రఘురాముడు దుర్భర కీలి కీలలన్
పావనియైన సీత, నసమాన పతివ్రత లోకమాత సం
భావన జేసి గైకొని, సుపర్వులు మెచ్చగా, లక్ష్మణుండు సు
గ్రీవుడు, వాయునందనుడు, ప్రీతిని గొల్వ అయోధ్య జేరినన్.

https://www.youtube.com/watch?v=duTy5R5pe4k

8. లవకుశులు అయోధ్య లో శ్రీ రాముల వారికి నమస్కరిస్తూ,

శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

9. సీతమ్మ తల్లి, ఆశ్రమములో అమ్మవారికి పూజ చేయడం

శ్రీ విద్యాం జగతాం దాత్రీం సృష్టి స్థితి లయేశ్వరీం !
నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సున్దరీమ్ !!

10. శ్రీ రామ చంద్రుడు, లవకుశలు తో యుద్దము చేయడానికి ముందు వాదోప వాదాలు

స్త్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనకాడు చుంటి
తాటక చంపుతో ఏటికీ ధర్మంబు తలుపలేదో చెప్పగలవటయ్యా

ముక్కుపచ్చారని మునికుమారులను చంపగూడటంచు నే బొంకు చుంటి
త్రిపుల పై ఎవరైనా క్రుప వహింతు రటయ్య బొంకు గాదది మీకు జంకు గానీ

చిన్ని పాపలు 2 కడసారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగిపొండి
వారుమును కాదు మిము కూడా వదలమయ్యా, రణమో శరణమో చెప్పు మా, రామచంద్రా

Lava Kusa Movie, Lakshmana Leave Sita in Forest Sentiment Scene,
NTR, Anjali Devi, kanta rao

http://www.ghantasala.info/newlyrics/lyric_00411.html  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,794; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171
Dt : 24-Jan-2021, Upd Dt : 24-Jan-2021, Category : Songs
Views : 4024 ( + More Social Media views ), Id : 939 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : intakubuni vachi , apavada bhushitayaina , pratidina menu , ide mana aaSramamu , lavakusa , movie , poems , ntr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content