పనికిరాని మంచితనం ఎవరికైనా ఉపయోగం ఉందా? భస్మాసుర సంతానం క్రుతజ్ఞతలు బాధ్యత? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎవరికీ లేదా అత్యవసరానికి పనికిరాని, ఉత్తుత్తి మంచితనం వలన ఎవరికైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేని ఉత్తమ సంతాన ఉపయోగం? ఎవరి మీద క్రుతజ్ఞతలు మరియు బాధ్యత వారికి? దేవుడు మెచ్చుతాడా?

జవాబు,

ఇంకొకరి దగ్గర కొట్టేసిన లేదా ఎవరో సంపాదించిన లేదా అదృష్టం తో కలసి వచ్చిన దానితో, బయట వందల ఖర్చు తో, ఎన్ని మంచి పనులు చేసినా లేదా చేయకపోయినా, ముందు మారాల్సింది అదుపులోకి రావాల్సింది, మన మనస్సు, దాని నిస్వార్ధ ఆలోచనలు.

ఇంట్లో పని అయినా ఇంట్లో లేదా పక్కన వారికి సాయం అయినా, త్యాగం తో మన సొంత సమయ కష్టం తో సొంత చేతులు తో, చిన్న సాయం పని అయినా చాలు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, అంతేనా?

అందుకే త్రికరణ శుద్ధి తో అన్నారు, అంటే మనసా వాచా కర్మణ, మనసు మాట చేతలు కలవాలి. అది లేనప్పుడు, అవే నటన మోసం భ్రమ ఆవేశం ఆవేదన గా, రూపాంతరం చెంది, ఏదో ఒకనాటికి, బయటకు వస్తాయి.

ఇతరులకు కీడు చేయకపోయినా గమ్ముగా నిర్లక్ష్యం గా ఉండే, చవటలను అంటే ఎవరికీ పనికిరాని వారిని, బుద్ధి మంతులు అనకూడదు. పనికిరాని మంచి బుద్ధి వలన, ఉపయోగం ఉందా?

మనిషి మంచే, కానీ ముదుసలి తల్లి తండ్రులు కు పనికిరాని వారు, ఎవరికీ మంచి చెప్పడానికి పనికి రారు, జీవిత భాగస్వామికి పనికి రారు, పిల్లల సంస్కార పెంపుకు పనికి రారు. ఇంక ఎవరికి పనికి వస్తారు, తమ స్వార్థం లేకుండా?

జీవితభాగస్వామి మాట విని లేదా తన సొంత నిర్లిప్తతతో తనే, అవసరం కు అమ్ముడుపోయి, తల్లి దండ్రులను వదిలే వారిని, మంచివారు అనగలమా?

సొంత సంతానన్ని ఏమీ అనలేక, బయట నుంచి వచ్చిన, అల్లుడు లేదా కోడలను తప్పు పడతామా? మన రత్నాలు బంగారాలు, అవసరాలకు లొంగిపోయి బానిసలుగా ఉంటే లేదా పట్టనట్లు ఉంటే, వారిది తప్పు కాదా?

ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదా? అంటే, మన తప్పుడు లక్షణాలకు పద్దతులకు ప్రతీక కాదా? మరి వారిని తప్పుడు వారు అని ఒప్పుకుంటే, ఎందుకు ఐశ్వర్యం ఆస్తి ఇచ్చి భస్మాసురులు గా బలవంతులను చేస్తున్నాము?

భస్మాసురుడు బలవంతుడయ్యి, తనకు సాయం చేసిన వారినే భస్మం చేయ ప్రయత్నాలు చేసి, చివరకు తనే భస్మం అయ్యాడు. అలాంటి భస్మాసురులు ప్రతి ఇంట్లో లేరా?

పురాణములను బట్టి, భీష్ముడు బుద్ధి మంతుడు, మంచి వాడు కాదా? మరి ద్రౌపదిని కాపాడ గలిగాడా, అంత శక్తిమంతుడు అయి ఉండి?

కర్ణుడు బుద్ధి మంతుడు మంచి వాడు కాడా? ధర్మం ను కాపాడడానికి, ఎలుగెత్తి ఇది తప్పు తప్పు అని కనీసం అరిచాడా, ఆపలేకపోయినా?

ఇద్దరూ యుద్దం ఆపగలిగారా? అసలు వీరే దానికి మూలం అయ్యారు, వీరు లేకుండా, సుయోధనుడు అసలు యుద్దానికి వెళ్ళరు.

పోనీ చెడుకు దూరముగా ఉన్నారా? అదీ లేదు.

అంటే అవకాశం, అవసరం, అధికారం, అందం, ఐశ్వర్యం, ఉద్యోగం కోసం లొంగిపోయిన బానిసలు అనవచ్చు నా? అలాంటి వారిని, అంటే తప్పా?

ఎవరికీ పనికి రాకపోయినా, మంచి వారు అని సర్దుకుందామా?

కానీ ఇద్దరు కూడా, చివరలో పాప ఫలితాలు తప్పించుకున్నారా? అవమానకరమైన బాధాకరమైన శిక్షలు పొందారు కదా?

నాణానికి రెండు వైపులా రెండు కధలు ఉన్నా, ధర్మం ఒక వైపే ఉంటుంది.

పాండవులా, కౌరవులా? వాలా, సుగ్రీవుడా? రాముడా, రావణుడా? క్రుష్ణుడా, నరకాసురుడా?

కాబట్టి వీలైనంత వరకు, ధర్మం వైపు ఉండాలి. మన పిల్లల తప్పులు సమర్ధన చేస్తే, చివరకి వారి చేతిలోనే, శిక్షలు తప్పవు.

ఎందుకంటే, మనమే వ్యామోహము లో, వారి తప్పులను చేతకాని తనాన్ని, సరిచేయకుండా, ఎత్తి చూపకుండా, పెంచి పోషించి, పెద్దగా చేసాము. దాని ఫలితాలు ముందు మనమే పడాలి, తర్వాత వారు, అలా పరంపర కొనసాగుతుంది.

అందుకే ముందు మనం మారాలి, ధర్మాన్ని కాపాడితేనే సమర్దిస్తేనే, అది మనల్ని కాపాడుతుంది.

మరి మీరేమంటారు? బాధ్యత బాధ తెలిసినవారైతే, మీ అభిప్రాయాలను చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 23-Jun-2021, Upd Dt : 23-Jun-2021, Category : General
Views : 502 ( + More Social Media views ), Id : 1214 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : useless , goodness , bhasmasura , daughter , son , kids , gratitude , responsibility , family
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content