ఎక్కడ చూసినా పట్టు దారాలు, వెండి తీగలు, ఆశ్చర్యము. వాటిని ఎత్త లేక, లెక్క బెట్ట లేక, దాచి పెట్టలేక - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2179 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2214 General Articles and views 2,474,643; 104 తత్వాలు (Tatvaalu) and views 265,881.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఎన్నో ఏళ్లుగా, ఇంట్లో రోజూ గదులు చిమ్ముతూ ఉంటే, ఎక్కడ చూసినా పట్టు జరీ దారాలు, వెండి తీగలు, అద్భుతము ఆశ్చర్యము. వాటిని ఎత్త లేక, లెక్క బెట్ట లేక, బీరువాలో దాచి పెట్టలేక, ఇబ్బంది పడుతూ ఉండే వాడిని.

ఉదాహరణకు, ఈ రోజు, ఓ ఇరవై పట్టు దారాలు, దొరికిన ఏమని ఆలోచన చేస్తాము? అయ్యో రేపు ఇక దొరకవేమోనని బాధ పడతాము. కానీ ప్రతి రోజూ వస్తూనే ఉన్నాయి, తరగకుండానే, విచిత్రంగా, 6 ఏళ్లుగా, ఏమిటీ ఈ దేవుని లీల.

ఒక్కోసారి మంచం మీద, ఇంకోసారి కూరలో, ఇంకోసారి అన్నంలో, నిజం గా. మరి ఎక్కడ దీ, తరగని చెరగని, అనంత దార రాశి సంపద?

ఇంకెక్కడిది, అమ్మ నెత్తిన ఉన్న కేశ సంపదే (జుట్టు) గదా అది. ఇందులేదు అందుగలదు అన్న సందేహం వలదు, ఎందెందు ( వెతకినా ) చూచినా, అందందే దొరకును, మన మాతృ శిరో కేశముల్.

ఇది సరదాకు మాత్రమే, అని రాము సోముతో చెపుతున్నాడు వాళ్ళ 74 ఏళ్ళ అమ్మ గురించి. ఈ పెద్ద వయసు లో రాలేకొద్దీ కేశములు తగ్గాలి, కానీ తగ్గడం లేదు, రాజకీయ నాయకుల హామీలు లా, వస్తూనే ఉన్నాయి విరిగినా.

అయినా పర్లేదు, చివరి వరకు చిమ్ముతా, అమ్మ శిరో కేశ సంపదను ఎత్తుతా, వెను వెంటనే తిరుమల వెంకన్న కు, మనసులో నే ఇక్కడనుంచి సమర్పిస్తా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2214 General Articles and views 2,474,643; 104 తత్వాలు (Tatvaalu) and views 265,881
Dt : 30-May-2020, Upd Dt : 30-May-2020, Category : General
Views : 926 ( + More Social Media views ), Id : 567 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jerry pattu threads , silver wires , cant count hold hide , mom hair
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content