నాయకుల, అధికారుల అత్యుత్సాహం, జగన్ కు తలనొప్పి - కోర్టు చీవాట్లు మరియు కన్నీళ్ళ కరెంట్ బిల్లు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,953; 104 తత్వాలు (Tatvaalu) and views 243,448.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చంద్రబాబు కాల్ డేటా బయట పెట్టాలి : వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ప్రజలకు ఏమి జరుగుతుందో వివరముగా తెలుసు, బాబుకు అన్ని విషయాలు ముందు ఎలా తెలుస్తున్నాయి, అన్ని తీర్పులు నిమిషాల ముందే, అని ప్రశ్నించారు.

ఆంధ్రజ్యోతి పేపరు నుండి ఈ 3 వార్తలు ను చూడండి. అంధ్ర ప్రదేశ్ హైకోర్టుతో ప్రభుత్వానికి అక్షింతలు. ఈ మూడు వ్యవహారాల వలన, జగన్ కు లేదా పార్టీ కి ఏమైనా లాభము అసలు ఉందా? లేదు కదా. చూడండి, జగన్ ను తప్పు దారి పట్టిస్తున్న సలహా దారులు.

1. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు (color to panchayati office) వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 623జీవోను కొట్టివేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా, పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం, మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని, రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

ఈనెల 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొందని - ప్రజాప్రయోజనాల వ్యాజ్యం చేసిన చింతలపాటి సోమయాజులు తెలిపారు.

పసుపు రంగు, చంద్రన్నను కాపాడిందా? ఎందుకు ఈ అనవసర రంగుల గొడవ? ఎవరు ఇస్తున్నారు ఈ సలహాలు? నవరత్నాలను బాగా ప్రజలకు అందిస్తే ఇక ఎన్నటికీ గెలుపు మనది కాదా?

2. ఐపీఎస్‌ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును (AB Venkateswara rao IPS), తిరిగి విధుల్లోకి తీసుకోవాలని,‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ, కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలను, పక్కనపెట్టిన హైకోర్టు.

అవసర విషయమా ఇది? ఇబ్బంది పెట్టలనుకుంటే, ఇంకో తేలిక మార్గమే ఉండదా? పోనీ, సరైన బలమైన వాదన, వినిపించలేమా?

3. డాక్టర్ సుధాకర్ గారి విషయములో (Dr Sudhakar, Vijag), విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది.

ఇది కూడా అత్యుత్సాహం తో, మెడకు తగిలించుకున్నదేనా? లేకపోతే, సరైన బలమైన వాదన వినిపించలేమా?


కొండెక్కిన కరెంటు బిల్లు , ఫోటో లో అంకెలు చూడండి. ఎందుకు ఇవన్నీ చేసి, జగన్ కు చెడ్డపేరు తెస్తున్నారో తెలియడం లేదు. ఎవరన్నా దగ్గర వారు ఉంటే, జాగ్రత్తలు చెప్పగలరు.

కరెంట్ బిల్లు కష్టాలు అందరికీ వస్తున్నాయి. మరి అది తెలిసి చేస్తున్నారా? లేక పొరపాటున జరుగుతుందా? ఇప్పుడు పంచాయితీ ఎన్నికల ముందు, ఈ ధరల పంచాయితీ అవసరమా? చాలా మంది బిల్లులు, ఫేస్బుక్ లో పెట్టి మరీ చూపిస్తున్నారు.

మనకు అందిన బిల్లు కూడా చూడండి, చిత్రము 2 లో, ఖాళీ ఇంటికి ఎప్పుడూ 75 వస్తుంది. ఇప్పుడు రెండు నెలలకు కలిపి ఎంత రావాలి? 150, 200, పోనీ, 250 రూపాయలు రావాలి. ఎంత వేసారో చూడండి. కంప్లైంట్ ఇచ్చాము, చూద్దాము ఏమి జరుగుతుందో.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,953; 104 తత్వాలు (Tatvaalu) and views 243,448
Dt : 22-May-2020, Upd Dt : 22-May-2020, Category : Politics
Views : 976 ( + More Social Media views ), Id : 556 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaders , officers , aggressive , powers , headache to jagan , electricity bill tears , andhra high court rebuke , nandigam suresh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content