Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మండోదరి, రాక్షస జాతి లో పుట్టినా కూడా, ఉత్తమ ఇల్లాలు మరియు పతివ్రత. ధర్మం ను వీడలేదు ఎన్నడూ. సీతమ్మ తల్లి ని చెర పట్టి తెచ్చిన విషయం తెలిసి, చాలా బాధ పడింది.
మండోదరి కూడా, విభీషణుడు మాదిరిగా, రావణుడు కి పరి విధాలు గా చెబుతానే ఉంది. రాముని (మంచివారు) వద్ద నుంచి సీతమ్మ (పరాయి వాళ్ళ ధనం/ సంపద/ వస్తువు) ను తేవడం, ఇక్కడ ఉంచడము తప్పు. చుట్టపు చూపుగా (మన వద్ద అప్పు గా పెట్టిన ధనం) వచ్చిన వారిని, ఇక్కడ బంధించడం ఇబ్బంది పెట్టడం తప్పు. మన దగ్గర ఇన్ని రోజులు ఉంచుకోవడం తప్పు అని.
నేను, నాతో పాటుగా ఎంతో మంది అందగత్తె లు (సొంత తండ్రి తాతల ధనం మరియు ఆస్తి పాస్తులు), నీ దగ్గర అధీనంలో లేదా బంధీలుగా ఉన్నారు కదా. అయినా తృప్తి లేదా, ఆశ చావదా?
వేరొకరి భార్య (ధనం) తో నీకేమి పని? రాముడు మంచి వాడు, ధర్మ గుణం కలవారు. అలాంటి వారితో విరోధం, వారి కన్నీళ్లు ఆక్రోశం బాధ, మనకు కీడు మరియు వంశ నాశనం తప్పదు.
రాముని (మంచి వారి) వద్ద కు సీతమ్మ (వాళ్ళ ధనం) ను తోడ్కొని వెళ్లి, తప్పు ఒప్పుకుని, శరణు వేడి, దండం పెట్టి చెంపలేసుకుని వద్దాం, పద అని అర్ధించింది.
రావణుడు, మితిమీరిన మదం అహంకారం తో విర్ర వీగాడు, గేలి చేసాడు, పగలబడి నవ్వాడు. అర్భకుడు, సైన్యం లేని ఒంటరి రాముడు ని చూసి, భయపడాలా నేను అని, ఆమె మాటలు లెక్క చేయలేదు.
శ్రీ రాముని కి (మంచి వారికి) సీతమ్మను (వారి ధనం) తిరిగి ఇవ్వను, ఏం జరిగితే అదే జరుగుతుంది, వంశ నాశనం అయినా పర్లేదు అన్నాడు.
ఆఖరికి మండోదరి ఏమీ చేయలేక దిక్కుతోచని స్ధితిలో, సీతమ్మ తల్లి దగ్గరకు పోయి కూడా, కన్నీళ్ళు తో దండం పెట్టి వేడుకుంది. కోపగించకు తల్లి, శాంతంగా ఉండు, కన్నీరు కార్చకు, శపించకు. నువ్వు, నీ భర్త మంచి తనానికి, సహనం కు, బూడిద అవుతాము, మా జాతి వంశము.
అమ్మా క్షమించు, నా భర్త, నా మాటలు వినడం లేదు , నేనెంత నచ్చ చెప్పినా. అశక్తురాలను, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు అని చెప్పి వేడుకుంది.
ధర్మం తప్పలేదు. భర్త ను సమర్ధించలేదు, ఏనాడు తప్పులు లో. అవి రాక్షస లక్షణాలు గుణాలు, మనకొద్దు ఈశ్వర భక్తులకు ఉండకూడదు, అని స్పష్టంగా చెప్పినది.
ఆ తర్వాత ఏమైందో మనందరి కీ తెలుసు. రావణ వంశము మరియు వారిని సమర్ధించిన వారూ మొత్తం అశువులు బాసారు. అధర్మం ముందు గెలిచినా, విర్రవీగినా, ఆ తర్వాత అయినా, చివరకు మూల్యం చెల్లింపు తప్పదు.
మరి అలాంటి పతివ్రతలు, ఈ కాలంలో ఉన్నారా? అలా భర్త తప్పులు ను ఎత్తి చూపి సరిచేస్తారా? ముఖ్యంగా అప్పు తీసుకున్న వారు, వడ్డీ వ్యాపారస్తులు పరాయి ధనం, వస్తువుల తో జాగ్రత్తగా ఉండాలి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,440; 104 తత్వాలు (Tatvaalu) and views 258,585 Dt : 08-Feb-2020, Upd Dt : 08-Feb-2020, Category : Devotional
Views : 1921
( + More Social Media views ), Id : 327 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mandodari ,
ravana ,
ramayanam ,
sri rama ,
sita Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments