ఎక్కువగా గుడి లో లేదా స్నేహితులతో పూజ. ఇంట్లో మొక్కుబడిగా. వ్యక్తిగత సాధన ముఖ్యం అంటున్నారు? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ నేను ఎక్కువగా, గుడి లో లేదా స్నేహితులతో పూజ లో పాల్గొంటాను. ఎక్కువ సేపు అక్కడ ఉంటాను. ఇంట్లో ఏదో మొక్కుబడిగా ఓ 10 నిమిషాలు పూజ మాత్రమే. కానీ మీరు వ్యక్తిగత సాధన ముఖ్యం అంటున్నారు. అంటే, నేను పూజ చేసినట్లు కాదా? వివరము గా చెప్పండి.

జవాబు - మంచి ప్రశ్న. మీలో, ఇప్పుడే జిజ్ఞాస రగులుకుంటుంది. సూక్ష్మముగా, తప్పు, ఒప్పు తేడా తెలుసుకోవాలని అనుకోవడం, గొప్ప విషయం. మా మాటలు అర్ధం కూడా, మీ దగ్గర ఉన్న, మంచిని ఆచరణలో చూపే పెద్దలను అడిగితే, చెపుతారు. ఎప్పుడు లాగనే, పెద్దలు, ఇందులో తప్పులు సరి చేయవచ్చును.

ఓ 10 వ తరగతి పిల్లవాడు, నేను రోజూ బడికి, ప్రవేట్ కు వెళ్ళా, కానీ తప్పాను లేదా 35 మార్కులు మాత్రమే వచ్చాయి ఎందుకు, అని మిమ్మల్ని అడిగితే ఏమి చెపుతారు? బడి, ప్రవేట్ లది లేదా మాస్టారుది తప్పు అంటారా? ఇక వెళ్ళొద్దు అంటారా? లేక, అక్కడ చెప్పినది, సరిగ్గా ఇంట్లో సొంతముగా సాధన మరియు మననము చేయలేదు, అంటారా?

అది చదువు, కరాటే, పరుగుల, నడక, మంత్రం, భక్తి, సంగీతం, ఏదైనా, పదిమందిలో నేర్చుకున్నందుకు విన్నందుకు, కొంత విలువ ఎటూ ఉంటుంది. కానీ ఎక్కువ విలువ, మనము ఒంటరిగా కఠిన సాధన చేస్తే నే, ఉంటుంది.

ఒకే ఇంటి కుటుంబం లో 5 గురు కూర్చుని పూజ చేసినా, ఎవరి మానసిక ధ్యానం, వారే ఒంటరిగా చేయాలి, తమ కళ్ళు మూసుకుని. ఎందుకంటే, అరిషడ్ వర్గాల ప్రభావం, ఆ 5 గురు లో కూడా, వివిధ స్థాయిలలో మానసిక బలం ఉంటుంది కదా?

60 శాతం, పైన మార్కులు వచ్చే విద్యార్ధిని అడగండి, తను, ఎలా కష్టపడాలో చెపుతాడు. ఉదయాన్నే 5 కే లెగుస్తాడు, చదివి, కాగితం మీద మరలా మరలా రాస్తాడు, నోట్స రాస్తాడు, మిత్రులతో అదే చర్చిస్తాడు, రాత్రి కూడా, మరలా నెమరు వేస్తాడు. అంటే, తన మనస్సు అంతా, దాని మీదే లగ్నం అయి ఉంటుంది. ఎందుకంటే, ఒంటరి సాధన, చాలా ముఖ్యం.

మరి దేవుని దగ్గర, నిర్లక్ష్యం ఎందుకు? సినిమాకు 3 గంటలు, ఇంటర్నెట్ కు 2 గంటలు, షికారు కు 2 గంటలు, భాతాఖానీ కి 2 గంటలు, స్నానానికి అరగంట. కానీ ఇంట్లో మానసిక ధ్యానం కు మాత్రం, అరగంట సమయం దొరకదు.

పూజలు దేనికి, దేవుని కోసమా? కాదు, మన లోని అరిషడ్ వర్గాలను జయించడానికి, ప్రాపంచిక మోహం నుంచి మనల్ని మనమే కాపాడుకోవటానికి. అవి ఎవరి మనసుకు వారికే తెలుసు, తప్పులు ఒప్పులు. సాధన కూడా, తను మాత్రమే ఒంటరిగా చేయాలి, ఎక్కువ ఫలితము కోసము. పదిమందిలో విన్నా నేర్చుకున్నా, వచ్చే 35 మార్కులు మనకు చాలవు.

మనకు 60 మార్కుల పైన పుణ్యం, పూజ లో కూడా రావాలంటే, మనమే సొంతముగా అరగంట భౌతిక పూజ చేయాలి ఇంట్లో కూడా. అలాగే కనీసము అరగంట నుంచి గంట, ఒంటరిగా, ఉదయం 5 కి లేదా రాత్రి లేదా ఒంటరి సమయం లో, ఇంట్లో మానసిక ధ్యానం కూడా చెయ్యాలి.

మేము శని వారం గుడి కి వెళ్ళినా, ఉదయం 4.30 నుంచి 7 దాకా, ధ్యానం పూజలు అన్ని మన ఇంట్లో అయిన తర్వాతనే, ఇతర ప్రదేశాలకు వెళ్ళేది సహజముగా.

అవి సొంతము గా, సాధన చేసిన వారే, గాడి తప్పుతున్నారు. ఇక మనము ఊరక, బయట విన్నది చూసింది చాలు అనుకుంటే, ఇంక మనకు సొంత ఏకాగ్రత వస్తుందా?

50 శాతం పైన పుణ్యము కు, అసలు ఈ జన్మలో చేరతామా? అది మీ ఇష్టం, బాహ్య మోహములో చిక్కుకుని, ఇలాగే ఈ బాధలు కష్టాలు, తర తరాలు పొందాలి అనుకుంటే, మీ ఇష్టం.

కోట్లు సంపాదించిన వారు కూడా, మానసిక బలం లేక, ఆత్మహత్యలకు లేదా పతనాలకు పోతున్నారు, చివర్లో ముదుసలి వయస్సులో తమ సొంత పిల్లలే వదిలేస్తున్నారు, వార్తలు చూస్తున్నాము కదా.

మనము గుడి దగ్గరకు లేదా తెలిసిన వారి ఇంటి పూజకు వెళితే, మన చూపులు, మనస్సు, ఎంత ఎకాగ్రత తో ఉంటాయో తెలుసు. పది మంది తో, అనవసర కబుర్లు ఆగవు కదా? ఆఖరికి వ్రత పీటల మీద ఉన్నవారు కూడా, ఏకాగ్రత లేకుండా, అటు ఇటూ చూసి, నవ్వాలి పలకరించాలి. ఇప్పుడు ఫోన్ సెల్ఫీలు ఇంకో హంగామా.

కాబట్టి, ఎవరి మనసు పైన సాధన వారే, సొంతము గా ఇంట్లో ఒంటరిగా చేయనిదే, అరిషడ్ వర్గాలను పూర్తిగా జయించలేరు.

పుణ్య క్షేత్రాలలో శక్తి ఉన్నా, అది అందుకునే అర్హత మనకు ఉండాలి కదా. తీర్ధ యాత్రలకు వెళ్ళి వచ్చిన, అత్తా కోడలు, తెల్లారి, మరలా వీధిలో పోరాటము. తప్పు వారిదే కానీ, గుడిది కాదు కదా?

పూజ అనేది, కేవలము ఒక మెట్టు మాత్రమే సుమా. అందుకే, పిల్లలకు చిన్నప్పటి నుండే, అలవాటు చేపిస్తే, వారికి అదే సాధన అవుతుంది, రోజూ కనీసం అరగంట, వారి మానసిక బలం పెరగడానికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 12-Sep-2021, Upd Dt : 12-Sep-2021, Category : General
Views : 82 ( + More Social Media views ), Id : 1249 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worship , temple , friends , home , personal , practice , meditation , dhyan , important
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content