జగన్ కు సహకరించక, నత్త నడక లో సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ - రాష్ట్ర మరియు జిల్లాల లో - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,188,591; 104 తత్వాలు (Tatvaalu) and views 243,138.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన సమాచార మరియు పౌర సంబంధాల శాఖ పని తీరు చూడండి, ఫోటోలు తో సహా ఇందులో. రాష్ట్రం మరియు జిల్లా లో కూడా అంతే. ముఖ్యమంత్రి శ్రీ జగన్ కు, మంత్రులకు, అధికారులకు, ఎక్కువ నష్టం చేస్తుంది, ఈ శాఖే అని అనాలేమో.

వీరి బాధ్యతలు లో 2 ముఖ్యమైనవి 1. న్యూస్ పేపర్ యాడ్ లు ఇవ్వడము 2. తాము సొంతముగా వెబ్సైట్ మరియు సోషల్ మీడియలో వివరణలు, ఫోటోలు, వీడియోలతో ప్రచారము చేయడము. మనము 2 వ దాని గురించి మాట్లాడుతున్నాము.

ఒక న్యూస్ పేపర్, వారికి ఇష్టమైన నాయకుల ను ఏ విధంగా పొగుడుతుందో, అలా ఈ శాఖ రోజూ, మన అధికార నాయకులను, మంత్రులను, కలెక్టర్ మరియు అధికారులు ను పొగుడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల ను గురించి, పుంఖాను పుంఖాలుగా, తమ సొంత వెబ్సైట్ మరియు సోషల్ మీడియా లో కూడా, రోజు కి ఓ పది పదిహేను పోస్ట్ లు పెట్టాలి, ఫోటోలు వీడియోలతో. పాత ప్రభుత్వము కంటే, జనానికి చాలా జరిగిపొతున్నాయి అని చూపించాలి, ఎటూ జరుగుతున్నాయి కాబట్టి.

ఈ శాఖ వెబ్సైట్ లో పని చేసే, అధికారులు లిస్టు ఓ చాంతాడు అంత ఉంటుంది. కానీ ప్రచారం లో మాత్రం, రోజు కు ఒకటి, రెండు రోజుల కు ఒకటి, కంటి తుడుపుగా వేస్తున్నారు, మేమూ ఉన్నాము అనిపించుకోవడానికి. ఇక జిల్లా శాఖ గురించి, ఎంత తక్కువ చెప్పుకుంటే, అంత మంచిది.

మీకు తెలికగా అర్ధము కావాలి అంటే, మనము పెళ్ళికి ఒక మేళ తాళాల వారిని మరియు పాటలు పాడే వారిని పెట్టుకున్నాము అనుకోండి, ఓ 3 గంటల సమయము కోసము, వారు ఆ 3 గంటలు అదే పనిలో ఉండాలి నిబద్దతతో, జనము చెవులు చిల్లులు పడాలి, వద్దు రా బాబొయ్ ఓ పది నిమిషాలు ఆపు, అనాలి మనము.

కానీ అలా కాకుండా నీరసముగా ఏదో తప్పదు అన్నట్లుగా, గంటకో పాట గంటకో మోత లాగా ఉంటే, ఇంకో సారి వారిని పిలుస్తామా? ఎందుకు పిలిచామా అని తల పట్టుకుంటాము కదా. అలాంటి పరిస్థితి.

మంత్రి గారికి తెలియక పోవచ్చు, ఈ శాఖను ఎలా ఉపయోగించుకోవాలో. కానీ సీనియర్ అధికారులు, వివరించి చెప్పి, అన్ని కార్యక్రమాలను, మంత్రులను, అధికారులను గురించి విపరీత ప్రచారము చేయాలి కదా.

సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ - సమాచార, ప్రచారం మరియు ప్రజా సంబంధాల వ్యాప్తి మరియు ప్రసారం ద్వారా దాని లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తుంది.

సమర్థవంతమైన ప్రచారం కోసం ఈ విభాగం, తన బహుళ మీడియా వ్యవస్థలను నిర్వహిస్తుంది మరియు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించడంలో సిగ్నల్ సేవను నిర్వహిస్తుంది మరియు ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు మరియు సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలపై, అన్ని వర్గాల ప్రజలలో అవగాహన కల్పిస్తుంది.

Dear AP and Prakasam Dt Info and Public Relations (I & PR) officers,

People are not able to find any good information either from District Collector official website or on social media (same situation in AP state website). We didn't even find I & PR social media page, like we have AP I & PR Facebook page. You can see more details in our articles.

ప్రజలు, జిల్లా కలెక్టర్ గారి అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా సోషల్ మీడియాలో (రాష్ట్ర వెబ్సైట్ లో కూడా), మంచి సమాచారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర, ఐ మరియు పీఆర్ ఫేస్బుక్ పేజీని కలిగి ఉన్నట్లుగా, జిల్లా, ఐ మరియు పీఆర్ సోషల్ మీడియా పేజీ కూడా లేదు. మీరు మా కథనాలలో మరిన్ని వివరాలను చూడవచ్చు.

Please make sure, Info and PR of Prakasam District (even AP State website), maintains the up to date information of the district on social media and on district official website also. It will help public and journalists.

దయచేసి, ప్రకాశం జిల్లా (రాష్ట్ర వెబ్సైట్ లో కూడా) సమాచారం మరియు పిఆర్, సోషల్ మీడియాలో మరియు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా, జిల్లా యొక్క తాజా సమాచారాన్ని నిర్వహిస్తున్నారని నిర్ధారించగలరు. ఇది ప్రజలకు మరియు పాత్రికేయులకు సహాయం చేస్తుంది.

We hope you are supporting and full filling the wishes and interests of I & PR Minister Sri Perni Venkataramaiah garu and also CM Sri YS Jagan, to reach more information to the public. You are the main people to give publicity to the Govt programms, which are maintained by AP Govt, District Collector and other District level officers. But we are not finding any district level publicity from you by social media and website updates.

ప్రజలకు మరింత సమాచారం చేరడానికి మీరు, సమాచార శాఖా మంత్రి శ్రీ పెర్ని వెంకటరామయ్య గారు మరియు సిఎం శ్రీ వైయస్ జగన్ యొక్క కోరికలు మరియు ఆసక్తులకు, పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని మేము ఆశిస్తున్నాము. ఎపి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు నిర్వహిస్తున్న, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం ఇవ్వడానికి, మీరు ప్రధాన వ్యక్తులు. కానీ మేము మీ నుండి సోషల్ మీడియా మరియు వెబ్‌సైట్ నవీకరణల ద్వారా, జిల్లా స్థాయి ప్రచారం కనుగొనడం లేదు.

Here are the govt links, which are not updated. If you have alternate links for this following or if you have separate I & PR links, please let us know, so that we can publish for the public. Please see the below table.

నవీకరించబడని ప్రభుత్వ లింకులు ఇక్కడ ఉన్నాయి. ఈ క్రింది వాటి కోసం, మీకు ప్రత్యామ్నాయ లింకులు ఉంటే లేదా మీకు ప్రత్యేకమైన ఐ మరియు పీఆర్ లింకులు ఉంటే, దయచేసి మాకు తెలియజేయండి, తద్వారా మేము ప్రజల కోసం ప్రచారం చేస్తాము. దయచేసి క్రింద పట్టిక చూడండి.

Even through we have so many ministers and Govt officials, they should daily produce more posts with some programs or publicity about on going activities, but they are showing only press meets or just text or few photos on twitter.

మనకు చాలా మంది మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, వారి రోజువారీ కొన్ని కార్యక్రమాలు లేదా కార్యకలాపాల గురించి, ప్రచారంతో ఎక్కువ పోస్టులను పెట్టాలి, కాని వారు ట్విట్టర్‌లో, ప్రెస్ మీట్స్ లేదా టెక్స్ట్ లేదా కొన్ని ఫోటోలను మాత్రమే చూపిస్తున్నారు.

If these district official links are not related to I and PR department, please forward to the related officials and please give your related links.

ఈ జిల్లా అధికారిక లింకులు, ఐ మరియు పిఆర్ విభాగానికి సంబంధించినవి కాకపోతే, దయచేసి సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేయండి మరియు దయచేసి మీ సంబంధిత లింకులను ఇవ్వగలరు.

Thanks ధన్యవాదములు
Prakasam Dt Public and Journalists ప్రకాశం జిల్లా ప్రజలు మరియు జర్నలిస్టులు
AP and Prakasam Dt Info & Public Relations (I & PR)
SNoState/ DistrictName/ CommissionerSocial Media/ WebSite
నవీకరిస్తోంది (Latest Updated)
1PrakasamSri K Narayana Reddy Asst Dir, I & PR Direct District I & PR website link not found

Collector - Aug, 2019 - Aug, 2019
> News - Weekly 1 update on average, just heading and photos, no event details, no participated guests and officer names
> Press Release - Aug, 2019
2AndhraSri T. Vijay Kumar Reddy IIS - Avg 1 video only daily, this info won't match with Twitter text and photos, they have to update both together.
- It is updating with text and few photos, but not posting on facebook. Both should be posted simultaneously.
- Avg 1 video only daily
- WebSite
- Press Releases - No photo with press release(but photo available in separate photos link) , No daily updates
 
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.


Photo/ Video/ Text Credit : I & PR Dept and Prakasam Collector websites
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,188,591; 104 తత్వాలు (Tatvaalu) and views 243,138
Dt : 19-May-2020, Upd Dt : 19-May-2020, Category : Request
Views : 1138 ( + More Social Media views ), Id : 551 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : no publicity support , cm jagan , dept info public relations , snail walking , state , districts , Pola Bhaskar , K Narayana Reddy , Assistant Director I PR , YS Jagan , perni venkataramaiah
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content